Budget 2023 PMAY: వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా.. తమకు కీలక ఓటు బ్యాంకుగా ఉన్న బిపిఎల్ కుటుంబాలపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి వరాలు కురిపించారు.. వారి సొంత ఇంటి కలలు నెరవేర్చే బాధ్యత తీసుకున్నారు.. బుధవారం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకానికి నిధులను భారీగా పెంచారు.. ఈ పథకం కోసం 79 వేల కోట్లు కేటాయిస్తున్నట్టు నిర్మల ప్రకటించారు. మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేస్తున్నట్టు ఆమె వివరించారు.

పేదల సొంతింటి కల నెరవేరేలా కేంద్ర బడ్జెట్లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన నిధులను భారీగా పెంచింది.. ఈ పథకానికి గతంలో కంటే 66% నిధులను పెంచబోతున్నట్టు కేంద్ర మంత్రి నిర్మల ప్రకటించారు.. తాజా బడ్జెట్లో 79 వేల కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు.. అదే సమయంలో దేశంలో మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేస్తున్నట్టు వివరించారు.. దీనికోసం భారీగా నిధులు కేటాయిస్తున్నట్లు వివరించారు.. కేవలం మౌలిక సదుపాయాల కల్పన కోసం పది లక్షల కోట్లను ఖర్చు చేస్తామని నిర్మల తెలిపారు.. మౌలిక సదుపాయాల విభాగం జిడిపిలో 3.3 శాతాన్ని నమోదు చేస్తోందని వివరించారు.. 2020 లో చేసిన కేటాయింపులతో పోలిస్తే ఇది మూడు రెట్లు అధికమని కేంద్ర మంత్రి వివరించారు.

పేదలే కాకుండా పట్టణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు తాము కట్టుబడి ఉన్నామని నిర్మల తెలిపారు.. దీనికోసం ప్రత్యేకంగా అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ ఏర్పాటు చేస్తున్నట్లు ఆమె వివరించారు.. ఇప్పటికే ఉన్న గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధి నిధి తరహాలోనే దీన్ని జాతీయ హౌసింగ్ బ్యాంక్ నిర్వహిస్తుందని ఆమె స్పష్టం చేశారు.. ఇక ప్రాంతీయ కనెక్టివిటీని మెరుగుపరిచేందుకు 50 అదనపు ఎయిర్పోర్టులు, హెలిపాడ్లు, వాటర్ ఏరో డ్రోన్లు, అడ్వాన్సుడ్ ల్యాండింగ్ గ్రౌండ్ లను పునరుద్ధరిస్తున్నట్టు ఆమె ప్రకటించారు.. ఆకాశయానం పట్ల ప్రజలు ఆసక్తి చూపుతున్న నేపథ్యంలో ఈ రంగానికి తోడ్పాటు ఇస్తామని నిర్మల తెలిపారు.. ఇక ఈ విభాగంలో భారత్ ఐదో స్థానంలో ఉందని… 2028 నాటికి మొదటి స్థానాన్ని ఆక్రమించేలా ప్రణాళికలు రూపొందిస్తామని ఆమె పేర్కొన్నారు.