Bruce Lee
Bruce Lee: మార్షల్ ఆర్ట్స్ అనగానే ప్రతి ఒక్కరికి గుర్తుకు వచ్చే పేరు బ్రూస్లీ. మార్షల్ ఆర్ట్స్ విద్యలో ప్రపంచ వ్యాప్తంగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును పొందాడు బ్రూస్లీ. ఎంతో మంది యువత బ్రూస్లీని ఆదర్శంగా తీసుకొని మార్షల్ ఆర్ట్స్ విద్యను నేర్చుకున్నారు. ఇప్పటికీ ఎంతో మంది నేర్చుకుంటూనే ఉన్నారు. శిక్షణ తీసుకునే ఎంతో మందికి బ్రూస్లీ మాదిరిగా ఎదగాలన్న కల ఉంటుంది. అందుకే ఇప్పటికీ మార్షల్ ఆర్ట్స్ పేరు చెబితే బ్రూస్లీయే అందరికీ గుర్తుకు వస్తాడు. బ్రూస్లీ మృతి చెంది 50 ఏళ్లు దాటుతున్నప్పటికీ.. ఇప్పటికీ అతని గురించి ఇంటర్నెట్లో వెతుకుతున్న వారి సంఖ్య భారీగా ఉందంటే.. ఆయన ప్రభావం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. తాజాగా బ్రూస్లీ కి సంబంధించిన ఒక విషయం సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది.
మార్షల్ ఆర్ట్స్ విద్యలో తక్కువ కాలంలోనే ఎక్కువ ప్రతిభను ప్రదర్శించాడు బ్రూస్లీ. మార్షల్ ఆర్ట్స్ అంటే బ్రూస్లీ.. బ్రూస్లీ అంటే మార్షల్ ఆర్ట్స్ అన్నంతగా పేరు సంపాదించాడు. 1940లో ఫ్రాన్సిస్కోలో జన్మించిన బ్రూస్లీ.. 32 ఏళ్ల జీవితంలో మార్షల్ ఆర్ట్స్ లో అద్భుత ప్రతిభతో ప్రపంచ వ్యాప్తంగా తన పేరు మార్మోగిపోయేలా చేసుకున్నాడు. 1973లో ఆయన మృతి చెందాడు. ఆయన మృతి చెంది నేటికీ సుమారు 50 ఏళ్ళు అవుతున్న.. నేటికీ ఆయన గురించి ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తున్న వారి సంఖ్య ఉండడం గమనార్హం.
సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న వర్కవుట్ ప్లాన్..
బ్రూస్లీకి సంబంధించిన ఒక విషయం ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అదే 1965 నాటి ఆయన వర్కౌట్ ప్లాన్. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న ఆ వర్కౌట్ ప్లాన్ లో బ్రూస్లీ వర్క్ అవుట్ ప్లాన్ కెవుంగ్ జిమ్నాషియంతో ముడిపడి ఉన్నట్టు ఉంది. దీనిలో అతను ఏ వర్క్ అవుట్ ఎన్నిసార్లు, ఎంతసేపు చేశాడనే వివరాలు ఉన్నాయి. ఈ వర్క్ అవుట్ ప్లాన్ చూసిన వారంతా తెగ ఆశ్చర్యపోతున్నారు. ఈ రొటీన్ ను ఫాలో చేయడం అంత సులభం కాదని పేర్కొంటున్నారు. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న ఈ వర్కౌట్ పోస్టులో బ్రూస్లీకు సంబంధించిన ఒక బ్లాక్ అండ్ వైట్ ఫోటో కూడా ఉంది.
ఎనిమిది మిలియన్లకు పైగా వ్యూస్..
బ్రూస్ లీ వర్క్ అవుట్ కు సంబంధించిన వివరాలతో కూడిన షీట్ ను వరల్డ్ ఆఫ్ హిస్టరీ పేరుతో ఉన్న ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేశారు. దీనికి 1965లో బ్రూస్లీ ఎర్లీ ట్రైనింగ్ ప్లాన్ అనే కామెంట్ రాశారు. గత కొద్ది రోజుల నుంచి ఈ అకౌంట్ లో ఇది కనిపిస్తోంది. ఇప్పటి వరకు ఈ పోస్టుకు ఎనిమిది మిలియన్లకుపైగా వ్యూస్ వచ్చాయి. 70 వేలకు పైగా లైక్స్ పడ్డాయి. ఈ వర్క్ అవుట్ ప్లాన్ చూసిన వారంతా తెగ ఆశ్చర్యపోతూ దీనిని ఫాలో చేయడం చాలా కష్టం అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ ప్లాన్ పూర్తి చేసేందుకు గంటల సమయం పడుతుందని పలువురు కామెంట్లు చేస్తున్నారు. ఈ ప్లాన్ ఎలా వర్క్ అవుట్ చేశారో అర్థం కావడం లేదు అంటూ మరి కొంతమంది చెబుతున్నారు.
Web Title: Bruce lees workout plan when he was alive what did he do viral pic
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com