‘రామరాజు ఫర్ భీమ్’కు చరణ్ వాయిస్ ఓవర్.. కిరాక్..!

దర్శకదిగ్గజం రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ‘బాహుబలి’ సీరిసుల తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం కావడంతో ‘ఆర్ఆర్ఆర్’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. డీవీవీ దానయ్య అత్యంత భారీ బడ్జెట్లో ఈ మూవీని నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. Also Read: ‘రాధేశ్యామ్’ సర్ ప్రైజ్ వచ్చేసింది.. ప్రభాస్ సీడీపీ వైరల్.. ఈ మూవీలో యంగ్ టైగర్ ఎన్టీఆర్.. మెగా పవర్ స్టార్ రాంచరణ్ కలిసి నటిస్తున్నారు. నందమూరి.. మెగా ఫ్యామిలీకి చెందిన హీరోలు ఒకే స్క్రీన్ పై […]

Written By: NARESH, Updated On : October 21, 2020 1:05 pm
Follow us on

దర్శకదిగ్గజం రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ‘బాహుబలి’ సీరిసుల తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం కావడంతో ‘ఆర్ఆర్ఆర్’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. డీవీవీ దానయ్య అత్యంత భారీ బడ్జెట్లో ఈ మూవీని నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది.

Also Read: ‘రాధేశ్యామ్’ సర్ ప్రైజ్ వచ్చేసింది.. ప్రభాస్ సీడీపీ వైరల్..

ఈ మూవీలో యంగ్ టైగర్ ఎన్టీఆర్.. మెగా పవర్ స్టార్ రాంచరణ్ కలిసి నటిస్తున్నారు. నందమూరి.. మెగా ఫ్యామిలీకి చెందిన హీరోలు ఒకే స్క్రీన్ పై కన్పించనుండటంతో అభిమానులు ఖుషీ అవుతున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమురంభీం పాత్రలో నటిస్తుండగా.. రాంచరణ్ మన్నెందొర అల్లూరి సీతరామరాజుగా కన్పించబోతున్నాడు.

‘ఆర్ఆర్ఆర్’ నుంచి ఇప్పటికే ‘భీమ్ ఫర్ రామరాజు’ టీజర్ రిలీజై సన్షేషన్ క్రియేట్ చేసింది. యూట్యూబ్లో అత్యధిక వ్యూయర్స్ సాధించిన టీజర్ గా రికార్డు సృష్టించింది. రాంచరణ్ యాక్షన్ కు ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ తోడవడంతో టీజర్ మతబులా పేలింది. చెర్రీ పుట్టిన రోజు కానుక వచ్చిన ఈ టీజర్ సినిమాపై మరిన్ని అంచనాలను పెంచేసింది.

ఎన్టీఆర్ పుట్టిన రోజున ‘రామరాజు ఫర్ భీమ్’ పేరిట టీజర్ రిలీజ్ చేయాలనుకున్నప్పటికీ సాధ్యంకాలేదు. దీంతో జక్కన్న దసరా కానుకగా ఈ ఎన్టీఆర్ టీజర్ తీసుకురానున్నట్లు ప్రకటించాడు. ఈనెల 22న ఉదయం 11గంటలకు ‘రామరాజు ఫర్ భీమ్’ టీజర్ రిలీజ్ కానుందని ప్రకటించాడు. అందుకు తగ్గట్టుగానే పనులన్నీ చకచక జరిగిపోతున్నాయి.

‘రామరాజు ఫర్ భీమ్’ టీజర్ కోసం రాంచరణ్ వాయిస్ ఓవర్ ఇవ్వబోతుండటంతో మెగా ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. గతంలో ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇచ్చినట్లుగానే రాంచరణ్ సైతం ప్రస్తుత టీజర్ కు డబ్బింగ్ చెబుతున్నాడు. ‘భీమ్ ఫర్ అల్లూరి’ కోసం ఎన్టీఆర్ తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో వాయిస్ ఓవర్ ఇచ్చి ఆకట్టుకున్నాడు.

Also Read: చిరంజీవి కోసం వినాయక్ అంతపని చేశాడా?

ఇక రాంచరణ్ సైతం అన్ని భాషల్లో వాయిస్ ఓవర్ అందించేందుకు కష్టపడుతున్నాడు. ఉదయం లేవగానే గొంతుకు సంబంధించిన ద్రవపానీయాలు తీసుకొని మరీ డబ్బింగ్ చెబుతున్నాడట. ఏదిఏమైనా దర్శక దిగ్గజం రాజమౌళి ఇద్దరు హీరోలకు సమ ప్రాధాన్యం ఇస్తూ ‘ఆర్ఆర్ఆర్’ మూవీపై అంచనాలను పెంచుతుండట గమనార్హం. దీంతో నందమూరి.. మెగాఫ్యాన్స్ తోపాటు ‘ఆర్ఆర్ఆర్’ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.