https://oktelugu.com/

Bigg Boss Divi : అద్దం ముందు అన్నీ విప్పేసి మరీ చూపించిన దివి!

Bigg Boss Divi : ఒకప్పుడు సినిమాల్లో అవకాశాలు టాలెంట్‌ టెస్ట్‌ ద్వారా వచ్చేవి. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. యువతుల సోషల్‌ మీడియా అకౌంట్లు చూసి డైరెక్టర్లు తమకు కావాల్సిన వారిని ఎంపిక చేసుకుంటున్నారు. దీంతో అమ్మాయిలు కూడా సోషల్‌ మీడియా వేదికగా చెచ్చిపోతున్నారు. తెలుగు అమ్మాయిలు కూడా తామేం తక్కువ కాదన్నట్లు గ్లామర్‌ ఫొటోలు షేర్‌చేస్తూ ఆఫర్లు సొంతం చేసుకుంటున్నారు. ఇలాంటి వారిలో సొట్టబుగ్గల సుందరి దివి వాధ్యా ఒకరు. ఆకట్టుకునే అందం, అదిరిపోయే […]

Written By:
  • Neelambaram
  • , Updated On : March 5, 2023 / 02:16 PM IST
    Follow us on

    Bigg Boss Divi : ఒకప్పుడు సినిమాల్లో అవకాశాలు టాలెంట్‌ టెస్ట్‌ ద్వారా వచ్చేవి. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. యువతుల సోషల్‌ మీడియా అకౌంట్లు చూసి డైరెక్టర్లు తమకు కావాల్సిన వారిని ఎంపిక చేసుకుంటున్నారు. దీంతో అమ్మాయిలు కూడా సోషల్‌ మీడియా వేదికగా చెచ్చిపోతున్నారు. తెలుగు అమ్మాయిలు కూడా తామేం తక్కువ కాదన్నట్లు గ్లామర్‌ ఫొటోలు షేర్‌చేస్తూ ఆఫర్లు సొంతం చేసుకుంటున్నారు. ఇలాంటి వారిలో సొట్టబుగ్గల సుందరి దివి వాధ్యా ఒకరు. ఆకట్టుకునే అందం, అదిరిపోయే నటనతోపాటు అప్పుడప్పుడూ హాట్‌షో చేస్తూ రెండు రాష్ట్రాల్లో ఫేమస్‌ అయిపోయింది ఈ చిన్నది. కొంత కాలంగా వరుస సినిమాలతో సందడి చేస్తోంది. అలాగే, సోషల్‌ మీడియాలోనూ దివి విపరీతంగా హడావిడి చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ భామ ఓ హాట్‌ వీడియోను వదిలింది.

    సినిమాలో అప్పుడే ఎంట్రీ..
    దివి వాధ్యా ‘లెట్స్‌ గో’ అనే సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ‘సీన్‌ నంంబర్‌ 72’తో పాటు చాలా చిన్న చిత్రాల్లో లీడ్‌ రోల్‌ చేసింది. అలాగే, సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు నటించిన ’మహర్షి’ మూవీలోనూ చిన్న పాత్రలో మెరిసింది. ఇలా ఆరంభంలోనే ఎన్నో చిత్రాల్లో నటించినా ఆమెకు గుర్తింపు, పేరు మాత్రం రాలేదనే చెప్పాలి.

    కేరీర్‌ను మార్చేసిన ‘బిగ్‌బాస్‌’..
    వరుస సినిమాలతో దూసుకుపోతోన్న టైంలోనే దివి వాధ్యాకు బిగ్‌ బాస్‌ నాలుగో సీజన్‌లో కంటెస్టెంట్‌గా పాల్గొనే చాన్స్‌ వచ్చింది. ఇందులోకి సాదాసీదాగానే ఎంట్రీ ఇచ్చిన ఈ భామ అందంతోపాటు ఆటతో విశేషంగా ఆకట్టుకుంది. అలాగే నిజాయితీగా ఉంటూ మంచి పేరు తెచ్చుకుంది. కానీ, మధ్యలోనే ఎలిమినేట్‌ అయిపోయింది. అయినా ఆ షో ఆమె కెరీర్‌ను మార్చేసింది.

    వరుస ఆఫర్లు.. హాట్‌ షోలతో..
    దివి వాధ్యాకు బిగ్‌ బాస్‌షో వల్ల ఆఫర్లు వెల్లువెత్తాయి. ఫలితంగా ఈ బ్యూటీ ఈ మధ్య కాలంలోనే ‘క్యాబ్‌ స్టోరీస్‌’, ‘లంబసింగి’ అనే చిత్రాల్లో హీరోయిన్‌గా చేసింది. కాన్సెప్ట్‌ ఫిలిమ్స్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌లో ఓ మూవీలో భాగమైంది. ఈ క్రమంలోనే ‘నయీం డైరీస్‌’ మూవీలో దివి చేసిన హాట్‌సీన్‌ వల్ల సెన్సేషన్‌ అయిపోయింది. ఫలితంగా ఆమెకు మరిన్ని సినిమాలు వచ్చాయి.

    చిరు చాన్స్‌తో మరిన్ని అవకాశాలు..
    దివి వాధ్యా అందానికి ఫిదా అయిపోయిన చిరంజీవి.. ‘భోళా శంకర్‌’ సినిమాలో చాన్స్‌ ఇస్తున్నట్లు బిగ్‌బాస్‌ స్టేజ్‌పైనే ప్రకటించారు. అయితే, ఆయన ’గాడ్‌ ఫాదర్‌’లో ఆమెకు మంచి పాత్రను ఇచ్చారు. ఏకంగా చిరంజీవినే మోసం చేసే పాత్రలో నటించిన దివి వాధ్యా న్యాయం చేసిందనే చెప్పాలి. ఈ కారణంగా ఆమెకు మరిన్ని భారీ సినిమాల్లో అవకాశాలు దక్కుతున్నాయి.

    అందులో మాత్రం ఫుల్‌ బిజీ
    నటిగా పరిచయం అవకముందు నుంచే దివి వాధ్యా సోషల్‌ మీడియాలో చురుకుగా ఉంటోంది. ఇందులో భాగంగానే ఈ తెలుగు భామ తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను, విశేషాలను ఫ్యాన్స్‌తో షేర్‌ చేసుకుంటోంది. అలాగే ఫొటోలు, వీడియోలు వదులుతోంది. ఈ మధ్య కాలంలో మరింత యాక్టివ్‌గా ఉంటూ తన ఫాలోయింగ్‌ను భారీగా పెంచుకుంటోంది. ఇందుకోసం ఓ రేంజ్‌లో అందాలను ఆరబోస్తోంది. ఘాటు ఫొటోలు, వీడియోలను ఇంటర్నెట్‌లో వదులుతూ కుర్రకారును ఊరిస్తోంది.

    తాజాగా హాట్‌ వీడియో..
    లోకల్‌ బ్యూటీ దివి తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ఓ హాట్‌ వీడియోను షేర్‌ చేసింది. ఇందులో ఆమె ఏకంగా షర్ట్‌ బటన్స్ మొత్తం తీసేసి బ్రాతో రెచ్చిపోయింది. అలాగే బుల్లి నిక్కరులో అద్దం ముందు నిల్చుని ఫోజులిచ్చింది. ఇలా తన అందాలను చూపిస్తూ రెచ్చగొడుతోంది. ఈ వీడియోకు భారీ రెస్పాన్స్‌ వస్తోంది. బాగా వైరల్‌ అవుతోంది.