https://oktelugu.com/

Mukesh Ambani : బిగ్గెస్ట్ డీల్ పూర్తి.. దీంతో దేశంలోని గొప్ప అతిపెద్ద మీడియా సామ్రాజ్యాన్ని సృష్టించిన అంబానీ

ఇప్పటివరకు  మన దేశంలో ఎన్నో మీడియా హౌస్ లున్నాయి. వాటి వాటి రీచ్ ఆధారంగా ప్రజల ఆదరణ పొందాయి. అయితే ఇప్పటివరకు స్టార్ గ్రూప్, సన్ గ్రూప్ నకు చెందిన మీడియా హౌస్ లు మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి. అయితే ఈ జాబితాలో సన్ గ్రూప్ ఇక రెండవ స్థానానికి పరిమితమయ్యే అవకాశం కనిపిస్తోంది.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : November 14, 2024 / 09:56 PM IST

    Reliance Industries and Walt Disney

    Follow us on

    Mukesh Ambani : మన దేశ మీడియా చరిత్రలో అతిపెద్ద విలీనం పూర్తయింది. 70, 353 కోట్ల విలువైన అతిపెద్ద మీడియా సామ్రాజ్యం ఏర్పాటయింది..  ముకేశ్ అంబానీ ఆధ్వర్యంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్, వాల్ట్ డిస్నీ చేతులు కలిపాయి. ఈ విలీనం ఎప్పుడో జరిగినప్పటికీ.. ఇప్పుడు ఆ క్రతువు పూర్తయింది. ఫలితంగా దేశంలోనే అతిపెద్ద మీడియా సామ్రాజ్యాన్ని రిలయన్స్ ఇండస్ట్రీస్, వాల్ట్ డిస్నీ ఏర్పాటు చేశాయి. అయితే ఇంతటి పెద్ద సంస్థకు ముకేశ్ అంబానీ సతీమణి నీతా అంబానీ చైర్ పర్సన్ గా వ్యవహరిస్తారు.. వైస్ చైర్ పర్సన్ గా ఉదయ్ శంకర్ కొనసాగుతారు. ఈ సంస్థ వృద్ధికి రిలయన్స్ ఇండస్ట్రీస్ 11,500 కోట్లు పెట్టుబడిగా పెడుతుంది.. వాస్తవానికి ఈ విలీనం కొద్ది నెల క్రితమే పట్టాలెక్కింది. దీనికి సీసీఐ, ఎన్సీఎల్టీ ఇటువంటి నియంత్రణ సంస్థలు అనుమతులను జారీ చేశాయి. ఇక ఈ కంపెనీలో రిలయన్స్ కు సంబంధించిన అనుబంధ కంపెనీలకు 63.16 శాతం వాటా ఉంటుంది. వాల్ట్ డిస్నీ కి 36.84 శాతం వాటా ఉంటుంది. ఈ విలీనం వల్ల దాదాపు 100కు పైగా టీవీ చానల్స్ ఓ గొడుగు కిందికి వస్తాయి.. వీటన్నిటిని జియో స్టార్ గా వ్యవహరిస్తారు. ఇప్పటివరకు జియో సినిమా, డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వేరువేరుగా ఓటీటీ ప్లాట్ ఫారం లను కొనసాగిస్తున్నాయి. అయితే ఈ విలీనం ద్వారా ఇవన్నీ ఒకే గొడుగు కింద పనిచేస్తాయి.. ఓటీటీ ప్లాట్ ఫారం జియో స్టార్ పేరుతో  మారుతుందని.. యూజర్లకు సరికొత్త వినోదాలను అందిస్తుందని రిలయన్స్, వాల్ట్ డిస్నీ వర్గాలు చెబుతున్నాయి.. ఇప్పటివరకు జియో సినిమాలో హాలీవుడ్ సినిమాల కంటెంట్ ఉంది. జియో సినిమా కూడా సొంతంగా వెబ్ సిరీస్ లు నిర్మిస్తోంది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ కూడా ఇదే తీరుగా సినిమాలను, సొంతంగా వెబ్ సిరీస్ లను నిర్మిస్తోంది. ఇవి రెండు ఏకమవుతున్నాయి కాబట్టి.. యూజర్లకు విస్తృతమైన కంటెంట్ లభించనుంది.
    వాటికి దెబ్బే!
    తాజా విలీనం ద్వారా దేశంలో అతిపెద్ద మీడియా గ్రూపు గా జియో స్టార్ అవతరించనుంది. ఫలితంగా సన్ గ్రూప్, ఇతర ఇండియా హౌసులు తమ స్థానాలను కోల్పోయే అవకాశం ఉంది. వందల కొద్ది చానల్స్ జియో స్టార్ పరిధిలోకి వస్తే అప్పుడు మీడియా రంగంలో సరికొత్త పోటీ ఎదురవుతుంది. ప్రస్తుతం ఓటిటి వేదికలో నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ హవా కొనసాగిస్తున్నాయి. జియో సినిమా వచ్చినప్పటికీ వాటి ఆధిపత్యానికి గండికొట్ట లేకపోయింది. అయితే ఇప్పుడు జియో స్టార్ ఏర్పడిన తర్వాత నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ కు గట్టి షాక్ ఎదురవుతుందని తెలుస్తోంది. ఇప్పటివరకు ఈ రెండు ఓటీటీ లు సినిమాలను, ఇతర ఒరిజినల్ కంటెంట్ అందిస్తున్నాయి. జియో స్టార్ అతిపెద్ద ఓటిటిగా అవతరించిన నేపథ్యంలో.. పెద్ద ఎత్తున సినిమాలను అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉంది. ఈ ప్రకారం భారీగా సినిమాలను కొనుగోలు చేసి వినియోగదారులకు సరికొత్త వినోద ప్రపంచాన్ని జియో స్టార్ పరిచయం చేస్తుందని తెలుస్తోంది. అయితే టారిఫ్ ధరలు ఎలా ఉంటాయి? ఛానళ్ల సబ్ స్క్రైబ్ ధరలను ఎలా నిర్ణయిస్తుందనేది? త్వరలో తేలనుంది.