https://oktelugu.com/

Bigg Boss 6 telugu Inaya : బిగ్ బాస్ ఇనయాను కమిట్మెంట్ అడిగిన పేరున్న హీరో… బాగోతం బయటపెట్టిన లేడీ టైగర్

Bigg Boss 6 telugu Inaya  : బిగ్ బాస్ సీజన్ 6 లో కొద్దిమంది కంటెస్టెంట్స్ మాత్రమే ప్రభావం చూపించారు. హౌస్లో ఉన్న డేస్ తో సంబంధం లేకుండా ప్రతి సీజన్లో ఎలిమినేటైన కంటెస్టెంట్స్ బాగా పాప్యులర్ అయ్యేవారు. బయటకు వచ్చాక సోషల్ మీడియాలో, ఈవెంట్స్ లో సందడి చేసేవారు. ఈ సీజన్ కంటెస్టెంట్స్ లో అలాంటి జోరు కనిపించడం లేదు. మరోవైపు సీజన్ 6 అట్టర్ ప్లాప్. ఒక సక్సెస్ ఫుల్ సీరియల్ టీఆర్పీ […]

Written By:
  • NARESH
  • , Updated On : December 11, 2022 / 02:14 PM IST
    Follow us on

    Bigg Boss 6 telugu Inaya  : బిగ్ బాస్ సీజన్ 6 లో కొద్దిమంది కంటెస్టెంట్స్ మాత్రమే ప్రభావం చూపించారు. హౌస్లో ఉన్న డేస్ తో సంబంధం లేకుండా ప్రతి సీజన్లో ఎలిమినేటైన కంటెస్టెంట్స్ బాగా పాప్యులర్ అయ్యేవారు. బయటకు వచ్చాక సోషల్ మీడియాలో, ఈవెంట్స్ లో సందడి చేసేవారు. ఈ సీజన్ కంటెస్టెంట్స్ లో అలాంటి జోరు కనిపించడం లేదు. మరోవైపు సీజన్ 6 అట్టర్ ప్లాప్. ఒక సక్సెస్ ఫుల్ సీరియల్ టీఆర్పీ కూడా బిగ్ బాస్ షోకి రావడం లేదు. వీకెండ్లో టీఆర్పీ 4-5 మధ్య ఉంటుంది. ఇక సాధారణ ఎపిసోడ్స్ 3 రేటింగ్ దాటడటమే గగనంగా మారింది.

     

    అయితే గీతూ రాయల్, రాజ్, ఫైమా వంటి కొందరు మాత్రం అభిమానులను సొంతం చేసుకున్నారు. కాగా ఇనయా లేడీ టైగర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. తప్పు ఎవరు చేసినా ఎత్తి చూపడం, సేఫ్ గేమ్ ఆడకుండా ఉన్నది ఉన్నట్లు చెప్పడం ఇనయాకు ఫేమ్ తెచ్చింది. సూర్య అంటే నాకు క్రష్ అని చెప్పి అందరి మైండ్స్ బ్లాక్ చేసింది. ఫస్ట్ వీక్ నుండి ఇనయా చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. కంటెస్టెంట్స్ అందరూ టార్గెట్ చేసినా… ఇనయా ఎప్పుడూ తగ్గలేదు. తన తీరు మార్చుకోలేదు.

    షోతో మంచి పాపులారిటీ తెచ్చుకున్న ఇనయా ఒకప్పటి వీడియోలు, ఇంటర్వ్యూలు వైరల్ అవుతున్నాయి. పరిశ్రమలో ఉన్న క్యాస్టింగ్ కౌచ్, కమిట్మెంట్ వంటి అన్ ఫెయిర్ విధానాలపై ఇనయా ఒక ఇంటర్వ్యూలో కుండబద్దలు కొట్టారు. ఆ ఇంటర్వ్యూలో ఇనయా తాను క్యాస్టింగ్ కౌచ్ ఎదుర్కొన్నాను. పలు సందర్భాల్లో కమిట్మెంట్స్ అడిగారని వెల్లడించారు.

    ఒక పేరున్న హీరో మూవీ ఆడిషన్స్ కి వెళ్ళాను. ఆడిషన్స్ జరిగాక మీరు సెలెక్ట్ అయ్యారు అన్నారు. నాకు చాలా సంతోషం వేసింది.మంచి ఆఫర్ దొరికిందని ఆనందపడ్డాను. అయితే ఇంత ఈజీగా అయిపోయిందా? అని నాకు డౌట్ కొట్టింది. వాళ్ళ మూమెంట్స్ నాకు అర్థమయ్యాయి. అనుమానం ఎందుకని అడిగేశాను. అవును కమిట్మెంట్ ఇవ్వాలి, అది కామన్ కదా? అన్నారు. నాకు కామన్ కాదు, అని వెళ్ళిపోయాను. ఇలా చాలా ఆఫీసుల్లో జరుగుతుంది. అయితే నిర్ణయం మనదే. నాకు వచ్చే ఆఫర్స్ నాకు వస్తాయి. అంతే కమిట్మెంట్స్ ఇవ్వనని చెప్పేదాన్ని. మన ప్రొఫైల్ అసలు హీరో, డైరెక్టర్స్ దాకా కూడా వెళ్లనివ్వరు. మధ్యలో అసిస్టెంట్స్, అసోసియేట్ డైరెక్టర్స్ పెద్ద కథ నడిపిస్తూ ఉంటారని ఇనయా వెల్లడించారు.