Homeట్రెండింగ్ న్యూస్Cheapest Ice-Cream: హాట్‌ సమ్మర్‌లో కూల్‌ ఆఫర్‌... అక్కడ రూ.2కే కోన్‌ ఐస్‌క్రీం!!

Cheapest Ice-Cream: హాట్‌ సమ్మర్‌లో కూల్‌ ఆఫర్‌… అక్కడ రూ.2కే కోన్‌ ఐస్‌క్రీం!!

Cheapest Ice-Cream: కరోనాతో అన్నివర్గాల ఆర్థిక పరిస్థితులు తలకిందులయ్యాయి. ధరలు భారీగా పెరుగుతున్నాయి. వ్యవస్థలన్నీ ఒక దశాబ్దం పాటు వెనక్కి పోయాయి. ఇప్పుడు దేని గురించి చర్చించుకున్నా.. కరోనాకు ముందు.. కారోనా తర్తా అని మాట్లాడుకోవాల్సిన పరిస్థితి. ఒకవైపు ధరలు భగ్గుమంటున్నాయి. మరోవైపు ఎండలు దంచి కొడుతున్నాయి. ఇలాంటి పరిస్థితిలో ఓ ఐస్‌క్రీం కంపెనీ చల్లని ఆఫర్‌ ప్రకటించింది. కేవలం రూ.2కే కోన్‌ ఐక్రీం విక్రయిస్తోంది. దీంతో ఒక్కసారిగా ఈ పార్లర్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. ఎక్కడుంది ఈ పార్లర్, ఎందుకు అంత తక్కువ ధరకు అమ్ముతున్నారు. క్వాలిటీ బాగుంటుందా అంటూ నెటిజన్లు తెగ సెర్చ్‌ చేస్తున్నారు.

Cheapest Ice-Cream
Cheapest Ice-Cream

 

తమిళనాడులో..
చైన్నైలోని మాంబలం ఏరియాలో 1995లో వినూ ఇగ్లూ పేరుతో ఐస్‌క్రీం పార్లర్‌ ప్రారంభమైంది. ఆ రోజుల్లో ఇక్కడ కోన్‌ ఐస్‌క్రీంని కేవలం రెండు రూపాయలకే అమ్మారు. దీంతో ఆ పార్లర్‌ ఆ ఏరియాలో క్లిక్‌ అయ్యింది. తమ యూనిక్‌ సెల్లింగ్‌ పాయింట్‌ అదే కావడంతో ఐస్‌క్రీం ధర మాత్రం మార్చలేదు. అయితే అనుకోని కారణాల వల్ల 2008లో ఈ పార్లర్‌ మూత పడింది. అక్కడి ప్రజలకు తక్కువ ధరకే నోరూరించే ఐస్‌క్రీం దూరమైంది.

Also Read: AVATAR 2: THE WAY OF WATER Trailer: అవతార్.. ఈసారి నీటి కోసం ఈ యుద్ధం? అద్భుతం

రూ.2 చాలంట..!
వినూ ఇగ్లూ ఐస్‌క్రీం పార్లర్‌ యజమాని వినోద్‌ దానిని ఈ ఏడాది ఫిబ్రవరిలో పునఃప్రారంభించాడు. పాత కష్టమర్లకు ఆకట్టుకునేందుకు ప్రారంభ ఆఫర్‌గా కోన్‌ ఐస్‌క్రీం ధర రూ.2గానే నిర్ణయించారు. కొద్ది రోజుల తర్వాత ధరను మార్కెట్‌కు అనుగుణంగా మార్చాలని అనుకున్నారు. కానీ రూ.2 కోన్‌ ఐస్‌క్రీం కొనేందుకు వస్తున్న పాత కొత్త కస్టమర్లు చూపిస్తున్న ప్రేమ. ఆనాడు తన తండ్రి ప్రారంభించిన రూ.2 ఐస్‌క్రీం తమను ఎంతగా ఆకట్టుకుందో వారు చెప్పే విధానం చూశాక ధర మార్చ కూడదనే నిర్ణయానికి వచ్చాడు వినోద్‌.

Cheapest Ice-Cream
Cheapest Ice-Cream

ఇది ఎలా సాధ్యం?
వినూ ఇగ్లూ స్పెషాలిటీగా కోన్‌ ఐస్‌క్రీం ధరను రూ.2గానే ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా వేసవి మొదలైన తర్వాత ఒక్కసారిగా వినూ స్టోరీ చెన్నై అంతటా పాకిపోయింది. ఆ తర్వాత కొద్ది రోజులకే మీడియా, సోషల్‌ మీడియా ద్వారా వినూ పాపులారిటీ పెరిగిపోయింది. ఓ వైపు ధరలు మండిపోతుంటే రూ.2కే ఐస్‌క్రీం ఎలా ఇవ్వగలుగుతున్నారంటూ అంతా వినోద్‌ను ప్రశ్నిస్తున్నారు.

సెంటిమెంట్‌
కస్టమర్ల ప్రశ్నలకు వినోద్‌ సమాధానం ఇస్తూ.. పూర్తిగా పాలతోనే ఐస్‌క్రీం తయారు చేస్తామని. క్వాలిటీలో ఎక్కడా కాంప్రమైజ్‌ కామని అంటున్నారు. మార్కెట్‌లో ఈ ఐస్‌క్రీం సగటు ధర రూ.20గా ఉంది. కానీ తాము మాత్రం రూ.2కే విక్రయిస్తున్నాం. అయితే ఈ ఐస్‌క్రీం తినేందుకు వచ్చే జనాలు అధిక లాభాలు ఉండే కేకులు, పాలకోవాలు కొనడం ద్వారా నష్టం భర్తీ అవుతోందని వినోద్‌ చెబుతున్నారు. ‘మా నాన్న ప్రారంభించిన రూ.2 ఐస్‌క్రీం అనే ఎమోషన్‌ కొనసాగుతుంది’ అంటూ బదులిచ్చారు.

Also Read:TDP Mahanadu 2022: బాబు ‘మహా’ సక్సెస్‌.. ఓటర్లు మళ్లుతారా అన్నదే సందేహం

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Exit mobile version