Boy Friend On Rent: ఇటీవల కాలంలో ప్రేమ కొత్త పుంతలు తొక్కుతోంది. యువత ప్రేమకు ప్రాధాన్యం ఇస్తోంది. కానీ అందులో నిజాయితీ ఉండటం లేదు. నిజమైన ప్రేమను ఎవరు నమ్మడం లేదు. దీంతో మోసగాళ్లకే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఫలితంగా మోసపోయిన వారే ఎక్కువగా ఉంటున్నారు. ప్రేమ అనేది అందమైన భావం. ఒకసారి ప్రేమిస్తే జీవితాంతం దాని తాలూకు భావాలు మదిలో కలవరపెడుతూనే ఉంటాయి. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఉదయం ప్రేమలో పడి సాయంత్రం వీడ్కోలు చెప్పుకునేవారే ఉంటున్నారు. ఈ నేపథ్యంలో బెంగుళూరుకు చెందిన ఓ కుర్రాడు ప్రేమలో మోసపోయిన వారి కోసం ఆసరా అందించేందుకు ఓ యాప్ ను సృష్టించాడు. మోసపోయిన అమ్మాయిలకు ఓదార్పు కలిగించి వారిలో ఆత్మస్థైర్యం నింపేందుకు నిర్ణయించుకున్నాడు. దీంతో అమ్మాయిలు అనవసరంగా ఆందోళన చెందకుండా వీరి సేవలు వినియోగించుకుని తమ బాధలను దూరం చేసుకోవచ్చని చెబుతున్నాడు.

ప్రేమలో మోసపోయిన వారికి చేయూత అందించే ఉద్దేశంతో బెంగుళూరుకు చెందిన కొందరు యువకులు కలిసి టాయ్ బాయ్ అనే పేరుతో వెబ్ సైట్ ప్రారంభించారు. దీంతో ప్రేమించిన వాడు దూరమైన వారికి సహాయం చేస్తామని చెబుతున్నారు. సాయం అంటే అమ్మాయితో సినిమాలకు, షికార్లకు వెళ్లడం కాదు. ఆమెలో మానసిక స్థైర్యం పెరిగేందుకు దోహదపడే మంచి మాటలు చెప్పడానికి. మోసం చేసిన వాడి గురించి నిరంతరం బాధ పడే బదులు ఇలా వారి మాటలతో సాంత్వన చేకూరితే చాలనే భావన వారిలో కనిపిస్తోంది.
ఇలా అద్దెకు కుదిరిన బాయ్ ఫ్రెండ్ అమ్మాయితో ఫోన్, ఆన్ లైన్ లో మాత్రమే అందుబాటులో ఉంటాడు. మానసిక వేదన, ఒత్తిడి ఉన్నట్లయితే వారి సమస్యను దూరం చేసి వారిలో మంచి ఆలోచనలు నింపుతాడు. వారి ఆవేదనను తొలగించి మనసును ప్రశాంతంగా ఉండేలా చేస్తాడు. దీనికి గాను వారు డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. దీంతో ఈ వెబ్ సైట్ కు మంచి డిమాండ్ వస్తోంది. జీవితంలో మోసపోయిన అమ్మాయిలు వీరిని కలిసి తమ బాధల నుంచి విముక్తులు అవుతున్నారు. వీరు చేపట్టిన కార్యక్రమం సత్ఫలితాలు ఇస్తోంది.

ఇప్పటికే జపాన్ లో ఇలాంటి సేవలు అందుతున్నాయి. అక్కడ మంచి క్రేజీ ఏర్పడుతోంది. దీంతో అలాంటి తరహాలోనే ఇక్కడ కూడా అమలు చేయాలని భావించిన యువకుల ప్రయత్నం మంచి ఫలితాలే ఇస్తోంది. తమ యాప్, వెబ్ సైట్ ద్వారా అమ్మాయిలకు ధైర్యం కలిగిస్తున్నారు. వారిలో జీవితంపై ఆశలు కల్పిస్తున్నారు. ప్రేమపేరుతో వంచించే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని బోధిస్తున్నారు. దీంతో వారి సేవల విషయంలో ఇప్పటికే కావాల్సినంత ప్రచారం జరిగిపోయింది. రెస్పాన్స్ బ్రహ్మాండంగా వస్తోంది. దీంతో దీన్ని కంటిన్యూ చేస్తూ ఇంకా విస్తృతంగా సేవలు అందించాలని భావిస్తున్నారు.