Bigg Boss OTT Telugu: తెలుగు ప్రేక్షకులను ఉర్రూతలూగించడానికి బిగ్ బాస్ రెడీ అయ్యింది. ఈ రియాలిటీ షో ఇప్పటికే తెలుగు నాట ఎంతో పాపులర్. కేవలం గంట మాత్రమే చూసే ప్రేక్షకులకు 24 గంటలూ అందుబాటులోకి రానుంది. బుల్లితెర ప్రేక్షకులకు వినోదం అందించేందుకు మరోసారి బిగ్ బాస్ రెడీ అయ్యింది. శనివారం నుంచి బిగ్ బాస్ ఓటీటీ ప్రారంభం కానుంది.
‘బిగ్ బాస్ నాన్ స్టాప్’గా మార్చిన ఈ షోను డిస్నీ+హాట్ స్టార్ లో 24 గంటలూ లైవ్ ప్రసారం చేస్తారు. 24 గంటల పాటు నాన్ స్టాప్ గా బిగ్ బాస్ షోను చూసి ఎంజాయ్ చేయవచ్చు. నిన్న హోస్ట్ నాగార్జునతో ప్రోమోను కూడా విడుదల చేశారు.
బిగ్ బాస్ 5వ సీజన్ ఇటీవలే ముగిసింది. సన్నీ విజేతగా నిలిచారు. కంటెస్టెంట్లు చివర్లో ఎంతగానో అలరించారు. ఆ షో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. తాజాగా బిగ్ బాస్ నాన్ స్టాప్ షో మరింత వినోదాన్ని పంచడానికి రెడీ అయ్యింది. ఎందుకంటే గత సీజన్లలో పాల్గొన్న పలువురు కంటెస్టెంట్లను కూడా ఈ షోలోకి తీసుకున్నారు. దీంతో షో అంతా రచ్చరచ్చగా మారింది.
శనివారం సాయంత్రం 6 గంటలకు ఈ షో లాంచ్ కానుంది. ఈ క్రమంలోనే హీరో నాగార్జున ఈ షోకు హోస్ట్ చేస్తున్నారు. ఇప్పటివరకూ ఈ షోలో పాల్గొననున్న కంటెస్టెంట్ల వివరాలను ప్రకటించలేదు. అయితే ఓ లిస్ట్ మాత్రం ప్రచారంలో ఉంది. మరికొద్ది గంటల్లోనే ఈ షోలో ఎవరెవరు పాల్గొంటున్నది తేలనుంది.
-బిగ్ బాస్ నాన్ స్టాప్ షోలో పాల్గొనే కంటెస్టెంట్లు వీరే..
– ముమైత్ ఖాన్
-తనీష్
-ఆషురెడ్డి
-అరియానా
-అఖిల్ సార్ధక్
-మహేష్ విట్టా
-సరయూ
-హమీదా
-నటరాజ్ మాస్టర్
-రోహిణీ
-రోల్ రైడా
Also Read: అక్కా, పవన్ బావ సినిమాకు వెళ్లాను’.. పూనమ్ కొత్త పోస్ట్
ఇలా కొందరు పాత కంటెస్టెంట్లు పాల్గొంటారని సమాచారం. యూట్యూబర్ యాంకర్ నిఖిల్, యాంకర్ స్రవంతి చొక్కారావు, ఆర్జే చైతూ, బిందుమాధవి, యాంకర్ శివ, బమ్ చిక్ బమ్ బబ్లూ, కప్పు ఉఖ్యం బిగులూ వెంకట్, మిత్రాశర్మ, శ్రీరాపాక వంటి కొత్త కంటెస్టెంట్లను తీసుకున్నట్టు సమాచారం.
మొత్తం 18 మంది ఇందులో పాల్గొంటారని సమాచారం. ఈ షో 84 రోజుల పాటు జరుగుతుందని తెలుస్తోంది. ప్రేక్షకుల స్పందనను బట్టి దీన్ని పొడిగించే అవకాశం ఉందని తెలుస్తోంది.
Also Read: ప్రేమించి పెండ్లి చేసుకున్న ఈ స్టార్ హీరోలకు పిల్లలు లేక బాధపడ్డారు.. వారెవరంటే
Recommended Video: