MLC Kavitha- Dubai: కల్వకుంట్ల కవిత.. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ముద్దుల తనయగా, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలి తెలంగాణ ప్రజలకు పరిచయం. ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్న తర్వాత 2014 లోక్‌సభ ఎన్నికల్లోల ఆమె నిజామాబాద్ ఎంపీగా విజయం సాధించారు. ఐదేళ్లు ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు. 2019 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి అర్వింద్ చేతిలో పరాభవం పొందారు. ఏడాదిపాటు ఖాళీగా ఉన్నారు. తన కూతురు ఖాళీగా ఉండడం నచ్చని కేసీఆర్ ఆమెను స్థానిక సంస్థల ఎమ్మెల్సీని చేశారు. మంత్రి పదవి కూడా ఇవ్వాలనుకున్నారు. అయితే ఎస్టీ మంత్రిని తొలగించాల్సిన పరిస్థితి ఉండడం, గిరిజనులు, లంబాడాల నుంచి వ్యతిరేకత వస్తుందన్న ఆలోచనతో మంత్రి పదవి ఇవ్వలేదు. ప్రస్తుతం శాసన మండలి సభ్యురాలిగా కవిత ఉన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో బతుకమ్మ ఉత్సవాలతో కవిత ఫేమస్ అయ్యారు. బతుకమ్మ ఆడేందుకు పైసలు లేకపోవడంతో చందాలు వేసుకున్నామని, తన ఒంటిపై నగలు అమ్మేశానని ప్రచారం చేసుకుని తెలంగాణ మహిళల్లో మంచిపేరు తెచ్చుకున్నారు. ఇలాంటి కవిత ఇప్పుడు కోట్లకు పడగలెత్తింది. బతుకమ్మ ఆటతో తెలంగాణలో మాత్రమే ఫేమస్ అయిన కవిత ఢిల్లీ లిక్కర్ స్కాం కేసుతో జాతీయస్థాయిలో ఫేమస్ అయింది. అయితే ఈ లిక్కర్ స్కాంను మించిన దందా దుబాయ్‌లో చేయాలనుకున్న విషయం తాజాగా ఆరోపణలు వస్తున్నాయి. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
Also Read: MLC Kavitha: కళ తప్పిన కవిత.. అరెస్ట్ భయమే ఆమెను వెంటాడుతుందా!?
దుబాయ్‌లో బ్యాంకు కోసం దరఖాస్తు..
ఢిల్లీ లిక్కర్‌స్కాంలో ఇటీవల అరెస్ట్ అయిన కవిత మాజీ ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబు కవిత దందాల్లో చాలా కీలకం. ఆయన సలహాతో కవిత దుబాయ్‌లో బ్యాంకు పెట్టాలనుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. లిక్కర్ స్కాం కంటే ముందే ఈ ప్రయత్నం చేశారు. ఆడిటర్ బుచ్చిబాబు సహకారంతో దుబాయ్ ప్రభుత్వానికి ఈమేరకు దరఖాస్తు కూడా చేశారని సమాచారం. దుబాయ్‌లోని తెలుగువారు, ఇండియన్స్ సొంత ఊళ్లకు పంపే డబ్బుల ద్వారా వచ్చే కమీషన్ కోసమే కవిత బ్యాంకు పెట్టాలనుకుందని తెలుస్తోంది.
వేల కోట్ల కమీషన్..
