Jabardasth Satya: జబర్దస్త్ పాపులర్ కమెడియన్స్ లో చమ్మక్ చంద్ర ఒకరు. ఈ పాపులర్ కామెడీ షో ప్రారంభం నుండి ఉన్న చమ్మక్ చంద్ర బాగా ఫేమస్ అయ్యాడు. ఫ్యామిలీ డ్రామాలు, మొగుడు పెళ్ళాల గొడవలతో కూడిన స్కిట్స్ తో చంద్ర నాన్ స్టాప్ నవ్వులు పంచేవాడు. అలాగే ఆయన లేడీ గెటప్స్ కి బాగా ఫేమస్. చంద్ర స్కిట్స్ లో కచ్చితంగా లేడీ క్యారెక్టర్ ఉండేది. అబ్బాయిలే లేడీ గెటప్స్ వేసేవారు. అయితే సత్య ఎంట్రీతో అంతా మారిపోయింది. చమ్మక్ భార్య క్యారెక్టర్స్ సత్య చేసేది. అబ్బాయిలకు లేడీ గెటప్స్ వేయడం ఆపేసి సత్యకు ఆ పాత్రలు ఇచ్చేవాడు.
సత్య-చమ్మక్ చంద్ర కెమిస్ట్రీ కూడా వర్కవుట్ కావంతో మంచి పేరొచ్చింది. సత్య జబర్దస్త్ లేడీ కమెడియన్ గా సెటిల్ అయ్యింది. ఇక చంద్ర అంటే జడ్జి నాగబాబుకు ప్రత్యేక అభిమానం ఉండేది. చంద్ర స్కిట్స్ ని బాగా ఎంజాయ్ చేసేవాడు. కాగా నాగబాబు జబర్దస్త్ నుండి వెళ్లిపోయారు. ఆయనతో పాటు జబర్దస్త్ షో డైరెక్టర్స్ నితిన్, భరత్ లు షో వీడటం జరిగింది.
ఆ సమయంలో కిరాక్ ఆర్పీ, చమ్మక్ చంద్ర నాగబాబు నిర్ణయానికి మద్దతు తెలిపారు. నాగబాబుతో పాటు వారు కూడా జబర్దస్త్ ని వదిలి వెళ్లిపోయారు. చమ్మక్ చంద్ర మానేయడంతో ఆయన టీమ్ మేట్ సత్య కూడా జబర్దస్త్ కి గుడ్ బై చెప్పేశారు. ఓ సందర్భంలో ఈ విషయంపై ఆమె స్పందించారు. చమ్మక్ చంద్ర నాకు గురువుగారు. నన్ను షోకి తీసుకొచ్చింది ఆయనే. చంద్ర జబర్దస్త్ లో లేకపోవడంతో నేను కూడా అక్కడ ఉండలేకపోయాను. షో వదిలేశాను, అని ఆమె చెప్పుకొచ్చారు.
అయితే సడన్ గా సత్య జబర్దస్త్ లో ప్రత్యక్షమయ్యారు. ఆమె తాగుబోతు రమేష్ టీమ్ లో భార్య క్యారెక్టర్ చేశారు. దీంతో జబర్దస్త్ ఆడియన్స్ కొత్తగా ఫీల్ అయ్యారు. చంద్రతో పాటు వెళ్ళిపోయిన శ్రీసత్య మళ్ళీ వచ్చిందేంటి అంటున్నారు. బహుశా చమ్మక్ చంద్రకు ఆమెతో విబేధాలు తలెత్తాయా ? అనే సందేహాలు వ్యక్తీకరిస్తున్నారు. కాగా గతంలో చమ్మక్ చంద్ర-సత్య మధ్య ఎఫైర్ రూమర్స్ వినిపించాయి. అవి నా వరకు వచ్చాయి. పేరెంట్స్ కూడా అడిగారు. ఈ రూమర్స్ గురించి చమ్మక్ చంద్ర-నేను మా టీమ్ సభ్యుల ముందే మాట్లాడుకొని నవ్వుకున్నామని సత్య ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. జబర్దస్త్ మానేశాక ఆమె బుల్లితెరపై పెద్దగా కనిపించలేదు.