Vijay Devarakonda: అర్జున్ రెడ్డి తో రౌడీ స్టార్ గా ప్రేక్షకుల అభిమానాన్ని పొందిన హీరో విజయ్ దేవరకొండ . టాక్సీ వాలా, గోవిందం గీత గోవిందం, డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్ వంటి చిత్రాలతో హీరోగా మంచి విజయాలు అందుకున్నారు. ప్రస్తుతం ప్రొడ్యూసర్ గా రౌడీ స్టార్ .
దామోదర దర్శకత్వంలో ఆనంద్ దేవరకొండ హీరోగా ” పుష్పక విమానం” మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆనంద్ కి జోడిగా సాన్వి మేఘన నటించారు. ఈ చిత్రానికి విజయ్ దేవరకొండ నిర్మాతగా వ్యవహించారు. కామెడీ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన సినిమాలో ఆనంద్ అమాయకుడైన పాత్రలో నటించారు. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఈ రౌడీ బ్రదర్స్ ఓ స్పెషల్ చిట్‌చాట్‌లో పాల్గొన్నారు. తమ జీవితాల్లో జరిగిన ఆసక్తికర విషయాలు ఈ అన్నదమ్ములిద్దరూ సరదాగా చెప్పారు. దీనికి సంబంధించి తాజాగా విజయ్ ఓ స్పెషల్ ప్రోమో షేర్ చేశారు.
స్కూల్‌లో చదువుకునే రోజుల్లో వేసవి కాలం సెలవులకు ఇంటికి వచ్చేవాళ్లం. ఇంట్లోనే సరదాగా ఉండేవాళ్లం అని ఆనంద్ మాత్రం నాకు చుక్కలు చూపించేవాడు నన్ను బాగా విసిగించేవాడు అని విజయ్ చెప్పగానే… ఆనంద్ నవ్వులు పూయించారు. విజయ్ నాకంటే ముందు ఆనంద్‌కే పెళ్లి అవుతుంది అని అనగానే నో అన్నయ్యకే ముందు అని ఆనంద్ నవ్వుతూ అన్నారు. ‘‘అమ్మ ఫెవరెట్ ఎవరు’’ అనేదానికి సమాధానం చెబుతూ… అన్నదమ్ములు సమాధానం ఇచ్చుకున్నారు. సరదాగా సాగిన ఈ ఫన్నీ ఇంటర్వ్యూ పూర్తిగా చూడాలంటే రేపటి వరకూ వేచి ఉండాలి. రేపు ఈ వీడియో విడుదల చేయనున్నారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ” లైగర్ ” చిత్రం షూటింగ్ లో బిజీగా ఉన్నారు.