Chicken Price : ఆదివారం రాగానే మాంసం లేనిదే కొందరికి ముద్ద దిగదు. దీంతో మాంసాహార ప్రియులు చికెన్ లేదా మటన్ కర్రీ ఉండే విధంగా ఏర్పాటు చేసుకుంటారు. ఈ క్రమంలో చికెన్ సెంటర్లు కూడా కొనుగోలుదారులతో కిటకిటలాడుతూ ఉంటాయి. అయితే ఇటీవల బర్డ్ ఫ్లూ కారణంగా చికెన్ తినడం తక్కువగా అయిందని కొందరు అనుకుంటున్నారు. కానీ చికెన్ ధరలు మాత్రం అమాంతం పెరుగుతూనే ఉన్నాయి. నిన్నటి వరకు కేజీ చికెన్ రూ. 300 ఉండగా.. ఆ తర్వాత తగ్గుతూ వచ్చింది. అయితే నేడు మరింత తగ్గినట్లు తెలుస్తోంది. మరి ఈరోజు చికెన్ ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..
Also Read : చికెన్ వారానికి ఎన్నిసార్లు తినాలి?
చికెన్ అంటే లొట్టలు వేసుకొని తినేవారు చాలామంది ఉంటారు. కానీ ఈ మధ్య చికెన్ అంటే భయపడిపోతున్నారు. ఇటీవల విజయవాడలో బర్డ్ ఫ్లూ కారణంగా ఓ చిన్నారి మరణం ఆందోళన కలిగిస్తుంది. దీంతో కొంతమంది చికెన్ తినడానికి వెనుకడుగు వేస్తున్నారు. అయితే పౌల్ట్రీ పరిశ్రమలో ఉత్పత్తి కూడా తగ్గడంతో మార్కెట్లోకి కోళ్లు రావడం తగ్గిపోయాయి. దీంతో చికెన్ ధరలు పెరిగిపోయాయి. మరోవైపు కొంతమంది బర్డ్ ఫ్లూ తో సంబంధం లేకుండా చికెన్ తినడం కొనసాగిస్తున్నారు. ఇలాంటి వారి కోసం చికెన్ అమ్మకాలు పెరుగుతున్నాయి.
ప్రస్తుతం హైదరాబాదులో కేజీ చికెన్ ధర రూ. 230 తో విక్రయిస్తున్నారు. గతవారం చికెన్ ధర రూ. 270 ఉండేది. అలాగే విజయవాడలో ప్రస్తుతం చికెన్ ధర రూ. 270 గా ఉంది. గత వారం ఇక్కడ రూ. 300 తో విక్రయించారు. అయితే ఇటీవల విజయవాడలో చిన్నారి మృతి చెందడంతో చికెన్ తినడం తక్కువైందని కొందరు అంటున్నారు. అరవైపు ఆదివారం శ్రీరామారావుని కావడంతో కొంతమంది చికెన్ కు దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. మరికొందరు మాత్రం అలాంటివి పట్టించుకోకుండా కొనుగోలు చేయడానికి ముందుకు వస్తున్నారు. అయితే పౌల్ట్రీ పరిశ్రమలో ఎదురవుతున్న నష్టాలను తగ్గించడానికి చికెన్ ధరలు తగ్గుతున్నట్లు తెలుస్తోంది. ఇవి ఇలాగే కొనసాగుతాయా లేదా అనేది తెలియాల్సి ఉంది.
మరోవైపు వేసవి కారణంగా చికెన్ ధరలు పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే వేసవిలో కోళ్లు వాతావరణానికి తట్టుకోవడం కష్టంగా మారుతుంది. అందువల్ల మార్కెట్లోకి కోళ్లు రావడం తక్కువ అవుతుంది. దీంతో ధరలు పెరిగే అవకాశం ఉంది. ఆటో గుడ్ల ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం కోడిగుడ్ల ధరలు తగ్గిపోయాయి. ప్రస్తుతం ఒక్కో గుడ్డు ధర రూ. 6తో విక్రయిస్తున్నారు. కొన్నిచోట్ల రూ.7 తో అమ్ముతున్నారు. అయితే బర్డ్ ప్లూ కారణంగా కోడిగుడ్ల ధరలు కూడా పడ్డాయి. కానీ వేసవి కారణంగా వీటి ధరలు కూడా పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. దీంతో మాంసాహార ప్రియులకు ఇవి ప్రియం కానున్నాయి. అయితే వీటికి ప్రత్యామ్నాయంగా ఏర్పాట్లు చేసుకోవడం మంచిదని కొందరు ఆరోగ్యాన్ని పనులు తెలుపుతున్నారు. ఎందుకంటే వేసవి కారణంగా ఉష్ణోగ్రత అధికంగా ఉండే చికెన్ ను తినడం వల్ల సమస్యలు ఉంటాయని అంటున్నారు. వీక్లీ వన్స్ అయితే పర్వాలేదు అని చెబుతున్నారు.