Ram Charan: ఆర్ ఆర్ ఆర్ మూవీతో రామ్ చరణ్ ఇమేజ్ ఖండాంతరాలకు చేరింది. రామరాజు పాత్రలో ఆయన హాలీవుడ్ మేకర్స్ ని మెస్మరైజ్ చేశారు. చరణ్ ఫెరోషియస్ రోల్ ఆర్ ఆర్ ఆర్ చిత్ర విజయంలో కీలకమైంది. పలువురు ప్రముఖులు ప్రశంసించారు. గోల్డెన్ గ్లోబ్ అవార్డు వేడుకలో పాల్గొనేందుకు యూఎస్ వెళ్లిన రామ్ చరణ్ మరో అరుదైన గౌరవం అందుకున్నారు.

రామ్ చరణ్ లూవీస్ విట్టన్ ఎక్స్ మ్యాగజైన్ స్టార్ స్టబ్బ్డ్ అవార్డు డిన్నర్ పార్టీలో పాల్గొనే అవకాశం పొందారు. ఆయనకు ఈ ప్రముఖ ఈవెంట్లో పాల్గొనేందుకు ఆహ్వానం అందింది. ఇండియన్ సినిమాకు ఇంటర్నేషనల్ ఈవెంట్లో రామ్ చరణ్ ప్రాతినిధ్యం వహించారు. ఇండియా నుండి రామ్ చరణ్ కి మాత్రమే ఆ అరుదైన అవకాశం దక్కింది. ఈ క్రమంలో ఆయన ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
లూవీస్ విట్టన్ ఎక్స్ మ్యాగజైన్ స్టార్ డిన్నర్ పార్టీలో పాల్గొనేందుకు రామ్ చరణ్ ప్రత్యేకంగా తయారయ్యారు. ఆయన బ్లేజర్, ప్రింటెడ్ టీ షర్ట్ ధరించి అల్ట్రా స్టైలిష్ లుక్ లో మెరిశారు. ఈ హాలీవుడ్ స్టార్స్ పార్టీలో రామ్ చరణ్ తన ప్రత్యేకత చాటుకున్నారు. ఆర్ ఆర్ ఆర్ మూవీతో రామ్ చరణ్ ఇమేజ్ గ్లోబల్ రేంజ్ కి వెళ్ళింది. ఆయనకు మార్వెల్ సిరీస్లో ఆఫర్స్ వస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ప్రస్తుతం రామ్ చరణ్ దర్శకుడు శంకర్ మూవీలో నటిస్తున్నారు. దిల్ రాజు భారీ బడ్జెట్ తో ఆర్సీ 15 నిర్మిస్తున్నారు. చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ మూవీ 2023లో విడుదల కానుంది. రామ్ చరణ్ రెండు డిఫరెంట్ రోల్స్ చేస్తుండగా… కియారా అద్వానీ, అంజలి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు.

ఇక గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ వేడుకలో ఆర్ ఆర్ ఆర్ మూవీ సత్తా చాటింది. ఒరిజినల్ సాంగ్ విభాగంలో నాటు నాటు అవార్డు సొంతం చేసుకుంది. మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి అవార్డు అందుకున్నారు. ఆయన హీరో రామ్ చరణ్ తో పాటు రాజమౌళి, ఎన్టీఆర్, చంద్రబోస్, రాహుల్ సిప్లి గంజ్, ప్రేమ్ రక్షిత్ లకు కృతజ్ఞతలు తెలిపారు.
దర్శకుడు రాజమౌళి పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా ఆర్ ఆర్ ఆర్ తెరకెక్కించారు. వరల్డ్ వైడ్ ఆర్ ఆర్ ఆర్ రూ. 1100 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఎన్టీఆర్, రామ్ చరణ్ లు హీరోలుగా నటించారు. డివివి దానయ్య నిర్మించారు. అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్స్ గా నటించారు. అజయ్ దేవ్ గణ్ కీలక రోల్ చేశారు.