Bandla Ganesh- Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భక్తుడు బండ్ల గణేష్ సంచలన ట్వీట్ వేశారు. ఇకపై పవన్ కళ్యాణ్ కి దూరంగా ఉంటాను. ఈ విధంగా ఆయన పేరు వాడుకుని లబ్ది పొందను అంటూ బల్లగుద్ది చెప్పాడు. బండ్ల గణేష్ లో ఈ మార్పుకు కారణం తెలియక టాలీవుడ్ వర్గాల్లో చర్చ మొదలైంది. పవన్ కళ్యాణ్ తో బండ్ల గణేష్ కి గొప్ప అనుబంధం ఉంది. బండ్ల గణేష్ నిర్మాత అయ్యాక పవన్ కళ్యాణ్ ఆయనకు ఛాన్స్ ఇచ్చారు. వీరిద్దరి కాంబోలో తీన్ మార్, గబ్బర్ సింగ్ చిత్రాలు తెరకెక్కాయి. గబ్బర్ సింగ్ బ్లాక్ బస్టర్ కొట్టింది. 2012లో ఈ చిత్రం విడుదల కాగా మరలా చిత్రం చేయలేదు.
పవన్ కళ్యాణ్ తో బండ్ల గణేష్ అనుబంధం మాత్రం కొనసాగించారు. నెలా రెండు నెలలకు పవన్ కళ్యాణ్ ని బండ్ల గణేష్ కలిసేవారు. అయితే భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కేంద్రంగా ఇద్దరి మధ్య దూరం పెరిగింది. పవన్ కళ్యాణ్ కి అత్యంత ఆప్తుడైన త్రివిక్రమ్ ని ఉద్దేశిస్తూ బండ్ల గణేష్ అనుచిత కామెంట్స్ చేశాడు. భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి నాకు ఆహ్వానం లేదు. త్రివిక్రమ్ కావాలని నన్ను రాకుండా చేస్తున్నాడని ఫోన్లో మాట్లాడిన సంభాషణ లీకైంది.
ఈ సంఘటన తర్వాత పవన్ కళ్యాణ్, బండ్ల గణేష్ కలిసింది లేదు. సోషల్ మీడియాలో మాత్రం బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ పై తన అభిమానం చాటుకుంటూ ఉండేవాడు. నేడు గురు పౌర్ణిమ కాగా బండ్ల గణేష్ కొంచెం భిన్నంగా రియాక్ట్ అయ్యారు. పవన్ కళ్యాణ్ స్థాయిని పెంచుతూనే ఇకపై మీకు దూరంగా ఉంటాను అన్నాడు. మీ స్థాయి తెలిసిన వాడిగా చెబుతన్నా మీరు కోరుకున్న లక్ష్యం చేరుకుంటారు. నేను ఇకపై మీ పేరు, కీర్తి ఏ విధంగానూ వాడుకోను, లబ్ది పొందాలని చూడను, అని ట్వీట్ చేశారు.
బండ్ల గణేష్ ట్వీట్ వెనుక పూర్తి ఆంతర్యం అర్థం కాలేదు. బండ్ల గణేష్ ట్వీట్ వైరల్ అవుతుంది. కాగా పవన్ కళ్యాణ్ కమ్ బ్యాక్ ప్రకటించాక ఆయనతో మూవీ చేయాలని బండ్ల గణేష్ చాలా ప్రయత్నం చేశారు. కానీ అది సాకారం కాలేదు. ఎప్పటికైనా తన బ్యానర్లో పవన్ కళ్యాణ్ మూవీ చేస్తాడని బండ్ల గణేష్ ఆశతో ఉన్నాడు. ఇక బండ్ల గణేష్ ట్వీట్ పై జనసైనికులు భిన్నమైన అభిప్రాయాలు వెల్లడిస్తున్నారు.
https://twitter.com/ganeshbandla/status/1675734130468982785