https://oktelugu.com/

CBSE: హతివిధీ.. 9వ తరగతిలోనే డేటింగ్, రిలేషన్ షిప్ పాఠాలా?

పిల్లలతో తల్లిదండ్రులు చర్చించడానికి విముఖత చూసే డేటింగ్, రిలేషన్‌షిప్‌ వంటి అంశాలపై టీనేజీ విద్యార్థుల్లో స్పష్టమైన ఆలోచన పెంచేందుకు సీబీఎస్‌ఈ ఈ నిర్ణయం తీసుకుంది.

Written By:
  • Raj Shekar
  • , Updated On : February 4, 2024 / 10:05 AM IST
    Follow us on

    CBSE: లైంగిక విద్యపై టీనేజర్స్‌లో అవగాహన ఉండాలన్న ఉద్దేశంతో, నిపుణుల సూచనలతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పాఠశాల విద్యలోనే లైంగిక విద్యను ఇప్పటికే అమలు చేస్తున్నాయి. ఇప్పటికే ఉపాధ్యాయులు ఈ పాఠాలు బోధిస్తున్నారు. అయితే ప్రస్తుతం టీనేజీ విద్యార్థులు ఏదైనా ఒక విషయాన్ని సమాజం తప్పుడుగా చెప్పేలోపే దానిని స్పష్టమైన భావనతో, సహేతుకమైన విధానంలో పాఠంగా చెప్పడం మంచిదని సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ సెకండరీ ఎడ్యుకేషన్‌(సీబీఎస్‌ఈ) నిర్ణయిచింది. ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న డేటింగ్, రిలేషన్‌షిప్‌ వంటి సున్నిత అంశాల కారణంగా టీనేజర్లు తప్పుదోవ పట్టకుండా ఉండేందుకు పాఠాలు దోహదం చేస్తాయని భావిస్తోంది. ఈ క్రమంలోనే పాఠ్యపుస్తకాల్లో ఈ అంశాలను పాఠంగా చేర్చనుంది.

    స్పష్టమైన ఆలోచన కోసం..
    పిల్లలతో తల్లిదండ్రులు చర్చించడానికి విముఖత చూసే డేటింగ్, రిలేషన్‌షిప్‌ వంటి అంశాలపై టీనేజీ విద్యార్థుల్లో స్పష్టమైన ఆలోచన పెంచేందుకు సీబీఎస్‌ఈ ఈ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా డేటింగ్, రిలేషన్‌షిప్‌ చాప్టర్లను 9వత తరగతిలో బోధించాలని నిర్ణయిచింది. ఈమేరకు వాల్యూ ఎడిషన్‌ పాఠ్య పుస్తకాల్లో ఆయా పాఠాలను చేర్చింది. టీనేజీ విద్యార్థుల్లో హార్మోన్ల ప్రభావంతో సమ వయస్కులపై ఇష్టం, వారితో కలిసిమెలిసి ఉండడం వంటి సందర్భాల్లో ఎలా వ్యవహరించాలో సవివరంగా ప్రత్యేక పాఠాలను ఇందులో చేర్చారు.

    ‘డేటింగ్‌ అండ్‌ రిలేషన్‌ షిప్స్‌’
    ‘అండర్‌ స్టాండింగ్‌ యువర్‌ సెల్ఫ్‌ అండ్‌ ది అదర్‌ పర్సన్‌’ పేరుతో ఉన్న ఒక పాఠం, కొన్ని పదాలకు అర్థాలు, ఇంకొన్ని భావనలపై మీ అభిప్రాయాలేంటి? అనే ఎక్సర్సైజ్‌ సంబంధ పేజీలు సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షమయ్యాయి. ఫొటోల వంటి ఇతరుల సమాచారాన్ని దొంగతనంగా సేకరించి వాటితో ఇంకొకరిని ఆకర్షించే ‘క్యాట్‌ షిషింగ్‌’, సంజాయిషీ లేకుండా బంధాన్ని హఠాత్తుగా తెగతెంపులు చేసుకునే ‘ఘోస్టింగ్‌’, ‘సైబర్‌ బులీయింగ్‌’ పదాలకు అర్థాలను ఈ చాప్టర్‌లో పొందుపర్చారు. ‘క్రష్‌’, ‘స్పెషల్‌’ ఫ్రెండ్‌ భావనలను చిన్న చిన్న కథలతో వివరించారు.