https://oktelugu.com/

Bird Flu: బర్డ్ ఫ్లూ విజృంభణ.. చికెన్ కోడిగుడ్లు తినవచ్చా లేదా?

బర్డ్ ఫ్లూ అంటే ఏవియన్ ఇన్ ఫ్లూయెంజా వైరస్. ఇది పక్షుల నుంచి మానవులకు వ్యాపించే అవకాశం ఉందట. ఒక వ్యక్తికి వైరస్ సోకినట్లైతే వారి నుంచి ఇతరులకు వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదముంది.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : February 17, 2024 6:50 pm
    Bird Flu

    Bird Flu

    Follow us on

    Bird Flu: ఏపీలో బర్డ్ ఫ్లూ కలకలం రేపుతోంది. ఇప్పటికే నెల్లూరులోని కొన్ని పౌల్ట్రీ ఫారాల్లో పెద్ద సంఖ్యలో కోళ్లు చనిపోతున్నాయి. వాటి శాంపిళ్లను ల్యాబ్ కు పంపించి పరీక్షించగా బర్డ్ ఫ్లూతో చనిపోయానని తేలింది. ఈ క్రమంలో అధికారులు అప్రమత్తమైన పొదలకూరు, కోవూరు, సైదాపురం ప్రాంతాల్లో చికెన్ షాపులను మూసివేశారు. బర్డ్ ఫ్లూ రావడంతో జనాల్లో టెన్షన్ మొదలైంది. చికెన్, గుడ్లు తినాలా? వద్దా? అనే కన్ ఫ్యూజన్ నెలకొంది. వీటిని తింటే బర్డ్ ఫ్లూ వ్యాధి వస్తుందని ఆందోళన చెందుతున్నారు.

    బర్డ్ ఫ్లూ అంటే ఏవియన్ ఇన్ ఫ్లూయెంజా వైరస్. ఇది పక్షుల నుంచి మానవులకు వ్యాపించే అవకాశం ఉందట. ఒక వ్యక్తికి వైరస్ సోకినట్లైతే వారి నుంచి ఇతరులకు వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదముంది. ఎవరికైన ఈ వైరస్ ఉంటే వారికి దూరంగా ఉండాలి. ఈ వ్యాధి సోకితే..దగ్గు, ఊపిరి తీసుకోవడానికి సమస్యలు, జ్వరం, తలనొప్పి, కీళ్ల నొప్పులు, జలుబు, గొంతు నొప్పి, ముక్కు నుంచి రక్తస్రావం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొందరిలో వాంతులు, విరోచనాలు, కళ్లకు ఇన్ ఫెక్షన్ కూడా వచ్చే అవకాశం ఉంది.

    వైరస్ మనిషి శరీరంలో 7 నుంచి 8 రోజుల వరకు ఉంటుంది. కోళ్ల ఫారాలు, ఇతర పక్షులను పెంచే స్థలంలో పనిచేసే వైరస్ బారిన పడే ప్రమాదం ఉంది. అడవుల్లో పనిచేసేవారు, పక్షులపై పరిశోధనలు చేసే వారు కూడా వైరస్ బారిన పడే అవకాశం ఉంది. అందువల్ల ఇలాంటి పనులు చేసేవారు ఎఫ్పటికప్పుడు జాగ్రత్తగా ఉండడం మంచిది. పక్షకులకు దగ్గర ఉన్నా, కోళ్ల ఫారాల్లో పని చేసిన ఈ సమస్య తొందరగా సోకుతుంది. పావురాలకు ఆహారం ఇచ్చే వారు కూడా జాగ్రత్తగా ఉండాలి.

    గుడ్లు , చికెన్ కనీసం 70 డిగ్రీల ఉష్ణోగ్రతలో ఉడికించిన తర్వాత తింటే ఎలాంటి బర్డ్ ఫ్లూ వ్యాపించదు. బర్డ్ ఫ్లూ రాకుండా ఉండాలంటే ముఖ్యంగా పరిశుభ్రత పాటించాలి. కోళ్ల ఫారాలకు, ఓపెన్ మార్కెట్లకు దూరంగా ఉండాలి. పౌల్ట్రీ నుంచి తెచ్చుకున్న ఆహారాన్ని వండకుండా తినొద్దు. పచ్చి గుడ్తు తినడం మానుకోవాలి. బర్డ్ ఫ్లూ భయంతో చాలా మంది చికెన్, గుడ్లు తినడం లేదు. కానీ బాగా ఉడికించిన తర్వాత తింటే ఏమి కాదంటున్నారు నిపుణులు.