Hari Hara Veera Mallu: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మొట్టమొదటిసారి పీరియాడిక్ జానర్ లో చేస్తున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ చిత్రం ‘హరి హర వీరమల్లు’ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతున్న సంగతి అందరికీ తెలిసిందే..ఈ సినిమా పై అభిమానుల్లోనే కాదు, ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి..ఇప్పటికే ఈ సినిమా నుండి రెండు గ్లిమ్స్ వీడియోలు విడుదల చెయ్యగా,వారికి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

నిన్న మొన్నటి వరకు హైదరాబాద్ షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుత షెడ్యూల్ ముంబై లో జరుగుతుంది..ఈ షెడ్యూల్ లో పవన్ కళ్యాణ్ ఉండదట..కేవలం బాబీ డియోల్ మాత్రమే ఉంటాడట..ఆయన మీద వచ్చే కొన్ని కీలకమైన సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు..ఇందులో బాబీ డియోల్ ఔరంగ జేబు పాత్రలో నటిస్తున్నాడు..నౌరా ఫతేహి ఆయన చెల్లెలు పాత్ర పోషిస్తుంది..ఇప్పటి వరకు ఈ చిత్రం 60 శాతం వరకు షూటింగ్ పూర్తి చేసుకుంది.
ఇది ఇలా ఉండగా ఈ సినిమాకి సంబంధించి ఒక లేటెస్ట్ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియా ని ఊపేస్తోంది..అదేమిటంటే ‘హరి హర వీరమల్లు’ చిత్రం కేవలం ఒక్క సినిమా కాదు..రెండు భాగాలుగా తెరకెక్కబోతుందట..డైరెక్టర్ క్రిష్ ఇటీవలే ఈ ఐడియా ని పవన్ కళ్యాణ్ ముందు పెట్టగా, ఆయన కూడా అందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం..దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఒక్కటి రావడం బ్యాలన్స్ అంటున్నారు విశ్లేషకులు.

ఈ చిత్రం లో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా, MM కీరవాణి సంగీతం అందిస్తున్నాడు..ఇప్పటి వరకు ఈ సినిమా కోసం నిర్మాత AM రత్నం 170 కోట్ల రూపాయిలు ఖర్చు చేసినట్టు సమాచారం..డైరెక్టర్ క్రిష్ ఎక్కడా కూడా తగ్గకుండా ఈ సినిమాని పవన్ కళ్యాణ్ కెరీర్ లో మాత్రమే కాదు,ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ హిస్టరీ లోనే ఒక మైలు రాయిగా నిలిచిపొయ్యే చిత్రం గా తెరకెక్కిస్తున్నాడు.