https://oktelugu.com/

Ram Charan- Upasana : నెరవేరిన కల: ఎట్టకేలకు చిరంజీవి తాత, రాంచరణ్ తండ్రి కాబోతున్నారోచ్..

Ram Charan- Upasana : రాంచరణ్ తోపాటు పెళ్లిళ్లు అయిన అల్లు అర్జున్ , మహేష్ బాబు, ఇతర హీరోలకు ఇద్దరు పిల్లలున్నారు. వారింట్లో పిల్లలతో సందడిగా మారుతోంది. వారి వీడియోలతో సోషల్ మీడియాలో అల్లరిని అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. కానీ పెళ్లి అయ్యి 10 ఏళ్లు అయినా కూడా చిరంజీవి ఇంట్లో వారసుడి ముచ్చటే లేదు. రాంచరణ్-ఉపాసన దంపతులు పిల్లల కోసం గ్యాప్ పాటిస్తుండడంతో చిరంజీవికి తాత కావాలన్న కోరిక నెరవేరడం లేదు. అపోలో హాస్పిటల్స్ […]

Written By: NARESH, Updated On : December 12, 2022 3:23 pm
Follow us on

Ram Charan- Upasana : రాంచరణ్ తోపాటు పెళ్లిళ్లు అయిన అల్లు అర్జున్ , మహేష్ బాబు, ఇతర హీరోలకు ఇద్దరు పిల్లలున్నారు. వారింట్లో పిల్లలతో సందడిగా మారుతోంది. వారి వీడియోలతో సోషల్ మీడియాలో అల్లరిని అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. కానీ పెళ్లి అయ్యి 10 ఏళ్లు అయినా కూడా చిరంజీవి ఇంట్లో వారసుడి ముచ్చటే లేదు. రాంచరణ్-ఉపాసన దంపతులు పిల్లల కోసం గ్యాప్ పాటిస్తుండడంతో చిరంజీవికి తాత కావాలన్న కోరిక నెరవేరడం లేదు.

Ram Charan- Upasana

chiranjeevi family

అపోలో హాస్పిటల్స్ వ్యవహారాలు చూసుకుంటూ మెగా కోడలు ఉపాసన అత్యంత పెద్ద పోస్టులో ఉన్నారు. ఆ వ్యవహారాలతోనే బిజీగా ఉన్నారు. ఇక హీరోగా రాంచరణ్ కూడా క్రూషియల్ పొజిషన్ లో మొన్నటి వరకూ ఉన్నారు. ఎదుగుతున్న క్రమంలో ఈ ఇద్దరూ పిల్లలను కనేందుకు.. ఇప్పుడే పోషించేందుకు వారి బాగోగులు చూసుకోలేమని డిసైడ్ అయ్యి గ్యాప్ పాటించారు. కానీ చిరంజీవి సహా కుటుంబ సభ్యుల ఒత్తిడి తీవ్రం కావడం.. రాంచరణ్ ఆర్ఆర్ఆర్ తో ప్యాన్ ఇండియా స్టార్ కావడం.. ఉపాసన కూడా ఆపోలో ఆస్పత్రి వ్యవహారాలను తగ్గించుకోవడంతో ఈ జంట పిల్లలను కనేందుకు సిద్ధమైంది. ఎన్నేళ్లో వేచి ఉదయం ఇప్పుడు నెరవేరింది. ఎట్టకేలకు మెగా అభిమానులకు గుడ్ న్యూస్ అందింది. రాంచరణ్ తండ్రి కాబోతున్నట్టు తెలిసింది.

Ram Charan- Upasana

Ram Charan- Upasana

2012 మెగాపవర్ స్టార్ రాంచరణ్ తో అపోలో సంస్థల అధినేత మనవరాలు అయిన ఉపాసనకు వివాహం ఘనంగా జరిగింది. దాదాపు పదేళ్ల తర్వాత వీరి జంట బిడ్డకు జన్మనివ్వబోతోంది. రాంచరణ్ తండ్రి కాబోతున్న విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి ట్విటర్ ద్వారా తెలియజేయడం విశేషం.

చాలారోజులుగా పిల్లల కోసం ఎదురుచూస్తున్న చిరంజీవి సహా మెగా కుటుంబ సభ్యుల కోరిక ఇన్నాళ్లకు తీరబోతోంది. ఇటీవల సౌతాఫ్రికా సహా పలు టూర్లు వేసిన రాంచరణ్-ఉపాసన జంట ఎట్టకేలకు ఈ శుభవార్తను చెప్పింది. మెగా ఇంట కొత్త పండుగ వాతావరణాన్ని సృష్టించింది.