Bride And Groom Viral Video: సామాజిక మాధ్యమాల వినియోగం ప్రస్తుతం విపరీతంగా పెరిగిపోయింది.. ఈ క్రమంలో విచిత్రమైన వీడియోలు తెరపైకి వస్తున్నాయి. అందులో కొన్ని వీడియోలు సంచలనం సృష్టిస్తున్నాయి. ఇంకా కొన్ని వీడియోలు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. మరికొన్ని వీడియోలు నవ్వు తెప్పిస్తున్నాయి. ఈ వీడియో కూడా అటువంటిదే. చూస్తుండగానే పొట్ట పగిలే విధంగా నవ్వు తెప్పిస్తోంది. అలాగని అక్కడ జరిగింది అద్భుతం కాదు. ఆశ్చర్యం అంతకన్నా కాదు.. ఓ పెళ్లి వేదిక.. కాబోయే వధూవరులు.. మధ్యలో ఓ పూజారి.. ఈ డిఫరెంట్ కాన్సెప్ట్ ఏంటో.. దాని వెనుక ఉన్న కథ ఏంటో మీరే చదివేయండి ..
ఆ వీడియోలో కనిపిస్తున్న దృశ్యాల ప్రకారం..ఓ విలాసవంతమైన ప్రదేశంలో అద్భుతంగా డెకరేషన్ చేసిన వివాహ వేదిక ఉంది. ఆ వివాహానికి చాలామంది హాజరయ్యారు. వారంతా కూడా డబ్బున్న వాళ్ళు.. అందువల్లే అక్కడ అడుగడుగునా దర్పం కనిపిస్తోంది. వధూవరులు కూడా అదే స్థాయిలో కనిపిస్తున్నారు. ఈ వివాహానికి ముందు ఫోటోగ్రాఫర్ నూతన వధూవరులను ఫోటోలు తీస్తున్నాడు. ఇందులో భాగంగా కొన్ని స్టిల్స్ తీస్తున్నాడు.
రకరకాల ఫోజులు ఇవ్వాలని వారికి సూచిస్తున్నాడు. ఇందులో భాగంగా నూతన వధూవరులు గట్టిగా హగ్ చేసుకోవాలని చెప్పాడు. ఫోటోగ్రాఫర్ చెప్పినట్టుగా వచ్చేస్తున్నారు. ఇంతలోనే ముద్దు పెట్టుకోవాలని సూచించాడు. దానికి తగ్గట్టుగానే వారు ముద్దు పెట్టుకోవడానికి ప్రయత్నిస్తుండగా ఇంతలోనే పూజారి పెళ్లి వేదిక మీదికి వచ్చాడు. ముద్దు పెట్టుకోడానికి వారు ప్రయత్నిస్తుండగా.. అడ్డగించాడు.
పూజారి రావడంతో వారిద్దరు తమ ముద్దు ప్రయత్నాన్ని విరమించుకున్నారు. ” నాలుగు గోడల మధ్య జరగాల్సిన కార్యాన్ని నాలుగు దిక్కుల మధ్య మీరు చేయకూడదు. పైగా ఇది పెళ్లి వేదిక. పెళ్లి వేదిక మీద ఇటువంటి పనులు చేయకూడదు. బుద్ధిగా పెళ్లి చేసుకోండి. నేను చెప్పినట్టు వినండి. పెళ్లి తర్వాత మీ ఇష్టం” అని పూజారి చెప్పడంతో వధూవరులు పెళ్లి వేదిక మీద ఆసీనులయ్యారు. అనంతరం ఆ పూజారి పెళ్లి క్రతువు నిర్వహించాడు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాలలో సంచలనం సృష్టిస్తోంది.
View this post on Instagram