British Women Sirin Murad: బల్గేరియాలోని సన్నీ బీచ్‌లో ఓ వింత జరిగింది. 30 నిమిషాల పాటు ఆ బీచ్‌లో ఎండలో నిద్రపోయిన తర్వాత సిరిన్ మురాద్ అనే 25 ఏళ్ల అమ్మాయి తన పేస్ పై ఏదో చేంజ్ గమనించి, వేళ్లతో చిన్నగా తడుముకుంది. ఏదో గరుకు గరుకు గా ఆమెకు అనిపించింది. మృదువైన తన మొహం పై ఏమిటి ఈ గరుకు అనుకుంటూ బ్యాగ్ లో అద్దం తీసుకుని పేస్ ను పరీక్షగా చూసుకుంది. అంతే.. ఆ బ్రిటీష్ యువతి గుండెలు బాదుకుంటూ కేకలు పెట్టడం మొదలు పెట్టింది.

చుట్టుపక్కన ఉన్న వాళ్లకు అసలు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. అందరూ ఆమె చుట్టూ చేరారు. ‘ఏమైంది.. ఏమైంది.. ఏమైనా ప్రాబ్లమా ?’ అంటూ ఆమె మొహం వైపు చూశారు. వాళ్ళు కూడా నోరెళ్ళ పెట్టి ‘ఇదేమిటి ?’ అంటూ అలాగే షాక్ గా చూస్తూ ఉన్నారు. పైగా ఆ గుంపులో కొందరు ఆ యువతి మొహం గురించి భయంభయంగా ఏవేవో గుసగుసలు లాడుకుంటున్నారు.
ఇంతకీ, ఆ యువతి మొహానికి ఏమైంది ? అంటూ దూరంగా ఇదంతా గమనిస్తున్న ఓ వృద్ధ మహిళ అనుమానంగా చూసింది. అదే అనుమానంతో చిన్నగా పైకి లేచి.. వచ్చి, ఆ యువతి మొహం చూసింది. వెంటనే ఆ బామ్మ ఆ యువతిని తిడుతూ ‘ఎందుకు ఈ పని చేశావ్ ?, బాగానే ఉన్నావ్ కదా ?, నీకు ఏమైనా పిచ్చా ?’ అంటూ ఆవేశంగా అరవడం మొదలు పెట్టింది.
ఆ యువతి కూడా తాను ఏదో పెద్ద తప్పు చేశాను అని ఫీల్ అవుతూ కూర్చింది. మళ్లీ పక్కన అద్దం తీసుకుని పేస్ చూసుకుంది. ఆ యువతి నుదురు ప్లాస్టిక్‌గా కనిపించింది. మళ్లీ ఆ యువతి బెంబేలెత్తిపోయింది. చివరకు తాను చేసిన తప్పు అర్ధం చేసుకుంది.
ఎలాంటి చర్మ రక్షణ తీసుకోకపోవడం తాను చేసిన అతి పెద్ద తప్పు అని చివరకు రియలైజ్ అయ్యింది. “మీ చర్మం కాలిపోదని మీరు ఎంతగా భావించినా, ఎల్లప్పుడూ సన్‌స్క్రీన్ మాత్రం అప్లై చేయడం మాత్రం మానకండి’ అంటూ పోస్ట్ పెట్టింది.