Viral News: అందానికి.. అలంకరణకు విపరీతమైన ప్రాధాన్యం ఇస్తున్న రోజులు ఇవి. పదిమందిలో బాగా కనిపించాలని.. పది మంది దృష్టిని ఆకర్షించాలని.. పదిమందిలో ప్రత్యేకంగా దర్శనమివ్వాలని అనుకుంటున్న రోజులువి. అందువల్లే అలంకరణ కోసం ఎంతైనా ఖర్చు పెడుతున్నారు. ఎక్కడిదాకా అయినా వెళ్తున్నారు.
Also Read: భయంకరమైన బ్యాటర్లు ఎంతమందున్నా.. మిస్టర్ ఐసీసీ కోహ్లీనే.. ఎందుకంటే?
ఒకప్పటితో పోల్చితే ఇప్పుడు మహిళలకే కాదు, పురుషులకు సెలూన్లు పెరిగిపోయాయి. స్పా, బ్యూటీ కేర్ సెంటర్లు ఎక్కువైపోయాయి. హైదరాబాదు లాంటి ప్రాంతాల్లో అయితే మల్టీ నేషనల్ కంపెనీలు కూడా తమ సంస్థలను ఏర్పాటు చేస్తున్నాయి.. హెయిర్ సెలూన్, బ్యూటీ కేర్, స్పా, నెయిల్ పాలిష్, బాడీ మాలీష్, హేర్ కేర్ సెంటర్ల ద్వారా సేవలందిస్తున్నాయి. పిండి కొద్ది అన్నట్టుగా.. ఇక్కడ డబ్బులు తగ్గట్టుగా సేవలు లభిస్తున్నాయి. నేటి కాలంలో డబ్బులను ఎవరూ పెద్దగా లెక్క చేయడం లేదు కాబట్టి.. ఇలాంటి వాటిల్లో వేలకు వేలు ఖర్చు చేసి తమ అందానికి మెరుగులు దిద్దుకుంటున్నారు. కేవలం మహిళలు మాత్రమే కాదు.. పురుషులు కూడా తమ చర్మరక్షణ నుంచి మొదలుపెడితే అందానికి మెరుగులు దిద్దే వరకు వేలకు వేలు ఖర్చు చేస్తున్నారు. అయితే ఇది ఒక పరిమితికి వరకయితే బాగానే ఉంటుంది. అది దాటితేనే తేడా వస్తుంది. ఇప్పుడు మీరు చదివే కథనం అలాంటిదే మరి.
జుట్టు ను అలా చేశారు..
సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ఓ వీడియో ప్రకారం.. ఓ వ్యక్తి భారీగా జుట్టును పెంచుకొని వచ్చాడు. పక్కనే ఉన్న హెయిర్ సెలూన్ కి వెళ్ళాడు. అక్కడ కటింగ్ చేసే వ్యక్తి ఆ జుట్టును చిత్ర విచిత్రంగా చేశాడు. ముందుగా ఆ జుట్టును మొత్తం ఒక దగ్గరికి తీసుకొచ్చి ఒక రూపంలో కట్ చేశాడు. ఆ తర్వాత దానిని ఒక పెనం లాగా మార్చాడు. అంతేకాదు దానిపై టమాటాలు.. ఇతర వస్తువులు వేసి.. వంటకం చేసుకోవచ్చు అన్నట్టుగా సంకేతం ఇచ్చాడు.. వాస్తవానికి జుట్టుపై ప్రపంచంలో ఎంతోమంది ఎన్నో ప్రయోగాలు చేసినప్పటికీ.. ఇలాంటి ప్రయోగాన్ని మాత్రం ఎవరూ చేసి ఉండరు. ఎందుకంటే ఒక జుట్టును పెనం లాగా మార్చడం అంత ఈజీ కాదు. కానీ ఈ బార్బర్ అలా చేసి చూపించాడు. అయితే కొంతమంది ఆ బార్బర్ చేసిన ప్రయత్నాన్ని మెచ్చుకుంటుండగా.. మరికొందరేమో జుట్టుతో ఇవేం ప్రయోగాలంటూ మండిపడుతున్నారు. జుట్టు మీద వంటలు చేస్తారా.. అలా వంటలు చేసి ఎవరికి పెడతారు.. జుట్టు మీద మంట పెడితే ఏమైనా ఉందా.. అంటూ ప్రశ్నలు వేస్తున్నారు. ఇలాంటి వాటి సంగతి ఎలా ఉన్నా.. మొత్తానికి ఆ బార్బర్ జుట్టుతో పెనాన్ని రూపొందించడం మామూలు విషయం కాదు. అతని నైపుణ్యానికి వందకు వెయ్యి మార్కులు వేయాల్సిందే. అన్నట్టు పెనం లాగా రూపొందించి న ఆ జుట్టు.. మళ్లీ మామూలు రూపంలోకి రావాలంటే ఎన్ని వేలు ఖర్చు పెట్టాలో.. ఐనా పుర్రెకో బుద్ధి.. జిహ్వ కో రుచి అని పెద్దలు ఊరికి అనలేదు కదా.
View this post on Instagram