Prabhas In Unstoppable: సర్వర్లు క్రాష్ అయ్యాయి ఆహా టీం క్షమాపణ చెప్పింది. సబ్స్క్రైబర్లు అల్లు అరవింద్ ను ట్రోల్ చేశారు. ఇదంతా జరిగాక ఏ తెల్లవారుజామున 3 గంటలకో అన్ స్టాపబుల్ లో ప్రభాస్ ఎపిసోడ్ స్ట్రీమ్ అవడం ప్రారంభమైంది. అటు చూస్తే మ్యాన్షన్ హౌస్ బాలయ్య, ఇటేమో సిగ్గరి ప్రభాస్.. అందరికీ ఒక రకమైన ఉత్సుకత. బాలయ్య ఏం మాట్లాడుతాడు, ప్రభాస్ ఏం చెప్తాడు.. కానీ తీరా ఫస్ట్ ఎపిసోడ్ చూస్తే తేలింది ఏమయ్యా అంటే.. బాహుబలి రేంజ్ బిల్డప్ ఇచ్చి… ఆది పురుష్ లాంటి టీజర్ వదిలారు. బాగో లేదా అంటే బాగుందని కాదు. అలాగని లేదూ అని కాదు.

క్రియేటివిటీ టీం ఏం చేస్తోంది
ఈమధ్య బాలయ్య అన్ స్టాపబుల్ లో హీరోలను తమ బంధాల గురించి చెప్పించాలని తీవ్ర ప్రయత్నం చేస్తున్నాడు. ఆ మధ్య సిద్దు ని, విశ్వక్ సేన్ ను, శర్వానంద్, అడవి శేష్… ఇలా ఎంతోమందిని అడిగి అడిగి తన మ్యాన్షన్ హౌస్ ప్రతాపాన్ని చూపించాడు. ఇక ప్రభాస్ విషయంలోనూ అదే జరిగింది. కృతి సనన్ తో తనకు ఏమీ లేదని చెప్తున్నా బాలయ్య వినిపించుకోలేదు. పైగా “మీ అమ్మకు చెప్పిన మాటలు నాకు చెప్పకు” అంటూ బాలయ్య డైలాగ్ బాగున్నప్పటికీ.. దీన్నే సాగ తీయడం వల్ల టాక్ షో నాణ్యత మీద ప్రభావం పడింది. రాధే శ్యామ్ లో పామిస్ట్ గా కనిపించిన ప్రభాస్ కు.. బాలకృష్ణ తన చేతిని చూపించి నా జాతకం ఎలా ఉందని అడిగాడు? మీకేంటి సార్ మరో 10 ఏళ్ళు బ్రహ్మాండంగా సాగుతుంది అని ప్రభాస్ సమాధానం ఇచ్చాడు. కానీ బాలయ్య చేతిలో ఆన్ స్టాపబుల్ అని రాసి ఉంటుంది. ఆహా కంటెంట్ టీం ఎంత నాసిరకంగా ఉందో చెప్పేందుకు ఇది ఒక ఉదాహరణ మాత్రమే.

బాలకృష్ణకు మాత్రమే కనిపిస్తాయట
ఇక ఈ షో లో ప్రభాస్ ను ఏదో ఒక నెంబర్ మీద ఒక బాణం విసురుతాడు. ఆ నెంబర్ ఉన్న స్లిప్పులో ప్రశ్నను బాలకృష్ణ అడుగుతాడు.. విచిత్ర మేమంటే ఆ పేపర్ పై ఎటువంటి ప్రశ్న రాసి ఉండదు.. ఇదేంటి అని అడిగితే నా ఇష్టం అని బాలకృష్ణ సమాధానం చెబుతాడు. అంతేకాదు ఆ ప్రశ్నకు సమాధానం చెప్పాలనుకుంటే చెప్పొచ్చు.. లేదా వద్దనుకోవచ్చు.. వద్దు అని చెప్పేందుకు ఒక రిమోట్ బటన్ కూడా ప్రభాస్ చేతికి బాలకృష్ణ ఇచ్చాడు.. ఒకవేళ బాలకృష్ణ అడిగిన ప్రశ్నకు ప్రభాస్ నాకు ఇష్టం లేదని రిమోట్ బటన్ నొక్కినప్పటికీ బాలకృష్ణ వదలలేదు. ఆహా టీం నాసిరకమైన పైత్యానికి ఇది ఒక గట్టి ఉదాహరణ.. ఇలా చెప్పుకుంటూ పోతే బొచ్చెడు ఉన్నాయి. మొత్తానికి బిర్యానీ పెడతామని చెప్పి… రుచి పచి లేని పెరుగన్నం పెట్టారు. అంతటి ప్రభాస్ ను తీసుకొచ్చి కిచిడి షో చేశారు. గోపీచంద్ ఎలాగో జాయిన్ అయ్యాడు కాబట్టి… రెండో పార్ట్ ఎలా ఉంటుందో అని జనాల్లో క్యూరియాసిటీ ఉంది. మరి దీన్ని ఆహా టీం ఎలా చేసిందో చూస్తే కానీ అర్థం కాదు.