https://oktelugu.com/

హీరో ప్రదీప్ అనగానే టెన్షన్ వస్తుందట !

బుల్లితెర మీద తన వాక్ చాతుర్యంతో అందర్నీ ఆకట్టుకుంటూ ప్రదీప్ మాచిరాజు స్టార్ యాంకర్ గా వెలుగుతున్నాడు. యాంకర్, యాక్టర్, టెలివిజన్ ప్రొడ్యూసర్ గా దూసుకుపోతున్న ప్రదీప్ ఇప్పుడు వెండితెర మీదకి ’30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. కరోనా లేకపోతే.. ఈ పాటికి ఈయన హీరోగా నటించిన సినిమా థియేటర్స్‌లో విడుదలై ఉండేది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన ‘నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా’ పాట సెన్సేషన్ క్రియేట్ చేసి […]

Written By:
  • admin
  • , Updated On : January 27, 2021 / 01:07 PM IST
    Follow us on

    బుల్లితెర మీద తన వాక్ చాతుర్యంతో అందర్నీ ఆకట్టుకుంటూ ప్రదీప్ మాచిరాజు స్టార్ యాంకర్ గా వెలుగుతున్నాడు. యాంకర్, యాక్టర్, టెలివిజన్ ప్రొడ్యూసర్ గా దూసుకుపోతున్న ప్రదీప్ ఇప్పుడు వెండితెర మీదకి ’30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. కరోనా లేకపోతే.. ఈ పాటికి ఈయన హీరోగా నటించిన సినిమా థియేటర్స్‌లో విడుదలై ఉండేది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన ‘నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా’ పాట సెన్సేషన్ క్రియేట్ చేసి ఈ సినిమా మీద మంచి హైప్ వచ్చేలా చేసింది.

    తాజాగా మూవీ ప్రొమోషన్ లో భాగంగా చిత్ర యూనిట్ మంగళవారం నాడు గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్బంగా ప్రదీప్ మాట్లాడుతూ… ఇలాంటి స్టేజ్ మీద నిలబడి మెగాస్టార్ చిరంజీవి గారిని, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని, హీరో నాని గారిని స్టేజి మీదకి నేను ఆహ్వానించాను, అలాంటిది ఇప్పుడు మొదటి సారి హీరో ప్రదీప్ అనగానే టెన్షన్ వచ్చింది అని ఎమోషనల్ అయ్యారు. మీ ఇంట్లో ఒకడిగా నన్ను అభిమానించి సపోర్ట్ చేసిన వారందరికీ కృతజ్ఞతలను తెలుపుకుంటున్నాను అని ఆయన అన్నారు. ఈ ఈవెంట్ కి ముఖ్య అతిధులుగా హీరో అడివి శేష్, కార్తికేయ, డైరెక్టర్స్ మారుతి, అనిల్ రావిపూడి వచ్చి ప్రదీప్ ని విష్ చేశారు.

    తాజాగా విడుదల చేసిన ప్రమోషనల్ సాంగ్ లో ప్రదీప్ తో పాటు అనసూయ,రష్మీ, శ్రీముఖి స్టెప్పులేశారు. ఈ మూవీలో ప్రదీప్ సరసన అమృతా అయ్యర్ హీరోయిన్‌గా నటించింది. డైరెక్టర్ సుకుమార్ శిష్యుడు మున్నా డైరెక్ట్ చేసిన ఈ మూవీని ఎస్‌.వి. ప్రొడ‌క్షన్స్ బ్యాన‌ర్‌పై ఎస్‌.వి.బాబు నిర్మించగా గీతా ఆర్ట్స్, యువి క్రియేషన్స్ లాంటి పెద్ద బేనర్లు రిలీజ్ చేస్తుండటం విశేషం. అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. ఈ నెల 29న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లుగా ప్రకటించారు.