
India Vs Australia 3rd Test: నాగపూర్ లో గెలిచింది. ఢిల్లీలో విజయ పతాకం ఎగరేసింది. బుధవారం ఇండోర్ లో తల పడబోతోంది. ఇది గెలిస్తే భారత్ డబ్ల్యుటిసి ఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది. బోర్డర్, గవాస్కర్ ట్రోఫీలో భాగంగా నాలుగు టెస్టుల సిరీస్ లో ఇప్పటికే భారత్ రెండు టెస్టులు గెలిచింది.. దీంతో ట్రోఫీ చేజారుతోందన్న బెంగ భారత జట్టుకు లేదు.. పైగా నెంబర్ వన్ జట్టుగా భారత్ లోకి అడుగుపెట్టిన ఆస్ట్రేలియాలో ఇండియన్ బౌలర్లు వణికిస్తున్నారు. బ్యాట్స్మెన్ కూడా కీలక సమయాల్లో రాణిస్తున్నారు. దీంతో టీమిండియా ఆత్మవిశ్వాసంతో కనిపిస్తోంది. ఇండోర్ లోనూ జూన్లో జరిగే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో చోటు దక్కించుకోవాలని రోహిత్ సేన లక్ష్యంగా పెట్టుకుంది. విజయం దూరంలోనే ఉంది..అందుకే వరుస విజయాల పరంపరలో ఉన్న టీమిండియా బుధవారం నుంచి ఇండోర్ వేదికగా జరిగే మూడో టెస్టులోనే నెగ్గి ఆ ముచ్చట తీర్చుకోవాలని భావిస్తోంది.
నెంబర్ వన్ జట్టుగా భారత్ లోకి అడుగుపెట్టిన ఆస్ట్రేలియాను భారత్ తన ప్రధాన ఆయుధమైన స్పిన్ తో వణికిస్తోంది. ఇప్పటివరకు రెండు టెస్టుల్లో పడగొట్టిన ఆస్ట్రేలియా 40 32 తీశారు అంటే భారత స్పిన్నర్లు ఏ స్థాయిలో బౌలింగ్ చేశారో అర్థం చేసుకోవచ్చు. ఇక నేటి నుంచి ఇండోర్లో జరిగే మ్యాచ్లో భారత్ డబ్ల్యూటీసి ఫైనల్ బెర్త్ మాత్రమే కాదు.. టెస్టుల్లో నంబర్ వన్ ర్యాంకునూ సొంతం చేసుకుంటుంది. అందుకే మరో టెస్ట్ కోసం చూడకుండా ఇండోర్లోనే గెలిచి ఆ ఘనతలను సొంతం చేసుకోవాలి అనుకుంటున్నది.
ఇక వరుస ఓ డీలా పడిన ఆస్ట్రేలియా ఇండియాలో ఎలా గెలవాలనే సందిగంలో కొట్టుమిట్టాడుతోంది. అయితే ఇండోర్ లో ఎలాగైనా గెలవాలని గత కొద్ది రోజుల నుంచి ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు. ముఖ్యంగా భారత స్పిన్ బౌలింగ్ ను దీటుగా ఎదుర్కొనేందుకు నెట్స్ లో తీవ్రంగా శ్రమించారు. మరోవైపు కీలక ఆటగాళ్ల గాయాలతో ఇబ్బంది పడుతున్న ఆసీస్ టీం కెప్టెన్ కమిన్స్ లేకుండానే మూడో టెస్టులో బరిలోకి దిగబోతోంది.
