Union Budget 2023-24: నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టారు.. మొత్తానికి పన్నులు లేకుండా వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని సంక్షేమ మంత్రం జపించారు. అసలు ఈ జీఎస్టీ శకంలో బడ్జెట్ వేల్యూ ఎంత? దానికి అనుగుణంగా జరిపే కేటాయింపులు ఎంత? తప్పనిసరి తంతు మాత్రమే కానీ… అసలు దానికి అనుగుణంగా నడుచుకున్నది ఎప్పుడు? కేంద్రమే కాదు… రాష్ట్రం పరిస్థితి కూడా ఇదే.

ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ రాష్ట్రాలు కూడా కొత్తగా పనులు వేసే అవకాశం లేదు.. ప్రతిదీ జిఎస్టి పరిధిలోకి వచ్చింది.. ఇక రాష్ట్రాలకు సొంతంగా పొగాకు, మద్యం, పెట్రోలు, రిజిస్ట్రేషన్, సీనరేజీ, మైనింగ్… వీటి మీద మాత్రమే ప్రభుత్వాలకు పన్నులు వసూలు చేసుకునే అవకాశం ఉంది.. ఇప్పటికే వీటి మీద పన్నులు మండిపోతున్నాయి.. తెలంగాణలో అయితే చెప్పాల్సిన పనిలేదు. ధరల స్థాయి మండిపోవడంలో ఈ రాష్ట్రం తర్వాతనే ఏ రాష్ట్రమైనా.. దీన్నే కేసీఆర్ మార్క్ ధరాత్మక మార్పు అనలేమో… అదంతా వేరే చర్చ.. పైగా మద్యం మీద ఎప్పటికప్పుడు బడ్జెట్ కు సంబంధం లేకుండా పెంచుతూనే ఉన్నారు.. ఇంకా ఈసారి పొగాకు వినియోగం తగ్గుతున్న దిశలో నిర్మలా సీతారామన్ పన్నుల మోత మోగించలేదు.
పెట్రోల్ మీద పొరుగు రాష్ట్రాల్లో కన్నా మోతలు, వాతలు మన దగ్గరే ఎక్కువ.. ఇంకా పెంచితే సగటు మనిషి మరింత దరిద్రంలోకి కూరుకు పోయే స్థితి.. కరోనా ముందు రోజులతో పోలిస్తే ఇప్పుడు మార్కెట్లో ప్రతి వస్తువు ధర డబుల్ అయింది.. సగటు జీవన వ్యయం రెట్టింపు అయింది.. దీనికి ప్రధాన కారణం పెట్రోల్ ధరలు.. వాటి ప్రభావం మనిషి నిత్య జీవనానికి సంబంధించిన ప్రతి సరుకుపై పడుతోంది.. ఇక రాష్ట్రాల బడ్జెట్ లో పన్నులు అనే కాన్సెప్ట్ ఇక కనిపించదు.. పోనీ, ప్రయారిటీలు, ఖర్చుల తీరు, అప్పుల వివరణల కోసమే బడ్జెట్ అనుకుందామా? ప్రయారిటీలు బడ్జెట్లో చెప్పేది ఒకటి. వాస్తవ ప్రయారిటీలు వేరు.. అసలు బడ్జెట్లో శాఖల వారీ పద్దులు రాసుకోవడమే గానీ… ఎప్పుడూ వాటికి అనుగుణంగా కేటాయింపులూ ఉండవ్..ఖర్చులూ ఉండవ్.. ఏ బడ్జెట్ అకౌంటెట్/ అడిటెడ్ వివరాలు చూసినా ఇది స్పష్టంగా తెలుస్తుంది.. అప్పులు బడ్జెట్లో చూపిన దానికన్నా ఎక్కువే తీసుకొస్తారు.. అంతేకాదు కమీషన్లు వచ్చే ప్రాజెక్టులకు కేటాయింపులు మరింతగా పెరుగుతాయి.. ఉదాహరణకు కాళేశ్వరం లాగా..

