
CCL 2023 Final: సినీ తారల క్రికెట్ లీగ్ విజేతగా తెలుగు వారియర్స్ జట్టు నిలిచింది. అక్కినేని అఖిల్ అద్భుత బ్యాటింగ్ తో ఫైనల్లో అద్భుత విజయాన్ని తెలుగువారియర్స్ జట్టు చేజిక్కించుకుంది. వేలాదిగా తరలివచ్చిన అభిమానుల సమక్షంలో ఫైనల్ మ్యాచ్ విశాఖలో జరిగింది.
సెలబ్రిటీ క్రికెట్ లీగ్ 2023 ఛాంపియన్షిప్ ను తెలుగు వారియర్స్ గెలుచుకుంది. విశాఖ వేదికగా జరిగిన ఫైనల్ లో భోజ్ పురి దబాంగ్స్ జట్టుపై తొమ్మిది వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఏకపక్షంగా సాగిన మ్యాచ్ లో తెలుగు వారియర్స్ జట్టు అలవోకగా టైటిల్ ను సొంతం చేసుకుంది.
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న తెలుగు వారియర్స్..
సెలబ్రిటీ క్రికెట్ లీగ్ 2023 టోర్నీలో అద్భుతమైన ప్రతిభను చాటి వరుస విజయాలు చేజిక్కించుకున్న తెలుగు వారియర్స్ జట్టు కప్పును ఒడిసి పట్టింది. విశాఖలోని వైయస్ రాజశేఖర్ రెడ్డి స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో తెలుగు వారియర్స్ జట్టు, భోజ్ పురి దబాంగ్స్ జట్లు పోటీపడ్డాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన తెలుగు వారియర్స్ జట్టు కెప్టెన్ అక్కినేని అఖిల్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. భోజ్ పురి దబాంగ్ జట్టు కెప్టెన్ మనోజ్ తివారీ జట్టుకు బ్యాటింగ్ అప్పగించాడు.
భోజ్ పురి జట్టు తొలి ఇన్నింగ్స్..
ఫైనల్ మ్యాచ్లో టాస్ గెలిచిన తెలుగు వారియర్స్ జట్టు భోజ్ పురి దబాంగ్స్ జట్రో తక్కువ స్కోరుకే కట్టడి చేసింది. తొలి యూనియన్స్ లో భోజ్ పురి జట్టు 10 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 72 పరుగులు చేసింది. ఓపెనర్లు కెప్టెన్ మనోజ్ తివారి తొమ్మిది పరుగులు, ప్రవేశ్ యాదవ్ నాలుగు పరుగులకే అవుట్ అయ్యారు. ఆ తర్వాత వచ్చిన ఉదయ్ తివారి పది పరుగులు, అజ్గర్ ఖాన్ 26, అన్సుమాన్ సింగ్ 11 పరుగులు, విక్రాంత్ సింగ్ 9 పరుగులు చేశాడు. దీంతో స్వల్ప స్కోరుకే దబాంగ్ జట్టు పరిమితమైంది.
తెలుగు వారియర్స్ తొలి ఇన్నింగ్స్..
తెలుగు వారియర్స్ జట్టులో రఘు రెండు ఓవర్లు వేసి పది పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీసుకోగా, ప్రిన్స్ 12 పరుగులు ఇచ్చి ఒక వికెట్, నందకిషోర్ 14 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీసుకోవడం గమనార్హం. భోజ్ పురి జట్టు విధించిన స్వల్ప లక్ష్యాన్ని చేదించేందుకు బరిలోకి దిగిన తెలుగు వారియర్స్ జట్టు భారీ స్కోరు సాధించింది. తెలుగు వారియర్స్ జట్టు మొదటి ఇన్నింగ్స్ లో నాలుగు వికెట్లు కోల్పోయి 104 పరుగులు చేసింది. జట్టు కెప్టెన్ అక్కినేని అఖిల్ అరవీర భయంకరమైన బ్యాటింగ్ తో అదరగొట్టడంతో భారీ స్కోరు సాధ్యమైంది. కేవలం 32 బంతుల్లోనే ఆరు సిక్సర్లు, రెండు ఫోర్ లతో 67 పరుగులు చేశాడు. అఖిల్కు మిగతా బ్యాటర్లు సహకారాన్ని అందించడంతో భారీ స్కోరు సాధ్యమైంది.

