Bigg Boss 6 title winner : బిగ్ బాస్ సీజన్ 6 చివరి అంకానికి చేరుకుంది. నెక్స్ట్ ఆదివారం జరిగే గ్రాండ్ ఫినాలేతో షో ముగియనుంది. ఆడియన్స్ ఓట్ల ఆధారంగా విన్నర్ ఎవరో ప్రకటిస్తారు . ప్రస్తుతం హౌస్లో ఏడుగురు సభ్యులు ఉన్నారు. ముగ్గురు ఆల్రెడీ ఫైనల్ కి వెళ్లారు. టికెట్ టు ఫినాలే గెలుచుకున్న శ్రీహాన్ ఫైనల్ కి చేరిన ఫస్ట్ కంటెస్టెంట్ గా ఉన్నాడు. శనివారం ఎపిసోడ్లో రేవంత్, కీర్తి సేవ్ అయ్యారు. ఇంకా నామినేషన్స్ ఆదిరెడ్డి, ఇనయా, శ్రీసత్య, రేవంత్ ఉన్నారు. వీరిలో ఒకరిని ఎలిమినేట్ చేసి ఆరుగురు సభ్యులను ఫైనల్ కి పంపుతారని ప్రచారం జరుగుతుంది.

ఈ సీజన్ లేడీ టైగర్ గా పేరు తెచ్చుకున్న ఇనయా ఎలిమినేట్ అవుతున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం అవుతుంది. ఆమె ఎలిమినేషన్ దాదాపు ఖాయం కాగా… విమర్శలు వెల్లువెత్తున్నాయి. టాప్ టూ కంటెస్టెంట్ ని ఎలిమినేట్ చేయడం నిజంగా దారుణం. ఇనయా ఎలిమినేషన్ అన్ ఫెయిర్ అంటూ సోషల్ మీడియాలో ఆమె అభిమానులు ధ్వజమెత్తుతున్నారు. అయితే ఎవరు ఎలిమినేట్ అయినా, అది ఓట్ల ఆధారంగానే అని నిర్వాహకులు ఎప్పటి నుండో చెబుతున్నారు.
కాగా బిగ్ బాస్ విన్నర్ ప్రైజ్ మనీ తగ్గించిన విషయం తెలిసిందే. కోల్పోయిన అమౌంట్ ని కంటెస్టెంట్స్ టాస్క్స్ లో గెలిచి తిరిగి పొందారు. కంటెస్టెంట్స్ టాస్క్స్ ద్వారా ప్రైజ్ మనీ 47 లక్షలకు చేర్చారు. శనివారం నాగార్జున నిర్వహించిన టాస్క్ లో ఏకాభిప్రాయంతో మిగిలిన రూ. 3 లక్షలు కూడా గెలిచి టోటల్ ప్రైజ్ మనీ రూ. 50 లక్షలకు చేరుకున్నారు. కాబట్టి విన్నర్ ఎలాంటి కోత లేకుండా యాభై లక్షలు పట్టుకుపోతాడు.
యాభై లక్షలతో పాటు విన్నర్ కి సువర్ణభూమి ఇన్ఫ్రా వారు అందించే ఫ్లాట్ సొంతం అవుతుంది. సదరు ఫ్లాట్ విలువ రూ. 25 లక్షలని నాగార్జున చెప్పారు. అలాగే మారుతీ సుజుకీ బ్రీజా కార్ ఆ సంస్థ బహుమతిగా అందిస్తుంది. ఆ కారు విలువ దాదాపు రూ. 8 నుండి 10 లక్షలు ఉంటుంది. అంటే బిగ్ బాస్ సీజన్ 6 విన్నర్ దాదాపు రూ. 85 లక్షల విలువైన ప్రైజెస్ గెలుచుకుంటాడు. అంత పెద్ద మొత్తం అంటే మామూలు విషయం కాదు కదా… మరి ఆ అదృష్టవంతుడు ఎవరో? ప్రజలు ఎవరిని ఎన్నుకుంటారో? కొద్ది రోజుల్లో తేలిపోనుంది.