వెరసి రాష్ట్రాల బడ్జెట్లకు విలువ స్థూలంగా సున్నా.. ఇక దీనికి గవర్నర్ల ప్రసంగాలు, వాటికి అడ్డు పుల్లలు, అభ్యంతరాలు, కోర్టుల్లో కేసులు, రాజీలు ఎట్సెట్రా వివాదాలకు నిజంగా జన జీవితం లో ప్రాధాన్యం ఏమిటో అర్థం చేసుకోవచ్చు…ఫర్ డిబేట్ సేక్ ఎందరు ప్రజాప్రతినిధులకు బడ్జెట్ లెక్కలు అర్థమవుతాయి? ఎవరు వాటిని చదువుతారు? ప్రణాళికవ్యయం, ప్రణాళికేతర వ్యయం తేడా ఏమిటి? చామకూర మల్లారెడ్డి లాంటి మంత్రులు నిండిపోయిన కేబినెట్లో వీటి తేడాలు తెలుసా? అసలు బడ్జెట్ ప్రసంగాలు కూడా చదవరు చాలా మంది. ప్రజాస్వామికంగా ఇది తప్పనిసరి లాంఛనం కాబట్టి ప్రభుత్వాలు బడ్జెట్లో ప్రవేశపెడతాయి.. వాటి ఆమోదం లేకపోతే ఖజానా నుంచి డబ్బులు డ్రా చేయలేరు కాబట్టి.. అంతకుమించి బడ్జెట్లకు విలువ ఏమీ లేదు.. జానకి ఒకప్పుడు కేంద్ర బడ్జెట్ కు విశేష ప్రాధాన్యం ఉండేది.. సి జిఎస్టి వచ్చిన తర్వాత అది చేసేదేమీ లేదు.. దాని పరిధిలోని ఏ పన్ను స్లాబ్ అయినా సరే జిఎస్టి కౌన్సిల్ ఖరారు చేయాల్సిందే.. కాకపోతే సెంట్రల్ ఎక్సైజ్, కస్టమ్స్, కార్పొరేట్ టాక్స్, ఐటీ స్లాబులు వంటివి కొన్ని ఇంకా కేంద్ర పరిధిలోనే ఉన్నాయి.. అందుకే ఈ మాత్రం కాస్త ఆసక్తి.. ఈరోజు ప్రకటించిన బడ్జెట్లో 7 ఆదాయానికి ఐటీ మినహాయింపు అని చెబితే అది బాగా కనెక్ట్ అవుతుంది.. అది కోట్ల మందికి డైరెక్ట్ ఇంపాక్ట్ కాబట్టి..
నిజానికి బడ్జెట్ అంటే రాబోయే ఏడాదికి రఫ్ గా మన ఆదాయం, వ్యయాల అంచనాలు… మన అవసరాలు, వాటికి సరిపడా నిధుల సమీకరణ.. అంతే దాన్నిబట్టే నిద్ర ఖర్చు ఉండాలని ఏమీ లేదు.. ఉజ్జాయింపులు రాబోయే ఏడాదికి సంబంధించిన చిటపద్దులకు మరి ఎందుకింత ఆసక్తి? ఏమీ లేదు… గతంలో సరుకుల వారీగా పన్ను హెచ్చింపులు, తగ్గింపులు ఉండేవి కాబట్టి… సుదీర్ఘంగా బడ్జెట్ ప్రసంగాలను జనం వినేవాళ్లు.. ఇప్పుడే ముంది? ఏమీ లేదు… బడ్జెట్ కు సంబంధం లేకుండానే బాధతున్నారు కదా.. మీడియాలో కూడా ఎవరు బడ్జెట్ స్థూల అంశాల జోలికి పోరు. వాళ్లకూ అర్థం కాదు. ఏవో నాలుగు అంకెలు అటూ ఇటూ కూడి, ఏసి తీసేసి, మాయ చేసి మామ అనిపించేస్తారు.. వివిధ రంగాలకు కేటాయింపులు అని ఏవో రాస్తారు, చూపిస్తారు.. ఇక ప్రణాళిక,నాన్ ప్రణాళిక వేర్వేరు ఉంటాయి.. ఆడిటెడ్,రివైజ్డ్, బడ్జెట్లు వేరు వేరు.