https://oktelugu.com/

వొడాఫోన్ ఐడియా కస్టమర్లకు శుభవార్త.. ఫ్రీగా 50జీబీ డేటా..?

వొడాఫోన్ ఐడియా కంపెనీ వినియోగదారులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఫ్రీగా 50 జీబీ డేటా పొందే అవకాశం కల్పించింది. ఎంపిక చేసిన ప్లాన్ పై ఉచితంగా డేటాను పొందవచ్చు. వొడాఫోన్ ఐడియా కస్టమర్లు ఉచితంగా 50 జీబీ పొందాలంటే 2,595 రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్ ను రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్లాన్ ను రీఛార్జ్ చేసుకున్న కస్టమర్లు రోజుకు 2జీబీ ఉచితంగా పొందవచ్చు. ఈ విధంగా సంవత్సరానికి 730 జీబీ డేటాను ఉచితంగా పొందే అవకాశం […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : January 27, 2021 / 12:54 PM IST
    Follow us on

    వొడాఫోన్ ఐడియా కంపెనీ వినియోగదారులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఫ్రీగా 50 జీబీ డేటా పొందే అవకాశం కల్పించింది. ఎంపిక చేసిన ప్లాన్ పై ఉచితంగా డేటాను పొందవచ్చు. వొడాఫోన్ ఐడియా కస్టమర్లు ఉచితంగా 50 జీబీ పొందాలంటే 2,595 రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్ ను రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్లాన్ ను రీఛార్జ్ చేసుకున్న కస్టమర్లు రోజుకు 2జీబీ ఉచితంగా పొందవచ్చు.

    ఈ విధంగా సంవత్సరానికి 730 జీబీ డేటాను ఉచితంగా పొందే అవకాశం ఉంటుంది. ఈ ప్లాన్ ను రీఛార్జ్ చేసుకున్న కస్టమర్లకు అపరిమిత కాలింగ్ ను పొందే అవకాశం ఉంటుంది. ప్రతిరోజూ 100 మెసేజ్ లు ఉచితంగా పొందే అవకాశం ఉంటుంది. ఈ ప్లాన్ ప్రీపెయిడ్‌ వ్యాలిడిటీ 365 రోజులు కాగా జీ5 సభ్యత్వాన్ని పొందవచ్చు. ఈ ప్లాన్ ను రీఛార్జ్ చేసుకోవడం ద్వారా ఇతర సౌకర్యాలను పొందే అవకాశం ఉంటుంది.

    ప్రస్తుతం ఇచ్చే డేటాతో పాటు ఉచితం 50జీబీ డేటా పొందే అవకాశం ఉండటంతో వొడాఫోన్ ఐడియా కస్టమర్లకు ఈ ప్లాన్ ద్వారా ప్రయోజనం చేకూరుతుందని చెప్పవచ్చు. జియో, ఎయిర్ టెల్ కంపెనీల నుంచి పోటీ ఎదురవుతున్న నేపథ్యంలో వొడాఫోన్ ఐడియా కంపెనీ ఈ నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. పోటీ కంపెనీలు కూడా కొత్త ప్లాన్ లను అందుబాటులోకి తీసుకురానున్నాయి.

    మరోవైపు జియో, ఎయిర్ టెల్ సంస్థలు కూడా కొత్తకొత్త ప్లాన్లను అందుబాటులోకి తెస్తూ యూజర్లకు మరింత చేరువవుతున్నాయి. వొడాఫోన్ ఐడియా కొత్త ప్లాన్లను అందుబాటులోకి తీసుకురావడంతో జియో, ఎయిర్ టెల్ లకు పోటీని ఇస్తుందేమో చూడాల్సి ఉంది.