కమీషన్ అంటే.. ఐదు, పది రూపాయలు.. మహా అయితే వెయ్యి రూపాయలు ఉంటాయి కదా దానికోసం బ్యాంకు పెట్టడం ఏంటి అనుకుంటున్నారా..? సాధారణమే అందరూ అలాగే అనుకుంటారు. కానీ కవిత వందో, వెయ్యి కోసమో బ్యాంకు పెట్టాలనుకోలేదు. దీని వెనుక వేల కోట్ల రూపాయల ఆదాయం ఉంది. అందుకే కవిత కన్ను దుబాయ్ బ్యాంకుపై పడినట్లు సమాచారం. దుబాయ్‌లో ఇండియా నుంచి లక్షల మంది ఉన్నారు. అక్కడ రోజు కూలీ నుంచి ఇంజినీర్లు, వ్యాపారుల వరకు పనిచేస్తున్నవారు ఉన్నారు. తెలంగాణలో వీరంతా నెలనెలా తమ సంపాదనలో ఎక్కువ భాగం ఇండియాకే పంపిస్తున్నారు. దుబాయ్ బ్యాంకుల లెక్కల ప్రకారం గడిచిన ఎనిమిదిన్నర ఏళ్లలో దుబాయ్‌లోని ఇండియన్స్ అక్కడి నుంచి రూ.1.50,000 కోట్లు ఇండియాకు పంపించారు.
దుబాయ్‌లో పెట్టుబడులు..
ఇక దుబాయ్‌లో పెట్టుబడి పెట్టే ఇండియన్స్ సంఖ్య కూడా పెరుగుతోంది. గడిచిన రెండేళ్లలో భారతీయులు అక్కడ ఏటా రూ.30 వేల కోట్లకుపైగా పెట్టుబడి పెట్టారు. రెండేళ్లలో సుమారు రూ.70 వేల కోట్లు పెట్టుబడి పెట్టినట్లు అంచనా. ఇందుకోసం మన దేశ కరెన్సీని దుబాయ్ బ్యాంకులకు బదిలీ చేసుకున్నారు.
కమీషన్‌పై కవిత కన్ను..
దుబాయ్‌లో పనిచేసే భారతీయులు పంపే డబ్బుల ద్వారా అక్కడి బ్యాంకులు భారీగా కమీషన ఆర్జిస్తున్నాయి. అదేవిధంగా ఇండియన్ దుబాక్‌కి పంపించే రూపాయల ద్వారా కూడా అధిక మొత్తంలో అక్కడి బ్యాంకులకు కమీషన్ వస్తోంది. దుబాయ్‌లో పనిచేసే భారతీయులు ఇండియాకు పంపించే డబ్బుల్లో 15 శాతం కమీషన్ అక్కడి బ్యాంకులు వసూలు చేస్తున్నాయి. ఈ లెక్కన ఎనిమిదన్నరేళ్లలో పంపిన రూ.1,50,000 వేల ద్వారా రూ.22,500 వేల కోట్ల కమీషన్ ఆర్జించాయి. అదే విధంగా ఇండియా నుంచి రెండేళ్లలో పంపిన డబ్బుల ద్వారా రూ.10 వేల కోట్ల ఆదాయం వచ్చింది. దీంతో ఈ కమీషన్ గురించే ఆడిటర్ బుచ్చిబాబు కవితకు సలహా ఇచ్చారు. దుబాయ్‌లో బ్యాంకు ఏర్పాటు చేయడం ద్వారా ఈ కమీషన్ అంతా ఆర్జించవచ్చని తెలిపాడు. ఈ బ్యాంకు ద్వారా ఏటా రూ.10 కోట్ల ఆదాయం వస్తుందని పేర్కొన్నాడు. ఏమీ చేయకుండానే లీగల్‌గా వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తుండడంతో కవిత కూడా బ్యాంకు ఏర్పాటుకు సై అన్నట్లు సమాచారం. అందకే అక్కడి ప్రభుత్వానికి దరఖాస్తు కూడా పెట్టుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.
లిక్కర్ స్కాం కేసులో ఈడీ అదుపులో ఉన్న బుచ్చిబాబును ఈ బ్యాంకు విషయంపై కూడా ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. ఇది బయటపడితే లిక్కర్ స్కాంను మించిన స్కాం అవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
Also Read: Jagan- Early Elections: ముందస్తు ఎన్నికలపై క్లారిటీ.. తేల్చేసిన జగన్