Dolly Chaiwala Bill Gates: భారత్ లో బిల్ గేట్స్ చాయ్ పే చర్చ.. వీడియో వైరల్

బిల్ గేట్స్ పోస్ట్ చేసిన చాయ్ పే చర్చ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ చాయ్ పే చర్చాను బిల్ గేట్స్ ఇండియాలో ప్రసిద్ద టీ తయారీదారుడు డాలితో నిర్వహించడం విశేషం.

Written By: Suresh, Updated On : February 29, 2024 6:35 pm
Follow us on

Dolly Chaiwala Bill Gates: చాయ్.. ఈ రెండు అక్షరాల వేడి పానీయాన్ని ఇష్టపడని వారు ఉండరు.. ఇది మన దేశంలో ఎంత ఫేమసో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందుకే అప్పట్లో నరేంద్ర మోడీ చాయ్ పే చర్చ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆ కార్యక్రమం ద్వారా రెండవసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు కూడా వీలు చిక్కినప్పుడల్లా ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇప్పుడు చాయ్ పే చర్చాలో ప్రపంచ కుబేరుడు బిల్ గేట్స్ కూడా చేరారు. అది కూడా భారత్ దేశంలో చాయ్ పే చర్చ నిర్వహించి ఆకట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను బిల్ గేట్స్ తన ఇన్ స్టా గ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు.

బిల్ గేట్స్ పోస్ట్ చేసిన చాయ్ పే చర్చ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ చాయ్ పే చర్చాను బిల్ గేట్స్ ఇండియాలో ప్రసిద్ద టీ తయారీదారుడు డాలితో నిర్వహించడం విశేషం. డాలి తాను తయారు చేసే చాయ్ ద్వారానే ఫేమస్ అయ్యాడు. చాయ్ తయారు చేసే వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ద్వారా ఒక్కసారిగా సెలబ్రిటీగా మారిపోయాడు. అతని వద్ద టీ తాగడానికి చాలామంది సెలబ్రిటీలు ఎదురుచూస్తూ ఉంటారు. డాలీ తో నిర్వహించిన చాయ్ పే చర్చలో బిల్ గేట్స్ పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు. ” నేను పోస్ట్ చేసిన ఈ వీడియో క్లిప్ వన్ చాయ్ ప్లీజ్ అని అడగడంతో మొదలవుతుంది. చాయ్ అమ్మే వ్యక్తి చిన్న బండిలో దానిని తయారు చేసే విధానం ఆకట్టుకుంది. భారతదేశానికి రావడం పట్ల ఉద్వేగంగా ఉంది. తమ జీవితాలను మెరుగుపరుచుకునేందుకు భారతదేశంలో ఎంతోమంది ఔత్సాహికులు ఉన్నారు. చాయ్ తయారు చేసే విధానాన్ని అత్యంత కళాత్మకంగా చేయడం భారతీయుల గొప్పదనం.. డాలి పక్కన నిల్చుని మరిన్ని చాయ్ పే చర్చల కోసం ఎదురు చూస్తూ ఉంటానని” గేట్స్ రాస్కొచ్చారు.

వివిధ పనుల నిమిత్తం బిల్ గేట్స్ ఇండియా వచ్చారు. గురువారం ఆయన తెలంగాణ ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో భేటీ అయ్యారు. హైదరాబాదులో ఏర్పాటు చేసే మైక్రోసాఫ్ట్ కార్యకలాపాలపై సుదీర్ఘంగా చర్చించారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని ఈ సందర్భంగా శ్రీధర్ బాబు బిల్ గేట్స్ ను కోరారు. అనంతరం బిల్ గేట్స్ న్యూఢిల్లీ, ముంబై ప్రాంతాలలో పర్యటించారు. ఇక్కడ తమ సంస్థలు నిర్వహిస్తున్న కార్యకలాపాలను పర్యవేక్షించారు. అనంతరం ఆయన గుజరాత్ లోని జామ్ నగర్ బయలుదేరి వెళ్లిపోయారు. శుక్రవారం ముఖేష్ అంబానీ రెండవ కుమారుడు అనంత్ అంబానీ ముందస్తు పెళ్లి వేడుకల్లో గేట్స్ పాల్గొంటారు. వేడుకలు ముగిసిన తర్వాత ఆయన అమెరికా తిరుగు ప్రయాణమవుతారు. గేట్స్ రాక నేపథ్యంలో రిలయన్స్ ప్రత్యేక విమానం సమకూర్చింది.