
దేశంలో బంగారం ధరలు పెరిగినా, తగ్గినా పసిడి కొనుగోళ్లు మాత్రం జరుగుతూనే ఉంటాయి. మన దేశంలో చాలామంది పెళ్లిళ్ల సమయంలో, పండుగల సమయంలో, ఇతర శుభకార్యాల సమయంలో బంగారంను ఎక్కువగా కొనుగోలు చేస్తూ ఉంటారు. అయితే గతేడాదితో పోల్చి చూస్తే ఈ ఏడాది బంగారానికి డిమాండ్ మరింత ఎక్కువగా ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గతేడాది కరోనా మహమ్మారి విజృంభణ, లాక్ డౌన్ నిబంధనల వల్ల బంగారం కొనుగోళ్లు తగ్గాయి.
Also Read: ఆర్బీఐ కీలక నిర్ణయం.. డిజిటల్ రుణాలపై లోటుపాట్లకు చెక్..?
దేశంలో ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థల్లో పని చేసే ఉద్యోగుల వేతనాలు భారీగా తగ్గడంతో ఆ ప్రభావం బంగారంపై పడింది. అయితే గతేడాది డిమాండ్ తగ్గడం వల్ల ఈ ఏడాది బంగారానికి భారీగా డిమాండ్ పెరుగుతుందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ సైతం నివేదికలో ఈ సంవత్సరం బంగారం కొనుగోళ్లు గతేడాదితో పోలిస్తే భారీగా పెరుగుతాయని అభిప్రాయపడటం గమనార్హం.
Also Read: భారీగా పెరిగిన బైక్ ధరలు.. ఏ బైక్ ఎంత పెరిగిందంటే..?
బంగారం కొనుగోళ్లు ఈ ఏడాది పెరగడానికి ధరలు తగ్గడం కూడా కారణమని తెలుస్తోంది. గతేడాది ఆగష్టు నెలలో బంగారం ధర రికార్డు స్థాయికి చేరగా ఆ తర్వాత నెమ్మదిగా పతనమవుతోంది. మరోవైపు దేశంలో కరోనా వ్యాక్సిన్లు అందుబాటులోకి రావడంతో వ్యాక్సిన్లు బంగారం ధరపై ప్రభావం చూపుతున్నాయి. రోజురోజుకు పసిడికి డిమాండ్ పెరుగుతోందని నిపుణులు, బంగారం వ్యాపారులు అభిప్రాయంవ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని వార్తల కోసం: వ్యాపారము
ఈ ఏడాది బంగారం ధరలు పెరగవచ్చని అయితే ధరలు పెరిగినా ఆ ప్రభావం కొనుగోళ్లపై పెద్దగా ఉండదని సమాచారం. ధరలు స్వల్పంగానే పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. బంగారంపై పెట్టుబడులు పెడితే మాత్రం నష్టపోయే అవకాశాలు అయితే ఉండవని నిపుణులు అభిపాయపడుతున్నారు.