https://oktelugu.com/

Chalaki Chanti : వాళ్ల పేరు బయటపెడితే నాశనమైపోతారు..! చలాకీ చంటి ఎమోషనల్

ఇక సినీ ప్రముఖులను కలిసే సమయంలో తనను పట్టించుకోలేదని, కావాలనే తనను పక్కకు తప్పించారని అన్నారు. తనతో ఉన్న కొందరు ఇలాంటి పనులు చేయడం నచ్చలేదని అన్నారు.

Written By:
  • Srinivas
  • , Updated On : April 30, 2023 / 09:12 AM IST
    Follow us on

    Chalaki Chanti : జీవితంలో ప్రతి ఒక్కరికి కష్టాలు ఉంటాయి.. కానీ  ఇతరుల ఇగో వల్ల పడే బాధ నరకంలా ఉంటుంది. ఆ నరకాన్ని అనుభవించడం కొందరికి అలవాటైపోతుంది. కొందరు మాత్రం తట్టుకోలేరు. ఒక్కో సందర్భంలో  ఇది ఆవేశంలా బయటకొస్తుంది. సినిమా రంగానికి చెందిన కొందరు ఇలాంటి నరకాలు అనుభవించి తమ ఆక్రోశాన్ని చాలా సార్లు మీడియా ముందు బయటపెట్టారు. ఈ పరిస్థితి టీవీ రంగానికి చెందిన వారికి కూడా ఉంటుందని తెలుస్తోంది. జబర్దస్త్ ద్వారా ఫేమస్ అయిన చలాకీ చంటి తాను పడిన వేదన గురించి ఓ మీడియా ముందు గోడు వెళ్లబోసుకున్నాడు. తనను కొందరు మనోవేదనకు గురి చేశారని, వారి పేర్లు బయటపెడితే జీవితాలు నాశనమైపోతాయని ఆక్రోశంతో చెప్పడం సంచలనంటా మారింది.

    మొదట్లో కొన్ని సినిమాల్లో నటించిన చలాకీ చంటి..అవకాశాలు తగ్గాక జబర్దస్త్ లో అవకాశం వచ్చింది. ఇక్కడా ఆయన టీం లీడర్ స్టాయికి ఎదిగారు. జబర్దస్త్ లోకి రాగానే చంటి కాస్త.. చలాకీ చంటిగా మారిపోయాడు. ఆ తరువాత అదే ఛానెల్ లో ‘నా షో .. నాఇష్టం’ అనే షో ద్వారా మరింత ఫేమస్ అయ్యారు. ఆ తరువాత ఆయన బిగ్ బాస్ 6 హౌస్ లోకి వెళ్లాడు. అయితే తనను హౌస్ నుంచి కావాలనే గెంటేశారని ఆ సమయంలో బయటకొచ్చిన తరువాత సంచలన కామెంట్స్ చేశారు. ఆ తరువాత జబర్దస్త్ నుంచి కూడా బయటకొచ్చాడు.

    ఈ సందర్భంగా అసలచు చలాకీ చంటికీ ఏమైందని కొందరు ప్రశ్నించగా.. ఆయన మనసులోని విషయాలన్ని బయటపెట్టారు. మనం ఎక్కడ పనిచేసినా మన ఎదుగుదలను కొందరు తొక్కేస్తారని అన్నారు. నేను పనిచేసిన చోట కూడా అలాంటి వారు ఉన్నారని అన్నారు. వారి స్వార్థం కోసం నన్ను పూర్తిగా వాడుకున్నారని, ఆ తరువాత నాతో పనిలేదని పట్టించుకోలేదని అన్నారు. తాను బిగ్ బాస్ హౌస్ లో ఉన్న సమయంలో జబర్దస్త్ నుంచి ఒక్కరూ కూడా తనకు సపోర్టు చేయలేదని ఆయన చెప్పడం హాట్ టాపిక్ గా మారింది.

    ఇక సినీ ప్రముఖులను కలిసే సమయంలో తనను పట్టించుకోలేదని, కావాలనే తనను పక్కకు తప్పించారని అన్నారు. తనతో ఉన్న కొందరు ఇలాంటి పనులు చేయడం నచ్చలేదని అన్నారు. నాతో ఉంటూనే నన్ను మోసం చేశారని అన్నారు. వారి పేర్లు పెడితే వారి జీవితాలు నాశనం అవుతాయని అన్నారు. ఎప్పుడూ చలాకీగా కామెడీ చేసే చంటి ఇటీవల అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. ఈ సందర్భంగా ఆయన ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూ వీడియో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో చంటి ఏమన్నాడో మీరూ చూసేయండి..