https://oktelugu.com/

Bigg Boss Revanth : తండ్రి గురించి భయంకర నిజం దాచిన రేవంత్ తల్లి… సినిమాలో కూడా ఇంత పెద్ద ట్విస్ట్ ఉండదు!

Bigg Boss Revanth : ఫ్యామిలీ వీక్ లో రేవంత్ ని కలిసేందుకు తల్లి సీతా సుబ్బలక్ష్మి వచ్చిన విషయం తెలిసిందే.ఆమె చాలా సింపుల్ గా ఉన్నారు. కంటెస్టెంట్స్ అందరినీ బాగా పలకరించారు. ఆమె తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ క్రమంలో ఫ్యామిలీకి సంబంధించిన ఒక ఎమోషనల్ సంఘటన తెలియజేశారు. సీతా సుబ్బలక్ష్మికి మొదటి సంతానంగా అబ్బాయి పుట్టాడట. రెండో కొడుకు రేవంత్ కడుపులో ఉండగా భర్త కన్నుమూశాడట. రేవంత్ కి సీతా సుబ్బలక్ష్మి తండ్రి […]

Written By:
  • NARESH
  • , Updated On : December 16, 2022 / 09:02 PM IST
    Follow us on

    Bigg Boss Revanth : ఫ్యామిలీ వీక్ లో రేవంత్ ని కలిసేందుకు తల్లి సీతా సుబ్బలక్ష్మి వచ్చిన విషయం తెలిసిందే.ఆమె చాలా సింపుల్ గా ఉన్నారు. కంటెస్టెంట్స్ అందరినీ బాగా పలకరించారు. ఆమె తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ క్రమంలో ఫ్యామిలీకి సంబంధించిన ఒక ఎమోషనల్ సంఘటన తెలియజేశారు. సీతా సుబ్బలక్ష్మికి మొదటి సంతానంగా అబ్బాయి పుట్టాడట. రెండో కొడుకు రేవంత్ కడుపులో ఉండగా భర్త కన్నుమూశాడట. రేవంత్ కి సీతా సుబ్బలక్ష్మి తండ్రి చనిపోయాడన్న నిజం చెప్పలేదట. మీ నాన్న దుబాయిలో ఉన్నాడని అబద్ధం చెప్పారట. పసి వయసులో తండ్రి లేడన్న వేదన కలగకూడదని ఆమె అలా చెప్పారట. తన పుట్టింటి వారి సహకారంతో రోడ్డునపడకుండా పిల్లల్ని పెద్ద చేశానని ఆమె వెల్లడించారు.

    ఇక టాప్ సెలబ్రిటీ హోదాలో రేవంత్ బిగ్ బాస్ హౌస్లో అడుగుపెట్టాడు. ప్రొఫెషనల్ సింగర్ అయిన రేవంత్ ఇండియన్ ఐడల్ విజేత. ఆ విధంగా ఆయనకు కొంత ఫ్యాన్ బేస్ ఉంది. అయితే హౌస్లో రేవంత్ బిహేవియర్ కి జనాలు పూర్తిగా నెగిటివ్ మార్క్స్ వేశారు. గెలుపుకు మించి మానవత్వం ముఖ్యం. విజయాన్ని చేరుకునే దారి సక్రమంగా ఉండాలి. కానీ రేవంత్ అవేమీ చూడడు. అగ్రెషన్ పేరుతో టాస్క్స్ దారుణంగా ఆడతాడు. కేకలతో, చర్యలతో తోటి కంటెస్టెంట్స్ ని భయపెట్టే ప్రయత్నం చేస్తాడు. కోపంలో బూతులు తిడతాడు. లేడీ కంటెస్టెంట్స్ పై సైతం చేయి చేసుకున్న సందర్భాలు ఉన్నాయి.

    రేవంత్ బిహేవియర్ పరిధులు దాటేస్తున్నా హోస్ట్ నాగార్జున అతన్ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేయలేదు. తీవ్ర విమర్శల నేపథ్యంలో ఒకసారి ఎల్లో కార్డు ఇచ్చాడు. అది నామమాత్రమే. కార్డు ఇచ్చిన రోజు కూడా ఆటలో నీ అగ్రెషన్ తగ్గించుకోకు అని మళ్ళీ రెచ్చగొట్టిపోయాడు. ఎల్లో కార్డు ఇచ్చినా రేవంత్ అసలు తగ్గలేదు. టాస్క్లో అతని పోరాట పటిమ గొప్పదే అయినా… ఆడే విధానం సరిగా ఉండేది కాదు.

    అయినప్పటికీ రేవంత్ విన్నర్ అనే ప్రచారం జరుగుతుంది. అతన్ని విన్నర్ చేసేందుకు ఎప్పటి నుండో ప్రణాళిక వేసిన బిగ్ బాస్ టీం రేవంత్ మిస్టేక్స్ బయటకు చూపించలేదు. అలాగే రేవంత్ తప్పులను ప్రశ్నించే వాళ్ళను బ్యాడ్ గా ప్రొజెక్ట్ చేస్తారని ఇనయా బయటకు వచ్చాక, ఎపిసోడ్స్ చూసి చెప్పింది. ఏది ఏమైనా బిగ్ బాస్ విన్నర్ ని నిర్ణయించే క్రమంలో అనేక అవకతవకలు జరుగుతున్నాయని ఆడియన్స్ నమ్ముతున్నారు. ప్రస్తుతం హౌస్లో ఆరుగురు కంటెస్టెంట్స్ ఉన్నారు. మిడ్ వీక్ ఎలిమినేషన్ ద్వారా శ్రీసత్యను బయటకు పంపారు. దీంతో రోహిత్, ఆదిరెడ్డి, రేవంత్, శ్రీహాన్, కీర్తి మిగిలారు. వీరిలో ఒకరు విన్నర్ కానున్నారు.