
NTR- Koratala Shiva Movie: నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న ఎన్టీఆర్ – కొరటాల శివ మూవీ ఈ నెల 18 వ తారీఖున ప్రారంభం కాబోతుందని ఫిలిం నగర్ లో లేటెస్ట్ గా వినిపిస్తున్న టాక్.#RRR చిత్రం తర్వాత సుమారు ఏడాది పాటు ఖాళీగా ఉంటూ వచ్చిన ఎన్టీఆర్ ఎట్టకేలకు షూటింగ్ సెట్స్ లో సందడి చెయ్యబోతున్నాడు.రీసెంట్ గానే ఈ సినిమాలో హీరోయిన్ గా అతులొక సుందరి కూతురు జాన్వీ కపూర్ నటిస్తున్నట్టు మూవీ టీం అధికారికంగా ప్రకటించింది.
ఆచార్య వంటి డిజాస్టర్ ఫ్లాప్ తర్వాత కొరటాల శివ చేస్తున్న చిత్రం ఇది.అందుకే ఈసారి చరిత్రలో నిలిచిపోయే రేంజ్ లో ఈ చిత్రం కథని పవర్ ఫుల్ గా రాసుకున్నాడట.ఈసారి కొడితే పాన్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ షేక్ అవ్వాలని,రాజమౌళి , సుకుమార్ మరియు ప్రశాంత్ నీల్ లీగ్ లో తాను కూడా చేరిపోవాలని కొరటాల శివ చూస్తున్నాడు.
ఇక ఈ సినిమా ముహుర్తం కార్యక్రమానికి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ముఖ్య అతిధిగా హాజరు కాబోతున్నాడట.మూడేళ్ళ పాటు రామ్ చరణ్ తో కలిసి పని చేసిన ఎన్టీఆర్ అతనితో ఎంతో మంచి సాన్నిహిత్యాన్ని ఏర్పర్చుకున్న సంగతి తెలిసిందే.అందుకే తాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేస్తున్న సినిమాకి తన మిత్రుడు పక్కన ఉండాలనే ఉద్దేశ్యం తో ఎన్టీఆర్ రామ్ చరణ్ ని ఆహ్వానించాడట.

ఇక ముహూర్తం జరిగిన రోజే ఈ సినిమా రెగ్యులర్ షూట్ కూడా జరగబోతుందని సమాచారం.సముద్రం బ్యాక్ గ్రౌండ్ నేపథ్యం లో సాగే ఈ సినిమా లో ఇది వరకు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ చూడని కనీవినీ ఎరుగని యాక్షన్ సన్నివేశాలు అభిమానుల రోమాలు నిక్కపొడుచుకునేలా చేస్తుందట.ఇన్ని రోజులు అభిమానుల ఎదురు చూపులకు వాళ్ళ ఆకలి మొత్తం తీరేలాగా ఈ చిత్రాన్ని తీర్చే దిద్దే పట్టుదలతో ఉన్నాడట కొరటాల శివ.
