Viral: ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలు చూస్తే అందరూ షాక్ అయిన పరిస్థితి. కరోనాతో చనిపోయిన తండ్రిని బొమ్మ రూపంలోకి మార్చి చెల్లి పెళ్లి రోజు తీసుకొచ్చి ఆమెకు తండ్రి లేని లోటును తీర్చాడు ఓ అన్నయ్య. ఆ అన్నయ్య పేరు ఆవుల ఫణి. ఆయన పడ్డ కష్టమేంటి? ఎలా నాన్న గారి మైనపు విగ్రహాన్ని తయారు చేయించారు? పడిన కష్టం తాలూకా వివరాలను తాజాగా పంచుకున్నారు.
ఆవుల ఫణి. సంవత్సరం క్రితం కరోనాతో చనిపోయిన తన తండ్రిని మైనంపై బెంగళూరులో తయారు చేయించాడట.. దీని కోసం లక్షలు ఖర్చు అయినట్టు సమాచారం. ఫణి, ఆయన భార్య సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు. అమెరికాలో పనిచేస్తుంటారు. కరోనా వచ్చినప్పటి నుంచి వారు ఇండియాకు వచ్చి ఇంటినుంచే పనిచేస్తున్నారు.
Also Read: Manchu Vishnu Jinnah Movie: జిన్నా’ కి గణేష్ ఆచార్య కొరియోగ్రఫీ!
చెల్లి పెళ్లికి నాన్న లేని లోటు తీర్చాలని.. ఆయనను తీసుకురావాలని సీక్రెట్ గా ప్లాన్ చేసిన ఫణి.. బెంగళూరు భార్యతో వెళ్లి అక్కడ కంపెనీతో మాట్లాడి విదేశాల నుంచి మైనం సహా మెటీరియల్ తెప్పించాడు. కరోనా వల్ల సంవత్సరం పట్టింది ఈ విగ్రహం తయారు చేయడానికి.. చెల్లి పెళ్లి వరకూ తీసుకొచ్చి సర్ ప్రైజ్ చేయాలని చూశాడు.
దీనికి ఫణి భార్య సహకరించింది. ఆమె దగ్గరుండి తన మామ గారి విగ్రహాన్ని దగ్గురుండి తయారు చేయించింది. ఫణి భార్య కృషితో ఇప్పుడు ఆయన విగ్రహం రూపుదిద్దుకుంది. అది తేగానే పెళ్లి మండపం మొత్తం షాక్ అయిపోయింది. ఈ క్రమంలోనే విగ్రహం తయారీకి పడిన కష్టాలు వివరించారు ఆయన కుమారుడు-కోడలు. అవిప్పుడు చర్చనీయాంశమయ్యాయి.
Also Read: Ram Gopal Varma- Apsara Rani: అప్సర అందాలను తట్టుకోలేక రాంగోపాల్ వర్మ ఏం చేశాడో తెలుసా?
Recommended Videos