Mahesh Babu Restaurant: సూపర్ స్టార్ మహేష్ బాబు ఒక పక్క సినిమాలు చేస్తూనే మరోపక్క వ్యాపారాలను చాలా సక్సెసఫుల్ గా బ్యాలన్స్ చేస్తూ ముందుకు దూసుకెళ్తున్నారు..కొన్నేళ్ల క్రితమే హైదరాబాద్ లో ఆసియన్ గ్రూప్స్ తో కలిసి ఆయన గచ్చిబౌలి లో ‘AMB సినిమాస్’ నిర్మించాడు..అత్యాధునిక టెక్నాలజీ తో ఎంతో లావిష్ గా నిర్మించిన ఈ మల్టీప్లెక్స్ కి హైదరాబాద్ లో ఒక బ్రాండ్ ఇమేజి ఉంది..ఎంత చెత్త సినిమా విడుదలైన కూడా ఈ థియేటర్ లో హౌస్ ఫుల్ అవ్వాల్సిందే.

ఇప్పుడు మహేష్ బాబు అదే ఆసియన్ గ్రూప్ తో కలిసి ‘ఆసియన్ నమ్రత రెస్టారెంట్స్’ హైదరాబాద్ లో ప్రారంభించాడు..లోకల్ నుండి నాన్ లోకల్ వంటకాలు వరుకు..ఇండియన్ ఫుడ్స్ నుండి కాంటినెంటల్ ఫుడ్ వరుకు అన్ని రకాల ఫుడ్ ఈ రెస్టారంట్ లో ఉంటాయి..కానీ ఈ రెస్టారంట్ లో ఉన్న ఐటమ్స్ రేట్స్ చూస్తుంటే సామాన్యలు ఈ రెస్టారంట్ లోకి అడుగు కూడా పెట్టె అవకాశం కనిపించడం లేదు.
ప్లేట్ పునుగులు మాములుగా మనం బయట తింటే కేవలం పది నుండి ఇరవై రూపాయిలు అవుతుంది..కానీ మన మహేష్ రెస్టారంట్ లో ప్లేట్ పునుగులు తినాలంటే 125 రూపాయిలు చెల్లించాల్సిందే..మసాలా దోస 190 ,రవ దోస 190 ,పూరి 170..ఇవన్నీ ఒక్క ఎత్తు అయితే ప్లేట్ ఇడ్లీ ధర అక్షరాలా 90 రూపాయిలు..హార్ట్ పేషెంట్ మెన్యు కార్డు చూడకుండా ఒక నాలుగు ప్లేట్లు ఇడ్లీ తీసుకొని రమ్మని చెప్పి, తినేటప్పుడు ఆ బిల్లుని చూస్తే హార్ట్ ఎటాక్ రాక తప్పదు..ఇంత రేట్స్ పెట్టి ప్రజల సొమ్ముని ఇలా దోచుకుంటున్నారు అంటూ నెటిజెన్లు మహేష్ బాబు పై తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు.

ఏదైనా ఇప్పటి వరుకు తినని ఐటమ్స్ కి ఆ స్థాయి రేట్స్ పెట్టినా ఒక అర్థం ఉంది..కానీ బయట 10 రూపాయలకు దొరికే ఐటమ్స్ ని కూడా ఈ రేంజ్ రేట్స్ కి అమ్మడం ఏమిటి అని పెదవి విరుస్తున్నారు..మరి ప్రారంభంలోనే ప్రజల చీత్కారాలని ఎదురుకుంటున్న ఈ రెస్టారంట్ భవిష్యత్తులో అయినా రేట్లు తగ్గిస్తుందో లేదో చూడాలి.