Bigg Boss 6 Telugu Second Captain: బిగ్ బాస్ లోకి హీరో హీరోయిన్లు సుధీర్ బాబు-కృతి శెట్టి.. కెప్టెన్ గా రాజ్.. ఇనాయా ఏడుపు..

Bigg Boss 6 Telugu Second Captain: బిగ్ బాస్ శుక్రవారం ఎపిసోడ్ జోష్ ఫుల్ గా సాగింది. కెప్టెన్సీ టాస్క్ కోసం నిర్వహించిన పోటీ అందరినీ ఉర్రూతలూగించింది. ఒక పాట ఇస్తూ ఇంటి సభ్యులందరితో డ్యాన్సులు చేయించారు. ఆ తర్వాత ఇద్దరినీ జోడీలుగా ఎంపిక చేసి ఉన్న నలుగురు కెప్టెన్సీ పోటీదారుల్లో ఒకరిని ఎన్నుకోవాలని సూచించాడు. కెప్టెన్సీ రేసులో చలాకీ చంటి, సూర్య, రాజ్, ఇనాయాలు పోటీపడ్డారు. ఇంటి సభ్యులంతా కూడా మెజార్టీ రాజ్ కు ఓటేశారు. […]

Written By: NARESH, Updated On : September 17, 2022 4:39 pm
Follow us on

Bigg Boss 6 Telugu Second Captain: బిగ్ బాస్ శుక్రవారం ఎపిసోడ్ జోష్ ఫుల్ గా సాగింది. కెప్టెన్సీ టాస్క్ కోసం నిర్వహించిన పోటీ అందరినీ ఉర్రూతలూగించింది. ఒక పాట ఇస్తూ ఇంటి సభ్యులందరితో డ్యాన్సులు చేయించారు. ఆ తర్వాత ఇద్దరినీ జోడీలుగా ఎంపిక చేసి ఉన్న నలుగురు కెప్టెన్సీ పోటీదారుల్లో ఒకరిని ఎన్నుకోవాలని సూచించాడు. కెప్టెన్సీ రేసులో చలాకీ చంటి, సూర్య, రాజ్, ఇనాయాలు పోటీపడ్డారు. ఇంటి సభ్యులంతా కూడా మెజార్టీ రాజ్ కు ఓటేశారు.

ఇక కొందరు సూర్యకు, మరికొందరు చలాకీ చంటికి ఓటేశారు. ఇక తనకు ఎవరూ ఓటేయకపోవడంతో ఇనాయా బోరున ఏడ్చేసింది. దీంతో ఆమె ఏడుపు చూసిన ఆరోహీ-నేహాలు తమ ఓటును ఇనాయకు వేసి ఊరట కల్పించారు. ఈ కెప్టెన్సీ టాస్క్ అందరికంటే ఎక్కువ ఓట్లు వచ్చిన రాజ్ విజేతగా నిలిచాడు. తాను ఈవారం నామినేషన్ లో ఉన్నానని.. కనీసం కెప్టెన్ గానైనా గెలిపించాలని రాజ్ కోరిన కోరికకు ఇంటి సభ్యులంతా కరిగి అతడిని గెలిపించారు. బిగ్ బాస్ రెండో కెప్టెన్ గా రాజ్ అవతరించాడు..

lso Read: Anchor Suma Remuneration: క్యాష్: ఒక్క ఎపిసోడ్ కి సుమ తీసుకునే పారితోషికం ఎంతో తెలుసా..?
అనంతరం తమ కొత్త సినిమా ప్రమోషన్ కోసం హీరో సుధీర్ బాబు, హీరోయిన్ కృతిశెట్టి బిగ్ బాస్ హౌస్ లోకి ప్రవేశించారు. అక్కడ కంటెస్టెంట్లతో పలు స్కిట్ లు చేయించి నవ్వులు పూయించారు. ‘పండుగాడు’ డైలాగ్ చెప్పి రేవంత్ అలరించాడు. ఇక విజయ్ దేవరకొండ డైలాగులతో సూర్య ఇరగదీశాడు. అల్లాడించాడనే చెప్పాలి. గీతూ అయితే బుజ్జిగాడు డైలాగులు, రజినీకాంత్, చిన్న పిల్లల వాయిస్ తో చిత్తూరు యాసలో దంచికొట్టింది. ఫైమా నవ్వులు పూయించింది. ఇక యాక్టింగ్ రోల్ లో శ్రీహాన్, శ్రీసత్య అద్భుతంగా నటించారు. దీంతో వారిద్దరే బెస్ట్ యాక్టర్లుగా నిర్ణయించిన సుధీర్ బాబు-కృతి శెట్టిలు వారిద్దరికీ అవార్డులు ఇచ్చి ఇంటి నుంచి వెళ్లిపోయారు. సుధీర్-కృతిశెట్టిలు ఉన్నంత సేపు హౌస్ కామెడీతో అలరించింది.

చలాకీ చంటి తీరు అవమానించేలా ఉందని రేవంత్ సీరియస్ అయ్యాడు. తనతో ఎందుకు గొడవ పెట్టుకున్నారని బాధపడేలా చేస్తానంటూ రేవంత్ ఇతర కంటెస్టెంట్ల ముందు రెచ్చిపోయాడు.

Also Read: Komatireddy Rajgopal Reddy: రాజగోపాల్‌కు ఎదురుగాలి.. నియోజకవర్గంలో పడిపోయిన గ్రాఫ్‌

ఇలా శుక్రవారం ఎపిసోడ్ మొత్తం చాలా సందడిగా సాగింది. కంటెస్టెంట్ల డ్యాన్సులు, కెప్టెన్ గా రాజ్, హీరో హీరోయిన్లు సుధీర్-కృతి చేసిన సందడితో ఎంటర్ టైన్ మెంట్ పంచింది.