Chennai Company: ఏ కంపెనీ అయినా తన కార్మికుల ఉత్పాదకతను పెంచడానికి అనేక విధాలుగా ప్రయత్నాలు చేస్తుంది. వీలైతే ఎక్కువ గంటలు పని చేయించుకుని తమ ఉత్పాదకతను పెంచుకుంటుంది. కానీ చెన్నైలోని ఒక సంస్థ తన ఉద్యోగుల ఉత్పాదకతను పెంచడానికి ఒక ప్రత్యేకమైన పద్ధతిని అవలంబించింది. ఈ పద్ధతి గురించి తెలుసుకున్న వారంతా ఇంత మంచి ఓనర్ ఉంటే ఆ ఉద్యోగికి ‘‘ప్రతీరోజూ పండుగే’’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. టీమ్ డిటైలింగ్ సొల్యూషన్స్, స్ట్రక్చరల్ స్టీల్ డిజైన్ అండ్ డిటైలింగ్ కంపెనీ దీపావళి కానుకగా తమ ఉద్యోగులకు అదిరిపోయే గిఫ్ట్లు అందించింది. సంస్థ ఉన్నతి కోసం కష్టపడిన ఉద్యోగులకు 28 కార్లు, 29 బైక్‌లను బహుమతిగా ఇచ్చింది. కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్, శ్రీధర్ కన్నన్ మాట్లాడుతూ.. ఉద్యోగులకు వారి కృషి, అంకితభావానికి మెచ్చుకోలుగా హ్యుందాయ్, టాటా, మారుతీ సుజుకీ, మెర్సిడెస్ బెంజ్ వంటి బ్రాండ్‌ల నుండి అనేక కొత్త కార్లను బహుమతిగా అందించినట్లు తెలిపారు. కంపెనీ విజయాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడంలో మా ఉద్యోగులు చేస్తున్న కృషికి మా అభినందనలు తెలియజేయాలనుకుంటున్నామని ఆయన అన్నారు. మా ఉద్యోగులు మా గొప్ప ఆస్తిగా మేము భావిస్తున్నామని చెప్పుకొచ్చారు.
వారంతా సాధారణ కుటుంబాల నుంచి వచ్చిన వారే
కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీధర్ కన్నన్ మాట్లాడుతూ.. ఉద్యోగుల పనితీరు, సంవత్సరాల సేవల ఆధారంగా కంపెనీ వారి సహకారాన్ని కొలుస్తుందని చెప్పారు. మా ఉద్యోగులు అనూహ్యంగా మంచి పనితీరు కనబరిచారు. వారి విజయాల పట్ల మేము గర్విస్తున్నాము. కంపెనీలో దాదాపు 180 మంది ఉద్యోగులు ఉన్నారని, సాధారణ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన వారు ఎంతో నైపుణ్యం కలిగి ఉన్నారని శ్రీధర్ కన్నన్ తెలిపారు.
బహుమతులుగా 28 కార్లు
కంపెనీ కోసం పని చేస్తున్న వారిలో మరింత ఉత్సాహంగా ఉన్న అభ్యర్థులను ఎంపిక చేస్తామని, వారికి కారు, బైక్ కొనుగోలు చేయడం కలలాంటిదని అన్నారు. తాను తన ఉద్యోగులకు బైక్‌లను బహుమతిగా ఇస్తున్నానని తెలిపారు. ఇంతకుముందు 2022లో తన ఇద్దరు సీనియర్ సహోద్యోగులకు కార్లను బహుమతిగా ఇచ్చానని చెప్పారు. ఈ సిరీస్‌లో ఈరోజు 28 కార్లు బహుమతిగా వచ్చాయి. వాటిలో కొన్ని మారుతీ సుజుకీ, హ్యుందాయ్, మెర్సిడెస్ బెంజ్ కంపెనీలకు చెందిన కార్లు అందించారు.
పెళ్లి చేసుకుంటే డబ్బులు కూడా
కంపెనీ నిర్ణీత మొత్తంతో కారు లేదా బైక్‌ను బహుమతిగా ఇస్తుందని, అయితే ఒక ఉద్యోగి మంచి కారు కావాలనుకుంటే మిగిలిన మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుందని శ్రీధర్ కన్నన్ చెప్పారు. కార్లు, బైక్‌లు మాత్రమే కాదు, కంపెనీ తన ఉద్యోగులకు వివాహానికి కూడా సహాయం చేస్తుంది. గతంలో పెళ్లి చేసుకునే ఉద్యోగికి రూ.50 వేలు ఇచ్చేవారు.. ఇప్పుడు దాన్ని రూ.లక్షకు పెంచారు. మా కృషి ఉద్యోగుల్లో మనోధైర్యాన్ని, ఉత్పాదకతను పెంపొందిస్తుందని శ్రీధర్ కన్నన్ తెలిపారు.