Bigg Boss Telugu 7: బిగ్ బాస్ సీజన్ 6 ఊహించని రీతిలో పరాజయం పాలైంది. ఎపిసోడ్స్ మొత్తం దారుణమైన టీఆర్పీ అందుకున్నాయి. కంటెస్టెంట్స్ ఎలిమినేషన్స్ విమర్శల పాలయ్యాయి. బాగా ఆడుతున్న కంటెస్టెంట్స్ ని ఎలిమినేట్ చేశారని, ప్రలోభాలకు లోబడి షో నడిపారనే వాదనలు ఉన్నాయి. హోస్ట్ నాగార్జున సైతం కొందరు కంటెస్టెంట్స్ పట్ల పక్షపాతం చూపించారనే అపవాదు ఉంది. ఇక ఫైనల్ మరింత వరస్ట్ గా ప్లాన్ చేశారు. విన్నర్ ఎవరనే ఉత్కంఠ, ఆ ఫైనల్ మూమెంట్స్ ఎంజాయ్ చేసే ఛాన్స్ లేకుండా చేశారు. అసలు ప్రైజ్ మనీలో 80% అమౌంట్ తీసుకొని ఒకరు వెళ్లిపోవచ్చని టాప్ టు కంటెస్టెంట్స్ ని ప్రలోభ పెట్టడం దారుణం.

రేవంత్ కంటే ఓట్లు అధికంగా వచ్చిన శ్రీహాన్ విన్నర్ కాకూడదని ఇలా చేశారనే వాదన ఉంది. ఇందులో కుట్ర కోణం ఉన్నా లేకున్నా… దాదాపు విన్నర్ ప్రైజ్ మనీ మొత్తం ఆఫర్ చేయడం దారుణం. రూ. 40 లక్షలు అంటే ఎవరో ఒకరు టెంప్ట్ అవుతారని తెలుసు. తెలిసి తెలిసి ప్రేక్షకులకు క్లైమాక్స్ కిక్ లేకుండా చేశారు. అంతకు మించిన దురదృష్టకర విషయం ఏమిటంటే… నిజంగా ఓట్లతో గెలిచింది శ్రీహాన్ అని రివీల్ చేయడం. ఈ సీజన్ డైరెక్టర్స్ ఎవరో కానీ మొత్తంగా ముంచేశారు.
ఫైనల్ ఎపిసోడ్ కి కూడా చెప్పుకోదగ్గ రీతిలో టీఆర్పీ రాలేదని సమాచారం. ఊహించని ఈ డిజాస్టర్ నుండి పాఠాలు నేర్చుకున్న బిగ్ బాస్ మేకర్స్ ఈసారి గట్టిగా ప్లాన్ చేస్తున్నారట. సీజన్ 7 ఎలాగైనా సక్సెస్ చేయాలని కంకణం కట్టుకున్నారట. నెక్స్ట్ సీజన్ కూడా ఫెయిల్ అయితే మొత్తంగా ఆ ఫ్రాంచైజీ ఆపేయాల్సి వస్తుంది. షోపై నమ్మకం పోతే ఆడియన్స్ కనెక్ట్ కారు. కాసులు కురిపించే బిగ్ బాస్ లాంటి షో కోల్పోతే స్టార్ మా పెద్ద మొత్తంలో నష్టపోవాల్సి ఉంటుంది.

ఈ క్రమంలో నెక్స్ట్ సీజన్ కి గత సీజన్స్ లో మంచిగా పెర్ఫార్మన్స్ చేసిన, ఫైనల్ కి చేరిన కంటెస్టెంట్స్ ని సంప్రదిస్తున్నారట. రెమ్యునరేషన్ కూడా భారీగా ఆశజూపుతున్నారట. దీనిలో భాగంగా స్టార్ యాంకర్ శ్రీముఖిని కలిశారట, అలాగే సీజన్ 5 టాప్ 3 కంటెస్టెంట్ సింగర్ శ్రీరామచంద్రని సంప్రదించారట. శ్రీముఖి సీజన్ 3 రన్నర్ కాగా స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా పేరు తెచ్చుకున్నారు. ఇలా బెస్ట్ కంటెస్టెంట్స్ ని ఇంటిలోకి పంపాలి అనుకుంటున్నారట. ఇక షో సైతం జులై నెలలో స్టార్ట్ చేస్తారట. అందుకే కంటెస్టెంట్స్ ఎంపిక షురూ చేశారట.