https://oktelugu.com/

Celina Jaitley: ఇంత దారుణం జరిగినా.. తప్పు మొత్తం ఆమెదే అంటున్నారు.. ప్రకంపనలు సృష్టిస్తున్న సెలీనా జైట్లీ పోస్ట్

కోల్ కతా లోని శిక్షణలో ఉన్న వైద్యురాలి పై జరిగిన హత్యాచారం దేశవ్యాప్తంగా చర్చకు దారి తీస్తోంది. ఈ కేసు లో హైకోర్టు ఇన్వాల్వ్ అవ్వడం.. సిబిఐ ఎంట్రీ ఇవ్వడం.. సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకోవడంతో సంచలనంగా మారే అవకాశం కనిపిస్తోంది.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : August 19, 2024 / 03:54 PM IST

    Celina Jaitley

    Follow us on

    Celina Jaitley: కోల్ కతా లోని ఆర్జీ కార్ ఆస్పత్రిలో హత్యాచారానికి గురైన వైద్యురాలి ఉదంతంలో రోజుకో తీరుగా మలుపులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ కేసును సిబిఐ విచారిస్తోంది. పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వ తీరుపై బెంగాల్ హైకోర్టు తీవ్రంగా మండిపడింది. ఇలాంటి కేసును స్థానిక పోలీసులకు అప్పగించి, న్యాయం ఆశించలేమని కోర్టు వ్యాఖ్యానించింది. తక్షణమే ఈ కేసును టేక్ ఓవర్ చేయాలని ఆదేశాలు జారీ చేయడంతో.. సిబిఐ ఎంట్రీ ఇచ్చింది. మూడు వారాల్లో ఈ కేసు విచారణకు సంబంధించిన నివేదిక అందించాలని హైకోర్టు ఆదేశించింది. ప్రస్తుతం సిబిఐ ఈ కేసును విచారిస్తోంది. కేసు విచారణ దశలో ఉండగానే ఘాతుకం జరిగిన సెమినార్ హాలులో ఆధారాలు చెడగొట్టేందుకు కొంతమంది అల్లరి మూకల ముఠా రకరకాల ప్రయత్నాలు చేసింది. నిరసన చేపడుతున్న వైద్యులపై దాడి చేసింది. ఆస్పత్రిలో నానా రభస సృష్టించింది. దీంతో పోలీసులు వారిని అదువులోకి తీసుకున్నారు. మరోవైపు బాధిత కుటుంబానికి భరోసా ఇవ్వాల్సిన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి న్యాయం కావాలంటూ రోడ్డు ఎక్కారు. సిబిఐ సత్వరం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

    అయితే ఆ వైద్యురాలి హత్యాచార ఘటన సంబంధించి సెలబ్రిటీలు నోరు విప్పుతున్నారు. అందులో ఒకప్పటి బాలీవుడ్ నటిమణి సెలీనా జైట్లీ చేరారు. ఈ సందర్భంగా తన ఆవేదనను ట్విట్టర్ ఎక్స్ లో పంచుకున్నారు. ” నేను స్కూల్ డేస్ లో పలుమార్లు అబ్బాయిల చేతిలో వేధింపులను చవి చూశాను. ఆ సమయంలో నేను ఈ విషయాన్ని నా తల్లిదండ్రులకు చెబితే నన్నే తప్పు పట్టేవారు. ఇదే సమయంలో ఆమె ఆరవ తరగతి చదువుతున్న ఫోటోను పోస్ట్ చేశారు. ” నేను పాఠశాల విద్య ఆభ్యసిస్తున్నప్పుడు కొందరు యుక్త వయస విద్యార్థులు ఇబ్బంది పెట్టేవారు. రిక్షాలో నేను వెళ్తుంటే నా వెంటపడేవారు. కొన్నిసార్లు నాపై రాళ్లు కూడా వేసేవారు. అప్పుడు నేను ఈ విషయాన్ని మా టీచర్ కు చెప్పాను. నువ్వు వెస్ట్రన్ డ్రెస్సులు వేసుకుంటావు. ముందుగా దానిని మార్చుకో. తలకు నూనె రాసుకో. రెండు జడలు వేసుకో అని నాకు చెప్పారు. ఒకరోజు రిక్షా కోసం ఎదురు చూస్తుంటే ఓ వ్యక్తి నా ఎదురుగా నిలబడ్డాడు. తన ప్రైవేట్ భాగాలను చూపించాడు. అప్పుడు నేను ఎంతగా ఏడ్చానో” అంటూ సెలీనా జెట్లీ తన బాధను వ్యక్తం చేసింది.

    11వ తరగతికి వచ్చినప్పటికీ సెలీనా జైట్లీ పై వేధింపులు తగ్గలేదు. ఆమె నడిపే టూ వీలర్ వైర్లను ఆకతాయిలు కత్తిరించారు. ఆ తర్వాత దానిపై పిచ్చిపిచ్చి రాతలు రాసేవారు.. ఇదే విషయాన్ని ఆ కాలేజీ లెక్చరర్ తో సెలీనా జైట్లీ చెబితే.. ఆమె మద్దతుగా నిలవకపోగా.. తప్పు మొత్తం సెలీనా జైట్లీదే అన్నట్టుగా మాట్లాడింది. ఇలాంటి ఇబ్బందులను తన జీవితంలో చాలా చూశానని సెలీనా జెట్లీ చెప్పుకొచ్చింది. ప్రస్తుత సమాజం మగవాళ్ళను వెనకేసుకొస్తుంది. ఆడవాళ్లను తీవ్రంగా ఇబ్బంది పెడుతుంది. ఇలాంటి సమాజంలో బతుకుతున్నప్పుడు ఆడవాళ్లు నిత్యం జాగ్రత్తగా ఉండాలని సెలీనా జైట్లీ సూచించింది. అన్నట్టు సెలీనా పెట్టిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.