
Chiranjeevi- Balakrishna Mogilaiah: కొద్దిరోజులుగా బలగం ఫేమ్ మొగిలయ్య తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీర్ఘకాలంగా ఆయనకు కిడ్నీ సమస్య ఉంది. అది తీవ్రం కావడంతో డయాలసిస్ చేస్తున్నారు. మొగిలయ్య ఆరోగ్యం మరింత క్షీణించింది. ఆయనకు డయాలసిస్ చేస్తుంటే గుండెపోటు వచ్చింది. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తీసుకువచ్చారు. ప్రస్తుతం ఆయనకు కిమ్స్ లో చికిత్స జరుగుతుంది. మొగిలయ్యను పలురకాల సమస్యలు వేధిస్తున్నాయి. డయాబెటిస్ కారణంగా కంటి చూపు కూడా కోల్పోయారు.
మొగిలయ్య పరిస్థితి తెలుసుకుని చలించిపోయిన చిరంజీవి అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. మొగిలయ్యకు కంటి చూపు వచ్చేందుకు అవసరమైన చికిత్స సొంతగా భరించేందుకు ముందుకు వచ్చారు. ఈ విషయాన్ని బలగం డైరెక్టర్ వేణుకు చిరంజీవి ఫోన్ చేసి చెప్పారట. మొగిలయ్యకు చూపు రావాలి. దానికి కావాల్సిన చికిత్సకు అయ్యే డబ్బులు తాను సమకూరుస్తానని హామీ ఇచ్చారట.
తాజాగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. మొగిలయ్య భార్య ఓ ఇంటర్వ్యూలో పాల్గొనగా చిరంజీవి చేసిన సహాయం గురించి స్వయంగా బయటపెట్టారు. ఇక చిరంజీవి మంచి మనసు తెలిసిన అభిమానులు ఆయన్ని కొనియాడుతున్నారు. పరిశ్రమలో ఎవరికి ఎలాంటి కష్టం వచ్చినా నేనున్నానని ముందుకు వచ్చే చిరంజీవి ఎందరికో స్ఫూర్తి ప్రదాత అంటున్నారు. చెప్పాలంటే మొగిలయ్యకు పరిశ్రమతో పెద్దగా సంబంధం లేదు.

అయినప్పటికీ తెలుగు సంస్కృతిలో భాగమైన బుర్రకథలు చెప్పే వృత్తిలో ఉన్నారు. ఆయన టాలెంట్ బలగం మూవీతో అందరికీ తెలిసింది. అయితే అప్పటికే మొగిలయ్య తీవ్ర అనారోగ్యంతో భాదపడుతున్నారు. కిడ్నీ చికిత్స కోసం లక్షలు అప్పు చేశారట. మొగిలయ్యను ఆదుకునేందుకు తెలంగాణగా ప్రభుత్వం కూడా ముందుకు వచ్చింది. అవసరమైన వైద్య సహాయం ప్రభుత్వం తరపున అందించాలని ఆదేశాలు జారీ చేశారు.