భారత్ డైలమా
నాగ్ పూర్, ఢిల్లీ టెస్టుల్లో సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించిన భారత జట్టు ఈ మ్యాచ్లో ఎలా బరిలోకి దిగాలనే ఆలోచనలో ఉంది. తుది పదకొండు మంది ఎంపికలో కోచ్ ద్రావిడ్ తో పాటు కెప్టెన్ రోహిత్ శర్మ కూడా డైలమాలో ఉన్నాడు. ఇందుకు కారణం ఓపెనర్ రాహుల్.. ఇప్పటికే అతడి నుంచి వైస్ కెప్టెన్సీ లాగేశారు. ఇక పేలవ ఫామ్ లో ఉన్న అతడిని జట్టు నుంచి తప్పిస్తారా? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.. ఇక రాహుల్ తన చివరి 10 టెస్ట్ ఇన్నింగ్స్ లో కనీసం 25 పరుగుల స్కోర్ కూడా చేయలేకపోవడం అతడి వైఫల్యాన్ని చాటుతోంది. ఒకరకంగా చెప్పాలంటే గత రెండేళ్లుగా టెస్టుల్లో భారత జట్టుకు తొలి వికెట్ కు శతక భాగస్వామ్యం నమోదు కాలేదంటే ఆటతీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. రాహుల్ స్థానంలో బరిలోకి దిగేందుకు గిల్ సిద్ధంగా ఉన్నాడు. ఇక గిల్ గత నెలలోనే సెంచరీ, డబుల్ సెంచరీ బాది సూపర్ ఫామ్ లో ఉన్నాడు. ఒకవేళ మేనేజ్మెంట్ చివరి అవకాశం ఇవ్వదలుచుకుంటే రాహుల్ జట్టులో కొనసాగుతాడు. అప్పుడు గిల్ కు నిరాశ తప్పదు. ఇక పూజార, విరాట్ కోహ్లీ, అయ్యర్ నుంచి జట్టు భారీ ఇన్నింగ్స్ ఆశిస్తోంది. ఇక ఆల్రౌండర్లు అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ దుమ్ము రేపుతున్నారు. టాప్ ఆర్డర్ విఫలమైన చోట ఒంటి చేత్తో జట్టు భారాన్ని మోస్తున్నారు.

ఇక ఆస్ట్రేలియా కెప్టెన్ కమిన్స్ కుటుంబ పరమైన కారణాలవల్ల సదేశానికి వెళ్ళాడు.. అలాగే హజిల్ వుడ్, వార్నర్ గాయాల వల్ల జట్టుకు దూరమయ్యారు. దీంతో ఆస్ట్రేలియా కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు.. ఇక ఆస్ట్రేలియా బౌలింగ్ లో కూడా కొత్తదనం కనిపించే అవకాశం ఉంది. సిరీస్లో ఇప్పటిదాకా ఆడని కామెరున్ గ్రీన్, పేసర్ స్టార్క్ ఈ మ్యాచ్లో ఆడే అవకాశం ఉంది.. అయితే స్టార్క్ 100% ఫిట్ గా లేడని సమాచారం.. మర్ఫీ, లయాన్ స్పిన్నర్ లు కొనసాగే అవకాశం ఉంది. మూడో పేసర్ స్థానం కోసం కునేమాన్, బోలాండ్, మోరిస్ పోటీపడుతున్నారు.
జట్ల అంచనా ఇలా
రోహిత్ ( కెప్టెన్), రాహుల్/ గిల్, కోహ్లీ, అయ్యర్, జడేజా, భరత్, అశ్విన్, షమీ, సిరాజ్.
ఆస్ట్రేలియా
హెడ్, ఖవాజా, లబు షేన్, స్మిత్( కెప్టెన్) హాండ్స్ కోబ్, గ్రీన్, క్యారీ, స్టార్క్, మర్ఫీ, లయాన్, కునేమాన్/ బోలాండ్.
ఇక ఇప్పటిదాకా జరిగిన రెండు టెస్టుల్లో మైదానాలు మొదట పేస్ కు అనుకూలించి, ఆ తర్వాత స్పిన్ కు టర్న్ అయ్యాయి. కానీ ఈ టెస్టింగ్ తొలి రోజు నుంచే బంతి స్పిన్ కానుంది. మైదానం మధ్యలో మాత్రమే పచ్చిగడ్డి కనిపిస్తోంది..