భోజ్ పురి రెండో ఇన్నింగ్స్ లో..
మొదటి ఇన్నింగ్స్ లో తెలుగు వారియర్స్ జట్టుకు ఆధిక్యం లభించింది. రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భోజ్ పురి జట్టు పెండింగ్స్ లో ధాటిగానే ప్రారంభించింది. నిర్ణీత 10 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 89 పరుగులు చేసింది. భోజ్ పురి జట్టులో ఆదిత్య ఓజా 31 పరుగులు, ఉదయ్ తివారి 34 పరుగులు, మనోజ్ తివారి 14 పరుగులు చేసి రాణించారు. తెలుగు వారియర్స్ జట్టులోని సామ్రాట్, థమన్ రెండేసి వికెట్లు సాధించగా, అశ్విన్ బాబు, ఫ్రెండ్స్ ఒక్కో వికెట్ సాధించారు.
స్వల్ప లక్ష్యంతో బరిలోకి తెలుగు వారియర్స్..
రెండో ఇన్నింగ్స్ లోను భోజ్ పురి దబాంగ్స్ జట్టుకు తక్కువ స్కోరుకే పరిమితం చేయడంతో.. 58 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ను తెలుగు వారియర్స్ ప్రారంభించింది. థమన్, అశ్విన్ ఇన్నింగ్స్ ను ప్రారంభించగా.. పది పరుగులు చేసి థమన్ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత సచిన్ జోషితో కలిసి అశ్విన్ బాబు బాధ్యతాయుతంగా ఆడుతూ స్కోరును పరుగులు పెట్టించాడు. చివరి వరకు క్రేజీలో ఉండి ఇంకా 24 బంతులు మిగిలి ఉండగానే విజయ లక్ష్యాన్ని చేరుకున్నారు. అశ్విన్ బాబు 31 పరుగులు చేయగా, సచిన్ జోషి 14 పరుగులు చేశారు. బోజ్ పురి జట్టులో విక్రాంత్ సింగ్ ఒక్కరే ఒక వికెట్ తీసుకున్నారు.
మ్యాన్ ఆఫ్ ద సిరీస్ గా అక్కినేని అఖిల్..
సిరీస్ ఆద్యంతం అద్భుత బ్యాటింగ్ తో అలరించిన అక్కినేని అఖిల్ మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డు అందుకున్నాడు. బెస్ట్ బ్యాట్స్ మెన్ అవార్డును ఆదిత్య ఓజా, మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ద శిరీష్ అవార్డులను అక్కినేని అఖిల్ అందుకున్నారు. బెస్ట్ బౌలర్ ఆఫ్ ది టోర్నమెంట్ గా ప్రిన్స్ నిలిచాడు. బెస్ట్ బౌలర్ గా థమన్ నిలిచాడు.
విజయంతో తెలుగు వారియర్స్ ఆటగాళ్ల ఉత్సాహం..
తెలుగు వారియర్స్ విజయం సాధించిన తర్వాత ఆటగాళ్లు ఉత్సాహంలో మునిగిపోయారు. వేలాదిగా తరలివచ్చిన అభిమానులు సమక్షంలో ఆటగాళ్లు సందడి చేశారు. గ్రౌండ్ అంతా తిరిగి అభిమానులకు అభివాదం చేశారు.
ట్రోఫీ అందుకున్న అక్కినేని అఖిల్..
సిసిఎల్ 2023 విద్యార్థిగా నిలిచిన తెలుగు వారియర్స్ కు ట్రోఫీని అందించారు. టీం తరఫున అక్కినేని అఖిల్ ట్రోఫీని అందుకున్నారు. సిసిఎల్ అధినేత విష్ణు ఇందూరు చేతుల మీదుగా వెంకటేష్ సమక్షంలో అక్కినేని ట్రోఫీనీ తీసుకున్నారు. ఆ తర్వాత జట్టు సభ్యులందరూ కలిసి ఫోటోకు ఫోజులిచ్చారు.