Pavitri Lokesh- Naresh: తెలుగు సినీ పరిశ్రమలో సీనియర్ నరేష్, పవిత్ర లోకేష్ ల వ్యవహారం హాట్ టాపిక్ గా మారుతోంది. ఇన్నాళ్లుగా వారి మధ్య ఉన్న సంబంధం గురించి సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా అవుతూనే ఉంది. సూపర్ స్టార్ కృష్ణ మరణం తరువాత వారి ప్రవర్తన గురించి పలు రకాల వాదనలు వినిపిస్తున్నాయి. కృష్ణ నరేష్, పవిత్ర లోకేష్ ల జంటను ఒప్పుకుని తన ఇంట్లోనే ఉంచుకోవడంతో వారు హద్దులు మీరారని వార్తలు వస్తున్నాయి. కృష్ణ చనిపోయిన సమయంలో వారిద్దరి పద్ధతులు అందరిలో ఆశ్చర్యాన్ని కలిగించాలయని చెబుతున్నారు. అందరు కృష్ణ చనిపోయిన దుఖంలో ఉంటే నరేష్ మాత్రం పవిత్ర పై చేతులు వేసుకుని తిరగడం వివాదాలకు తావిస్తోంది. దీనిపై కృష్ణ అభిమానులు ఆగ్రహం వ్యక్తి చేస్తున్నారు.

ఇంట్లో పెద్దాయన చనిపోయారనే సానుభూతి కూడా లేకుండా నరేష్ ఇష్టారాజ్యంగా ప్రవర్తించారనే అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పవిత్ర లోకేష్ తనకు ఘట్టమనేని ఇంటి పెద్ద కోడలుగా స్థానం ఇవ్వాలనే డిమాండ్ తెరపైకి తెచ్చిందట. దీంతో అందరిలో అసహనం పెరిగింది. ఒకవైపు అందరు బాధాకరంగా ఉన్న సమయంలో ఇలాంటి మాటలు మాట్లాడటం అందరికి కంటగింపుగా మారింది. పవిత్ర లోకేష్ కు నరేష్ ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారనే వాదనలు కూడా వస్తున్నాయి.
అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకోనిదే అన్ని హక్కులు కావాలని కోరడంలో అర్థం లేదని అభిమానులు నిరసన తెలుపుతున్నారు. ఘట్టమనేని కుటుంబానికి మంచి పేరుంది. దాన్ని చెడగొట్టడానికి పవిత్ర కంకణం కట్టుకుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. కృష్ణ వారసుడిగా ఆయనకు అవకాశం ఇచ్చినా దాన్ని వినియోగించుకోలేక ఇలాంటి చర్యలకు దిగడం సబబుగా లేదు. దీంతో నరేష్ తీరుపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. మహేశ్ బాబును ఓదార్చడానికి వచ్చిన ఓ స్టార్ ప్రొడ్యూసర్ తో నరేష్ చులకనగా మాట్లాడారని దీంతో ఆయన మనసు చిన్నబుచ్చుకున్నారనే వార్త హల్ చల్ చేస్తోంది. ఇలా నరేష్ ప్రతి విషయంలో ఏదో ఒక పొరపాటు చేస్తూ కృష్ణ కుటుంబానికి తలవంపులు తెస్తున్నారని చర్చించుకుంటున్నారు.

నరేష్, పవిత్ర లోకేష్ ల వ్యవహారం ఇంకా ఎంత వరకు వెళ్తుందో తెలియడం లేదు. మహేశ్ బాబుతో సమానంగా ఇంట్లో హక్కులు ఉండాలని పవిత్ర డిమాండ్ చేస్తోందట. వ్యవహారం చూస్తుంటే ఎక్కడికో వెళ్లేలా ఉంది. కృష్ణ మరణం తరువాత వారి మధ్య ఇంకా ఏ అగాధాలు వస్తాయో అని అభిమానులు తలలు పట్టుకుంటున్నారు. మొత్తానికి నరేష్, పవిత్రల బంధంలో ఇంకా ఎన్ని ఆటుపోట్లు ఎదురవుతాయో అర్థం కావడం లేదు. ఘట్టమనేని కుటుంబంలో పవిత్ర చిచ్చు రేపనుంది. వారసత్వం కోసం ఇంకా ఎన్ని విధాలుగా డిమాండ్లు తెస్తుందో అనే ఆందోళన అందరిలో నెలకొంది. మహేశ్ బాబు కుటుంబానికి పవిత్ర కొరకరాని కొయ్యగా తయారయిందని పలువురు కామెంట్లు చేస్తున్నారు.