
Health Care: మనదేశంలో శృంగారం గురించి ఎన్నో అపోహలు ఉన్నాయి. వాటిని బహిరంగంగా చర్చించేందుకు ఎవరు ముందుకు రారు. ఈ నేపథ్యంలో శృంగారం గురించి ఏవేవో అనుమానాలు ఉండటం సహజమే. శృంగారం విషయంలో చాలా మందికి పలు సందేహాలు ఉండటం కామనే. కాని వాటిని పరిష్కరించుకునే మార్గాలే దొరకవు. దీనికి కారణాలు లేకపోలేదు. మనం శృంగారం అంటే నాలుగు గోడల మధ్య చేసుకునేదని నమ్ముతుంటాం. కాని విదేశీయులు మాత్రం బహిరంగంగానే శృంగారాన్ని ఆస్వాదిస్తుంటారు. వారి పాఠ్యాంశాల్లో సైతం శృంగారానికి సంబంధించి పాఠాలు పెడుతుంటారు. దీంతో చిన్న వయసులోనే వారికి లైంగికత పట్ల అవగాహన ఏర్పడుతుంది.
మనమెందుకు రహస్యం పాటిస్తాం
మనదేశ సంప్రదాయం ప్రకారం మనం శృంగారంలో రహస్యాన్ని పాటిస్తాం. శృంగారం గురించి బహిరంగంగా చర్చించేందుకు కూడా వెనకాడతాం. దీంతోనే మనకు ఎన్నో అనుమానాలు మెదడును తొలుస్తుంటాయి. శృంగారానికి ముందు తరువాత ఏం చేయాలనే దానిపై స్పష్టత ఉండటం లేదు. కొందరైతే శృంగారం తరువాత మూత్ర విసర్జన చేయాలని చెబుతుంటే మరికొందరు మాత్రం మూత్ర విసర్జన చేయడం వల్ల శుక్ర కణాలు బయటకు పోతాయని చేయొద్దని చెబుతుంటారు. దీనిపై ఎవరికి తోచింది వారు చెబుతున్నారు. ఇందులో శాస్త్రీయత ఏంటో తెలియడం లేదు.
ఇన్ఫెక్షన్లు
శృంగారంలో పాల్గొన్న తరువాత చాలా మందికి యూరినరీ ఇన్ఫెక్షన్లు రావడం కామనే. అందుకే శృంగారానికి ముందు మూత్ర విసర్జన చేయాలని చెబుతుంటారు. శృంగారానికంటే ముందు మూత్ర విసర్జన చేయడం వల్ల ఇలా ఇన్ఫెక్షన్లు రాకుండా చేసుకోవచ్చు. కొందరికి భావప్రాప్తి సమయంలో కూడా మూత్ర విసర్జన చేయాలని అనిపించడం జరుగుతుంది. అందుకే శృంగారానికి ముందు తరువాత మూత్ర విసర్జన చేయడం వల్ల ఇబ్బందులు ఉండవని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

మూత్ర విసర్జన
శృంగారం సమయంలో మూత్రాశయంలో మూత్రం ఉంటే బ్యాక్టీరియా లోపలకు వెళ్తుంది. దీంతో మూత్ర విసర్జన చేయకపోతే హాని కలుగుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని శృంగారంలో పాల్గొనక ముందే మూత్ర విసర్జన చేయడం వల్ల మంచిదే. శృంగారం తరువాత కూడా మూత్ర విసర్జన చేయడం వల్ల ఇతర వ్యాధులు రాకుండా ఉంటాయి. దీని వల్ల శృంగారానికి ముందు తరువాత మూత్ర విసర్జన చేయడం వల్ల ఇద్దరికి కూడా మేలు కలుగుతుంది. అందుకే అందరు మూత్ర విసర్జన మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఏర్పడుతుంది.