Inaya Sultana Remuneration: బిగ్ బాస్ తెలుగు హిస్టరీలో ఈ సీజన్ లో జరిగినటువంటి ‘అన్ ఫెయిర్’ ఎలిమినేషన్స్ ఏ సీజన్ లో కూడా జరగలేదు..ఈ వారం ఇనాయ హౌస్ నుండి ఎలిమినేట్ అవ్వడం అనేది ప్రతీ ఒక్కరికి పెద్ద షాక్..మొదటి రోజు నుండి నేటి వరుకు ఒక ఛాంపియన్ లాగ ఆమె గేమ్ ఆడింది..హౌస్ లో ఫిజికల్ గా స్ట్రాంగ్ గా ఉన్నటవంటి మగవాళ్ళతో కూడా ఆమె సరిసమానంగా పోటీపడిమరీ ఆడింది..కచ్చితంగా ఆమె టైటిల్ గెలుచుకుంటుంది అనే అందరూ అనుకున్నారు.

కానీ కనీసం టాప్ 5 లో కూడా రాకపోవడం నిజంగా బాధాకరం..విచిత్రం ఏమిటంటే ఇనాయ కంటే శ్రీ సత్య మరియు కీర్తి కి ఎక్కువ ఓట్లు రావడం అనేదే..సోషల్ మీడియా లో జరిగిన అనధికారిక పొలింగ్స్ లో ఇనాయకి టాప్ 2 స్థానం దక్కితే..శ్రీ సత్య మరియు కీర్తి కి బాటమ్ టాప్ 2 స్థానాలు దక్కాయి..అంతే కాకుండా ఇనాయకి ఉన్న ఫాలోయింగ్ సోషల్ మీడియా లో ప్రతీ రోజు మనం గమనిస్తూనే ఉన్నాము.
అలాంటి కంటెస్టెంట్ ఎలిమినేట్ అంటే జీర్ణించుకోవడం చాలా కష్టం గా అనిపిస్తుంది..పోనీ ఈమెకి రెమ్యూనరేషన్ అయినా బాగా ఇచ్చారా అంటే అది కూడా జరగలేదు..15 వారాలకు ఆమె హౌస్ ఉన్నందుకు గానూ కేవలం ఆరు లక్షల రూపాయిలు మాత్రమే పారితోషికంగా ఇచ్చారట..బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టకముందు ఇనాయ పెద్దగా ఎవరికీ తెలియదు..పలు సినిమాల్లో ఆమె హీరోయిన్ గా నటించినప్పటికీ అవి పెద్దగా ఆడలేదు.

ఫేమస్ సెలబ్రిటీ కాదు కాబట్టి ఆమెకి ఇంత తక్కువ రెమ్యూనరేషన్ ఇచ్చారని తెలుస్తుంది..కానీ ఇనాయ కి ఈ షో తెచ్చిపెట్టిన గుర్తింపు మామూలుది కాదు..బిగ్ బాస్ హిస్టరీ లో ఒక లేడీ కంటెస్టెంట్ కి ఈ స్థాయి ఫాలోయింగ్ రావడం అనేది ఎప్పుడూ కూడా జరగలేదు..కాబట్టి ఇనాయ కి ఇక నుండి సినిమాల్లో హీరోయిన్ ఆఫర్లు బలంగా వస్తాయని..ఆమె కెరీర్ ఇక నుండి వేరే స్థాయిలో ఉంటుందని అభిమానులు ఆశిస్తున్నారు..చూడాలిమరి ఆమె జాతకం రాబొయ్యే రోజుల్లో ఎలా ఉంటుందో.