NVSS Prabhakar: మన వస్తువు ఏదైనా పోతే పోలీసులకు చెబుతాం. దాని విలువను బట్టి దాన్ని వెతికే పనిలో ఉంటారు. బాగా డబ్బుతో కూడుకున్నదైతే కాస్తంత ప్రత్యేక శ్రద్ధ పెడతారు. చిన్నదైతే చూద్దాంలే అని సమాధానం వస్తుంది. కానీ ఇక్కడ ఓ ఉంగరం పోగొట్టుకుంటే ఏకంగా పోలీసులు మెటల్ డిటెక్టర్ డాగ్ స్వ్కాడ్ తో వెతికి మరీ పట్టుకోవడం సంచలనం కలిగించింది. అధికారంలో ఉంటే ఏదైనా సాధ్యమే. ఎన్ని అవరోధాలు వచ్చినా మన దర్పమే వేరు. మన దర్జాయే దానికి మరో కారణం. అందుకే అంటారు రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా.

మనది ఏదైనా వస్తువు పోతే పోలీస్ స్టేసన్ లో కంప్లయింట్ చేసినా సరిగా పట్టించుకోరు. ఒకసారి కాదు ఎన్నిసార్లు మనం ప్రయత్నించినా మనవైపు కన్నెత్తి చూడరు. కానీ అధికారంలో ఉన్న వారైతే ఇట్టే చొరవ చూపుతారు. అది ఎంత చిన్న వస్తువైనా సరే దానికి ఉరుకులు పరుగులు పెడతారు. అదే అధికారంలో ఉన్న మజా. అదే వారి దర్పం, దర్జా. అందుకే అధికారంలో ఉండేందుకు అన్ని పార్టీలు ప్రయత్నాలు చేస్తుంటాయి. అధికారం లేదంటే భర్త లేని ఆడదానితో సమానంగా చూస్తారు.
బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ గురించి అందరికి తెలుసు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆయన గురించి తెలియని వారుండరు. టీవీ కార్యక్రమాల్లో తరచు కనిపిస్తుంటారు. డిబేట్లలో పాల్గొంటారు. దీంతో ఆయన చెప్పిన దాన్ని అందరు సావధానంగా వింటారు. అలాంటి వ్యక్తికి ఓ కష్టమొచ్చింది. తన దగ్గర పనిచేసే వ్యక్తికి ఒంట్లో బాగా లేకపోవడంతో తానే స్వయంగా పని చేసేందకు వెళ్లారు. పొలంలో గడ్డి కోసం ఆవుకు వేసి చూసుకున్నారు. తరువాత తెలిసింది తన ఉంగరం ఎక్కడో పోయిందని. దీంతో ఎంత వెతికినా ఫలితం కనిపించలేదు.

ఇక రాచకొండ పోలీసులను ఆశ్రయించారు. తన ఉంగరం వెతికి పెట్టాలని కోరారు. దీంతో వారు మరుసటి రోజు మెటల్ డిటెక్టర్, డాగ్ స్క్వాడ్ తో పొలం అంతా వెతికారు. చివరకు దొరికించుకున్నారు. పోయిన ఉంగరం దొరకబుచ్చుకునేందుకు ఏకంగా పోలీసులు చొరవ తీసుకుని వెతకడం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. దుడ్డు ఉన్న వాడితే బర్రె అన్నట్లు అధికారంలో ఉంటే దాని పరిణామం ఇలా ఉంటుంది. మొత్తానికి ప్రభాకర్ ఉంగరం వెతికేందుకు పోలీసులు రావడం సంచలనంగా మారింది.