Bigg Boss 6 Telugu : కంటెస్టెంట్స్ కి గోల్డెన్ ఛాన్స్ ఇచ్చిన బిగ్ బాస్..వైరల్ అవుతున్న వీడియో

Bigg Boss 6 Telugu : ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లో ఎప్పుడు ఏమి జరుగుతుందో ఎవ్వరూ ఊహించలేకపొతున్నారు..టాస్కుల విషయం లో మరియు ఎలిమినేషన్స్ విషయం లో హౌస్ మేట్స్ కి మరియు ఆడియన్స్ కి ట్విస్టు మీద ట్విస్టు ఇస్తూనే ఉన్నాడు..ప్రారంభం లో నత్తనడకన హౌస్ నడుస్తుంది అని ప్రేక్షకుల నుండి నెగటివ్ కామెంట్స్ ని రప్పించుకున్న ఈ రియాలిటీ షో ని , ఆ తర్వాత ఎంతో ఆసక్తికరమైన టాస్కులతో ప్రేక్షకుల్లో ఉత్కంఠ […]

Written By: NARESH, Updated On : December 5, 2022 9:04 pm
Follow us on

Bigg Boss 6 Telugu : ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లో ఎప్పుడు ఏమి జరుగుతుందో ఎవ్వరూ ఊహించలేకపొతున్నారు..టాస్కుల విషయం లో మరియు ఎలిమినేషన్స్ విషయం లో హౌస్ మేట్స్ కి మరియు ఆడియన్స్ కి ట్విస్టు మీద ట్విస్టు ఇస్తూనే ఉన్నాడు..ప్రారంభం లో నత్తనడకన హౌస్ నడుస్తుంది అని ప్రేక్షకుల నుండి నెగటివ్ కామెంట్స్ ని రప్పించుకున్న ఈ రియాలిటీ షో ని , ఆ తర్వాత ఎంతో ఆసక్తికరమైన టాస్కులతో ప్రేక్షకుల్లో ఉత్కంఠ ని కలిగించేలా చేసారు.

ఫలితంగా ఇప్పుడు టీఆర్ఫీ రేటింగ్స్ బాగున్నాయి..అయితే కొద్దీ వారాల క్రితం బిగ్ బాస్ టైటిల్ గెలిచే క్యాష్ ప్రైజ్ ని టాస్కులో పెట్టి గేమ్ ఆడించి 50 లక్షల రూపాయిల నుండి 38 లక్షలకు బిగ్ బాస్ పడిపొయ్యేలా చేసిన సంగతి తెలిసిందే..కంటెస్టెంట్స్ ని రాచి రంపాలు పెట్టడమే కాకుండా బోనస్ గా ఇలాంటి డిస్కౌంట్స్ ఏమిటి అంటూ నెటిజెన్స్ నుండి తీవ్రమైన విమర్శలను ఎదురుకుంది ఈ రియాలిటీ షో.

అయితే పోయిన డబ్బులు మొత్తం మళ్ళీ వెనక్కి రప్పించుకునే అద్భుతమైన అవకాశం ని బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కి ఈ వారం కల్పించాడు..వివిధ టాస్కుల ద్వారా ఈ కాష్ ప్రైజ్ అమౌంట్ ని పెంచబోతున్నారు..మరి కంటెస్టెంట్స్ బాగా ఆడి క్యాష్ ప్రైజ్ ని 50 లక్షల రూపాయలకు ఎగబాకేలా చేస్తారో లేదో చూడాలి..అంతే కాకుండా గత వీకెండ్ లో నాగార్జున కంటెస్టెంట్స్ కి మరో శుభవార్త తెలిపాడు..టైటిల్ విన్నర్ కి కేవలం క్యాష్ ప్రైజ్ మాత్రమే కాదు..25 లక్షల రూపాయిలు విలువ చేసే అందమైన ఇల్లుని బహుమతిగా కూడా ఇవ్వబోతున్నట్టు చెప్పుకొచ్చాడు.

చూడాలిమరి టైటిల్ గెలుచుకొని ఈ అద్భుతమైన అవకాశం ని పొందబోతున్న ఆ కంటెస్టెంట్ ఎవరు అనేది..ప్రస్తుతం ఉన్న వోటింగ్ ప్రకారం రేవంత్ , ఇనాయ మరియు రోహిత్ మధ్య టైటిల్ పోరు నువ్వా నేనా అనే విధంగా సాగుతుంది..గత రెండు వారల నుండి శ్రీహాన్ నామినేషన్స్ లో లేదు కాబట్టి అతని ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది అనేది తెలియడం లేదు.