Boy Friend Girlfriend Rented: ఓ మహిళ ఇటీవల భర్తకు అద్దెకు ఇచ్చిన ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయింది. వివిధ పనులకు తన భర్తను అద్దెకు ఇస్తూ సంపాదిస్తుందని అందులో ఉంది. ఇదిలా ఉంటే.. ఇక్కడ ఇంకో అడుగు ముందుకు వేసి.. ఒంటి యువతీ యువకులకు గర్ల్, బాయ్ ఫ్రెండ్స్‌ను అద్దెకు ఇస్తున్నారు. అయితే షరతులు వరిస్తాయని చెబుతున్నారు. మరి ఇది ఎక్కడ.. ఎందుకు అనేది తెలుసుకుందాం.
జపాన్ దేశంలో ఒంటరి యువతీ యువకులు పెరిగిపోతున్నారు. సాధారణంగా జపనీస్ హార్డ్ వర్కర్స్. నిరుద్యోగుల తక్కువ. ఎవరి పనులు వారు చేసుకుంటూ పోతారు. ఈ క్రమంలో ప్రేమ, పెళ్లికి పెద్దగా ప్రాధాన్యం ఇవ్వడం లేదు. ఈ క్రమంలో జపాన్ దేశం ఒక బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఒంటరిగా ఉన్న యువతీ యువకులు అద్దె చెల్లించి బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ ని సొంతం చేసుకోవచ్చు. పెళ్లికాని యువతీయువకుల ఆవేదనని అర్ధం చేసుకుని జపాన్ ప్రభుత్వమే ఈ ఆఫర్ తీసుకువచ్చింది.
మోడువారిన జీవితాల్లో కొత్త చిగురు..
జీవితంలో ఎవ్వరి తోడులేక మొడుబారిన ఒంటరి వ్యక్తుల బతుకుల్లో కొత్త ఆశలను చిగురించాలనే ఉద్దేశంతోనే ఈ స్కీం తెచ్చినట్లు ప్రభుత్వం ప్రకటించింది. అయితే గర్ల్ లేదా బాయ్ ఫ్రెండ్‌ను ఎంపిక చేసుకోవడానికి ఆన్‌లైన్ ద్వారా యువతీ యువకులను గంటల ప్రాతిపదికన ఎంపిక చేసుకోవచ్చు.
గంటకు రూ.3 వేల అద్దె..
బాయ్ ఫ్రెండ్ లేదా గర్ల్ ఫ్రెండ్ లేనివారు ఎవరైనా అద్దెకు వారిని పొందవచ్చు. గంటకు రూ.3 వేలు చెల్లించి బాయ్ ఫ్రెండ్ లేనివారు ప్రియుడిని గర్ల్ ఫ్రెండ్ లేని వారు ప్రియురాలిని సొంతం చేసుకోవచ్చు. ఎంచుకునే అభ్యర్థిని బట్టి అదనంగా మరో రూ.1200 చెల్లించాల్సి ఉంటుందని చెబుతున్నారు సదరు ఆన్‌లైన్ పోర్టల్ నిర్వాహకులు.
కండీషన్స్..
ఈ సర్వీసును వినియోగించుకునే వారిలో అత్యధికులు వారి జీవితంలో ఎటువంటి తోడు లేనివారు, పెళ్లి కానీవారే. ఈ సేవలు వినియోగించుకునే వారు ఆన్‌లైన్ పార్ట్‌నర్‌కు ఎటువంటి ఖరీదైన కానుకలు ఇవ్వడానికి లేదు. డైరెక్టుగా మాట్లాడే అవకాశమూ లేదు. ఆన్‌లైన్ బాయ్ ఫ్రెండ్ లేదా గర్ల్ ఫ్రెండ్ కావాలనుకునేవారు వీటితోపాటు అనేక నిబంధనలను కూడా పాటించాల్సి ఉంటుందని పోర్టల్ నిర్వాహకులు పేర్కొంటున్నారు. పోర్టల్‌కు మంచి రెస్పాన్స్ వస్తోందని చెబుతున్నారు.
ఈ సర్వీసు ఏదో బాగుంది కదూ. కేవలం బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ మాత్రమే కాదు, జపాన్ దేశంలో కుటుంబ సభ్యులు కావాలన్నా కూడా అద్దెకు దొరుకుతారట. మరి మన దేశంలో కూడా అందుబాటులోకి వస్తుందో చూడాలి మరి!