https://oktelugu.com/

BiggBoss Sunny: బిగ్ బాస్ విన్నర్ సన్నీ ఎందుకు గెలిచారు? ఎలా గెలిచారు.? అసలు కారణాలేంటి?

Bigg Boss Sunny: సన్నీ.. అతడిలో కావాల్సినంత ఫైర్ ఉంది.. కోపం వస్తే తట్టుకోలేక అరిచి గొడవచేసే మొండి ధైర్యం ఉంది. స్నేహం కోసం ప్రాణమిచ్చే గుణం ఉంది. లొల్లికొస్తే ఎంతదాకా అయినా తెగించి కొట్లాడే దమ్ము ఉంది. బిగ్ బాస్ హౌస్ లోని అందరూ వరస్ట్ క్యాండిడేట్ అని జైల్లో పెట్టినా తట్టుకునే మానసికస్థైర్యం ఉంది. ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేసే బోలెడంత కామెడీ సెన్స్ ఉంది. ఇన్ని ఉన్నాయి కాబట్టే బిగ్ బాస్ సీజన్ […]

Written By:
  • NARESH
  • , Updated On : December 20, 2021 / 11:12 AM IST
    Follow us on

    Bigg Boss Sunny: సన్నీ.. అతడిలో కావాల్సినంత ఫైర్ ఉంది.. కోపం వస్తే తట్టుకోలేక అరిచి గొడవచేసే మొండి ధైర్యం ఉంది. స్నేహం కోసం ప్రాణమిచ్చే గుణం ఉంది. లొల్లికొస్తే ఎంతదాకా అయినా తెగించి కొట్లాడే దమ్ము ఉంది. బిగ్ బాస్ హౌస్ లోని అందరూ వరస్ట్ క్యాండిడేట్ అని జైల్లో పెట్టినా తట్టుకునే మానసికస్థైర్యం ఉంది. ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేసే బోలెడంత కామెడీ సెన్స్ ఉంది. ఇన్ని ఉన్నాయి కాబట్టే బిగ్ బాస్ సీజన్ 5 విజేతగా సన్నీ అవతరించాడు. చివర వారం వరకూ విజేతగా నిలుస్తాడనుకున్న యూట్యూబర్ షణ్ముఖ్ తోటి లేడి కంటెస్టెంట్ ‘సిరి’తో చేసిన వెగటు చేష్టలకు చివరకు ప్రేక్షకాదరణ కోల్పోయి రెండో స్థానంతో సరిపెట్టుకున్నాడు.

    Bigg Boss Winner Sunny

    బిగ్ బాస్ విజేతగా సన్నీ గెలుస్తాడని అందరూ ఊహించారు. చివరకు అదే జరిగింది.. షణ్ముక్ లాస్ట్ వారల వరకూ విజేతఅవుతాడని అనుకున్నారు. సోషల్ మీడియాలో అతడికి ఉన్న విపరీతమైన ఫాలోయింగ్ తో విజేత అని అనుకున్నారు. కానీ అతడితో హగ్గులు, ముద్దులు.. ఫ్రెండ్ షిప్ మాటున సిరి చేసిన చేష్టలకు పాపం షణ్ముఖ్ బలి అయిపోయి సన్నీ విజేతగా నిలవడానికి ప్రధాన కారణమైంది.

    సన్నీ బిగ్ బాస్ హౌస్ లోనే బెస్ట్ ఎంటర్ టైనర్ గా నిలబడ్డాడు. తన బలమైన ఆటతీరుతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకొని తల్లికి మాట ఇచ్చినట్టే కప్పుతోపాటు ప్రైజ్ మనీని సొంతం చేసుకున్నాడు.

    ఒక వీడియో జాకీగా.. యాంకర్ గా కెరీర్ ను ప్రారంభించిన సన్నీ అసలు పేరు ‘అరుణ్ రెడ్డి’. పలు టెలివిజన్ చానళ్లలో వివిధ కార్యక్రమాలకు యాంకర్ గా చేశాడు. ‘కల్యాణ వైభోగం’ సీరియల్ తో నటుడిగా కెరీర్ ప్రారంభించాడు. అందులో లీడ్ రోల్ పోషించాడు. ఇక ‘సకల గుణాభిరామ’ చిత్రంతో కథానాయకుడిగా వెండితెరకు పరిచయం కాబోతున్నాడు. ఈ క్రమంలో వచ్చిన ‘బిగ్ బాస్ సీజన్5’ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని షోలో ఒక్కో ఎలిమినేషన్ దాటుతూ చివరకు విజేతగా నిలిచాడు.

    టాస్క్ ల విషయంలో ఆగ్రహంతో ఎంతదాకైనా కొట్లాడే సన్నీ ఆటతీరు ప్రేక్షకుల మనసు దోచుకుంది.టాస్క్ ల విషయంలో ఎవరితోనైనా గొడవ పడితే అది అయిపోగానే వచ్చి మాట్లాడి వాళ్ల మధ్య ఏర్పడిన దూరాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేసేవాడు. ఇక టాస్క్ లు లేని సమయంలో జోకులు చెబుతూ, ఇతరులను అనుకరిస్తూ నవ్వులు పంచేవాడు. వీకెండ్ లోనూ నాగార్జున వేసే పంచ్ లను సరదాగా తీసుకొని దానికి రెండింతలు వినోదాన్ని పంచేవాడు. చివరకు అమ్మాయిలాగా గెటప్ లు వేసుకొని మరీ వినోదాన్ని పంచాడు. బాలయ్య గెటప్ లోనూ నవ్వులు పూయించి ప్రేక్షకుల మనసు దోచేశాడు.

    Also Read: Bigg Boss 5: సన్నీ బిగ్ బాస్ టైటిల్ విన్నర్ అవుతాడని ముందే అనుకున్న… తల్లి కళావతి

    హౌస్ లోనే చాలా నిందలు పడి.. అవమానాలు ఎదుర్కొని అయినా మొండిగా నిలబడి ప్రేక్షకుల సానుభూతి పొందిన సన్నీ చివరకు విజేతగా నిలిచాడు. మానస్, ఆనీ మాస్టర్, కాజల్ తో సన్నీ స్నేహం ఎవర్ గ్రీన్ గా నిలిచింది. తన బెస్ట్ ఫ్రెండ్ గా మానస్ ను మార్చుకున్నాడు. అతడి కోసం ఎక్కడిదాకా అయినా కొట్లాడాడు.

    లక్షల్లో అభిమానులున్న యాంకర్ రవి, షణ్ముఖ్, శ్రీరామచంద్ర వంటి దిగ్గజాలను ఓడించి గెలిచాడంటే సన్నీ ఎంతగా ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేసి ఒక్కో మెట్టు ఎక్కి కప్ కొట్టాడో అర్థం చేసుకోవచ్చు. కష్టాల్లో ఉన్నప్పుడు ఏడవకుండా? నిరాశపడకుండా.. మూడ్ ను కంట్రోల్ చేసుకుంటూ ఎంటర్ టైన్ మెంట్ నే నమ్ముకొని ప్రేక్షకుల మనసు గెలిచి విజేతగా నిలిచాడు.

    Also Read: Bigg Boss 5: షణ్ముఖ్ కి టైటిల్ దూరం అవ్వడానికి కారణం అదేనా…