
Chiranjeevi Bhola Shankar: రీ ఎంట్రీ తర్వాత మెగాస్టార్ చిరంజీవి జోరు కుర్ర హీరోలు కూడా తట్టుకోలేకపోతున్నారు.ఆయన స్పీడ్ ని చూసి ఈ వయస్సు లో కూడా ఇంత ఎనర్జీ ఎలా సాధ్యమని ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు.ఖైదీ నెంబర్ 150 మరియు ‘సై రా నరసింహా రెడ్డి’ చిత్రాల తర్వాత చిరంజీవి నుండి ఆచార్య , గాడ్ ఫాదర్ మరియు వాల్తేరు వీరయ్య వంటి సినిమాలు వచ్చాయి.ఈ మూడు సినిమాలకు కేవలం మూడు నెలల గ్యాప్ మాత్రమే ఉన్నింది.
Also Read: Renu Desai Health: రేణు దేశాయ్ కి తీవ్ర అస్వస్థత..పూణే కి బయలుదేరిన పవన్ కళ్యాణ్
వీటిల్లో ఆచార్య మరియు గాడ్ ఫాదర్ చిత్రాలు ఫ్లాప్స్ గా నిలవగా , ‘వాల్తేరు వీరేయ్య’ చిత్రం మాత్రం ఇండస్ట్రీ లో ఉన్న రికార్డ్స్ అన్నిటినీ బద్దలు కొట్టి సుమారుగా 140 కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చేసింది.రాజమౌళి సినిమాలు మరియు అలా వైకుంఠపురం లో సినిమా మినహా మిగిలిన ఏ సినిమాకి కూడా ఈ రేంజ్ వసూళ్లు రాలేదు.
అంతటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ఆయన మెహర్ రమేష్ తో కలిసి ‘భోళా శంకర్’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతుంది.తమిళం లో సూపర్ హిట్ గా నిల్చిన అజిత్ ‘వేదలమ్’ సినిమాకి రీమేక్ గా తెరకెక్కబోతున్న ఈ సినిమాని ఈ ఏడాది ఆగష్టు 11 వ తేదీన విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.అయితే ఈ సినిమా తర్వాత చిరంజీవి ఏ సినిమా చెయ్యబోతున్నాడు అనే దానిపై క్లారిటీ లేదు.చాలామంది ప్రముఖ యంగ్ డైరెక్టర్ వెంకీ కుడుముల తో ఒక సినిమా చేయబోతున్నారని ఇది వరకే పలు ఇంటర్వ్యూస్ లో తెలిపిన చిరంజీవి ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ ఊసే ఎత్తడం లేదు.

దాంతో ఈ చిత్రం అట్టకెక్కింది అనే రూమర్ బాగా ప్రచారం అయ్యింది.’వాల్తేరు వీరయ్య’ ప్రొమోషన్స్ లో కూడా తన తదుపరి సినిమా dvv దానయ్య మరియు యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో చేస్తున్నాని తెలిపాడు, కానీ డైరెక్టర్స్ ఇప్పటి వరకు ఖరారు కాలేదు.ఇప్పుడు లేటెస్ట్ గా వినిపిస్తున్న వార్త ఏమిటంటే చిరంజీవి ‘భోళా శంకర్’ తర్వాత కొంత కాలం సినిమాలకు విరామం ఇవ్వనున్నారని తెలుస్తోంది.
Also Read: Pathan Box Office Collection: 20 రోజుల్లో 1000 కోట్లు..చరిత్ర సృష్టించిన షారుక్ ఖాన్ ‘పఠాన్’