Ban On Dog Breeds: ఇప్పుడు మాత్రమే కాదు.. కొన్ని సంవత్సరాల క్రితం నుంచి మనుషులకు, సాధు జంతువులకు అవినాభావ సంబంధం ఉంది. పెంపుడు జంతువులను పెంచుకోవడం చాలా మందికి ఇష్టం. అలాంటి వాటిలో కుక్కలకు ప్రధాన పాత్ర ఉంటుంది. ఇక ఈ కుక్కలు కూడా యజమానుల పట్ల విశ్వాసం గా ఉంటాయి. రాత్రి పగలు కాపాడుతుంటాయి. కానీ కొన్ని కుక్కల వల్ల యమ డేంజర్. ఇటీవల కుక్కల వల్ల చాలా మంది గాయపడడం వల్ల.. కొన్ని జాతి కుక్కల వల్ల ప్రమాదం ఉందని కేంద్రం కీలక హెచ్చరికలు జారీ చేసింది.
కుక్కల మీద ఉన్న ప్రేమతో చాలా మంది ఇంట్లో పెంచుకుంటున్నారు. ఇక ఈ కుక్కలలో కొన్ని జాతుల వల్ల మనుషులకు చాలా ప్రమాదం ఉందని కేంద్రం వెల్లడించింది. గత కొంత కాలం నుంచి పెంపుడు కుక్కల దాడుల వల్ల మనుషులు ప్రాణాలు కోల్పోతున్నారు. దీని వల్ల కేంద్రం స్పందించి.. కొన్ని జాతుల మీద నిషేధం విధించింది. పిట్ బుల్, టెర్రీయర్, అరికన్ బుల్ డాగ్, రాట్ వీలర్, మస్టిప్స్ వంటి 23 రకాల కుక్కల సంతానోత్పత్తిని అమ్మకాలను నిషేధించింది. దీని కోసం రాష్ట్రాల, కేంద్రపాలిత ప్రాంతాల చీఫ్ సెక్రటరీలకు మార్చి 12న కేంద్ర పశుసంవర్ధక శాఖ ఆదేశాలను జారీ చేసింది.
ఇంట్లో పెంచుకుంటున్న కొన్ని ఫెరోషియెస్ బ్రీడ్లకు చెందిన కుక్కలు కరవడం వల్ల వల్ల మనుషులు చనిపోతున్నారని.. జంతు సంక్షేమ సంస్థలకు ఫిర్యాదులు వచ్చాయి. దీని వల్ల పశుసంవర్ధక శాఖ కమిషనర్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ విచారణలో 23 బ్రీడ్స్ అత్యంత ప్రమాదకరంగా మారిందని తెలిపింది. అందువల్ల వీటిని దిగుమతి చేయడం, విక్రయం, బ్రీడింగ్ లను నిషేధించాలి అని తెలిపింది. అంతేకాదు ఈ కుక్కలను సంబంధించిన లైసెన్స్ జారీ చేయవద్దని కూడా తెలిపింది.